నీ ధ్యాసే నా శ్వాస గా
నీ ఎద సవ్వడి నా హృది స్పందన గా
వరమీయవా ప్రియా నిను జత చేరగా ,నీ సన్నిధి చేరగా
పరవశమీయవా నా పరువాల మిసమిసలో అనురాగ పదనిసవై
కనుల మాటునా ,కనురెప్ప చాటునా ,నీ మోము కదలనంటుంటే,
ముగ్ధనయి నిలిచా ..అల స్వప్నాల ఝరిలో ,ఇల వలపుల వనంలో
కనుల మాటునా ,కనురెప్ప చాటునా ,నీ మోము కదలనంటుంటే,
ముగ్ధనయి నిలిచా ..అల స్వప్నాల ఝరిలో ,ఇల వలపుల వనంలో
నా నవ్వుల్లో విరబూసిన మరువంపు మొలక నీవు .
నువ్వు మసలిన దారుల్లో పారిజాత సుమ వీచిక నేను
నా అధరం పై కదలాడే మధురమయిన నీ స్మరణతో
మాటరాని మూగనయ్యా మరో పదం పలకలేక
నా తనువున ,నా హృది అణువణువున కలగలిసిన వేణువు నీవయితే
నీ ప్రణయ బృందావనమున విహరించే నీ ప్రేమిక నేగానా .
ఈ ప్రేమలేఖ వ్రాస్తున్నా!ఒక క్షణమూ మనలేక
నీ ఎడబాటు ఓర్వలేక ,నిరీక్షించలేక ,
అరుదెంచలేవా , అరుదయిన నీరాక కానుక నీవా
నవ మన్మధాకార ,నవనీతచోరా నీ రాకకై వేచియున్న నీ రాధిక కోసం .
(ఆ నంద గోపాలుని జతగానిగా తలచి పరవశిస్తూ ... )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి