పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

27, జూన్ 2015, శనివారం

ఆలోచించండి ?



గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తేలుతున్న మరమ్మత్తు చేయలేని మరబొమ్మల్లాంటి మందుబాబుల మద్యపాన వ్యసనాని కి  ,ఆమోద శాసనంతో బలం చేకూర్చి ,,
 జీవితాలను నిర్దాక్షిణ్యంగా ఏమార్చి ,
సగటు మనిషి బలహీనతనే ధన బలంగా  మార్చి,
సందుకొకటి ,వీధికొకటి ,ఊరికి నడిబోడ్డుల్లో ,
నిత్యావసర సరుకుల్లాపెచ్చు రేగి  విచ్చలవిడి పర్మిట్లను అందిస్తే ,  
ఆడపడచుల పుస్తెలు  ముక్కలు గావించే  ,  మద్యపు భాండాగారం  కనుసన్నల అడుగడుగున   అగుపిస్తే ,  అంధకారమయిపోదా ...   మద్య తరగతి జీవనగమనం .విచ్చిన్నమయి పోదా !భావి యువత భవితవ్యం .
ఆలోచించండి . అరనిమిషం పాటైనా .,... .. ఆదమరచకండి సమాజ సౌభాగ్యాన్ని ., ... 
                                                                                   సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి