కలకంటి కంటికి కాటుక గా దిద్దినదేమో చిమ్మ చీకటి .
లలితాంగి ముంగురులై మురిపించెనేమో ఆ నీలి మేఘం .
కొలనుల్లో కమలాలు విరిసి మెరిసెనేమో ఆ కమలాక్షి కన్నులై
ఎలకోయిల ఎదురై తన గాత్రం అరువిచ్చెనేమో ఈ చక్కెరబోణికి
విరిబోణి మేను కి మెరుపులద్దేనేమో ఆ గగనపు నక్షత్రం
రాయంచ సొగసునంత ఈ అంచయాన సొగసుల్లో ఒలకబొసేనేమో
నెలరేడు ఎన్నియల జల్లు కురిపించెనేమో నీ మోము సౌందర్య మతిశయించంగ
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి