హృదయపు దొంతరలో
ఏదో వింత వింత
నులి వెచ్చని అనుభూతులు ., ,
ఆ గగనమే సరిహద్దుగా కట్టలు త్రెంచుకొన్న ప్రేమోద్వేగంతో
మది అంతా మమేకమై ప్రణయ వాహినీ ఝరిలో . ఒక పగలు ,ఒక రేయి ,ప్రతి నిమిషం ,
భారంగా ,ఆకలికి తావు లేక ,దప్పికంటే అనుభవానికి రాక ,అరనిమిషంపాటైనా అడుగులు ఒక చోట నిలువక ,
నిదుర స్తానాన్ని ,ఎదురుచూపు భర్తీ చేసి ,నిరీక్షణ లో నిర్దాక్షిణ్యంగా తెల్లారిపోతుంటే ,తెల్లబోయి చూస్తూ ..
కదులుతున్న కఠినమైన కాలాన్ని .
చినుకు రాలినా ,చిగురు తొడిగినా ,
ఏ కువకువ సవ్వడి విన్నా తన రాకని భ్రమించి ,పరిభ్రమిస్తూ ..
ప్రణయ నగరి చుట్టూరా ...
నిప్పులు చెరిగే సూరీడైనా ,
వెన్నెల పంచే నెలరాజైనా
తన తలపులోనే తలమునకలవుతూ ,
ఒకేలా అగుపిస్తుంటే , చెదరని నగుమోమే కన్నుల వాకిల్లో విరిసిన ముగ్గల్లే తారసపడుతుంటే .
వద్దన్నా వినకుండా ముసిరే తీయని ఊహలతో మది సతమతమవుతుంటే
నిలకడ లేని అడుగుల.తడబడి తత్తరపడుతుంటే ,.. కనులముందు ప్రపంచమంతా ప్రణయ నందనవనమల్లె మైమరపిస్తుంటే ,
అది ప్రేమో ,ఏమో .. కాదుకాదు ప్రేమే నేమో .... (ప్రతీ హృదయం ఈ అనుభూతిని ఏదో ఒక తరుణం అనుభవించే ఉంటుంది కదా .. )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి