పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
8, నవంబర్ 2014, శనివారం
1, నవంబర్ 2014, శనివారం
అధినాయకుడు
మా పాలి ఆ దైవం నియమించిన బంటువి .
కావయ్యా .. .. నీవూ మామూలు నాయకుడువి .
మొక్కవోని ధీక్షలో మొట్టమొదటి సైనికుడవు .
పొగడాలని కాదు నిన్ను . ఎడతెగనీ నీ తెగింపు .
కుదేలయిన వైశాఖికి తిరుగులేని ఓదార్పు .
హుదూద్ బెబ్బులి పంజా దెబ్బకి కమిలిన మా గుండెల్లో
కొండంతటి ధైర్యం పూసి , కర్తవ్యం తక్షణమే స్ఫురింపచేసి
కార్యోన్ముఖులను చేసి ,కాంతి రేఖ నీవై నిలిచి
విశాఖ విషణ్ణ వదనాలలో కొత్త దివ్వె వెలిగించి
చిందర వందరయిన విశాఖను బహు సుందర నందన వనముగ మార్చాలని
ఒక ఋషిలా శ్రమించి "అధినాయకుడను " పదాన్ని ఆత్మీయతతో అధిరోహించి
అలసిన మాకు బాసట నిలిచిన ఆత్మబంధువు నీవు .
తిన్నావో .. లెదో .. .. కన్నతల్లి గుండె నీది . మాకు తిండి మెతుకులివ్వాలని ఆరాటంలో ....
కునుకయినా .. తీశావో ... లెదో ... చెదిరిన మా గూళ్ళే ... నీ కలలోకొచ్చి .
నిన్నటి కటిక చేదు విష విలయాన్ని నీల కంఠుని వోలె నీలోనే దాచి
నీ కరుణామృత ధారలతో మాకూరటనిచ్చి
పెను తుఫాను సైతం తలవంచేలా ...........
చేజారిన బ్రతుకుల్లో , బేజారయిపోయిన మా గుండెల్లో
మనోధైర్య బీజాలను , మానవతా తేజాన్ని మాలో నింపి, మోడువారిన నేలపైన కొత్త చివురులు తొడిగించి
మార్గదర్శి వై నిలిచి , మా ఇలవేలుపువయినావు .
ఆ రాకాసి సుడిగాలి రక్కసి కర్ఖశ క్రీడలో చేతలుడిగి నా విశాఖ నడివీధిలో
నిల్చుంటే ,శిలలా వెలవెలబోతే ,కన్నేర్రజేసిన కడలి ప్రకోపానికి కకావికలమై , కళా విహీనమయి
మరుభూమిని తలపిస్తే ,
కారు చీకటైన మా బ్రతుకుల్లో వెన్నెల కురిపిస్తానని వాగ్ధానం చేసిన విశాఖ చందురుడవు నీవు
పడి లేచే కెరటానికి ఉందా .. అలసట అంటూ ....
మరలా మనం వెలగాలని మార్గం నిర్దేశించి
మొద్దు నిద్దరోతున్న నాయకులను ఉలిక్కిపాటు చేసి
అధికార యంత్రాంగాన్ని ఆసాంతం కుదిపేసి
నవ విశాఖ నిర్మాణం సంకల్పించి ,కధన రంగ సింగంలా రంగంలో దూకి
కర్తవ్య ధీరుడవై ముందుకు నడచేవు . మాలో ఒకడిగ నిలిచావు .
మా ఆశా జ్యోతిగా నిలిచేవు .
(నిన్నటి హుదూద్ విలయంలో విలవిలలాడిన నాటి నుండి నేను ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎన్నో విదాల ప్రయత్నించి
విఫలమయి నా మనస్సులోని కృతజ్ఞతను , వేవేల గుండెల్లో భావనను
ఆయనకు చేరాలనే చిరు ఆకాంక్షతో మీ అందరితో పంచుకొంటున్నాను .. .. ఒక సాదారణ గృహిణి )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
21, సెప్టెంబర్ 2014, ఆదివారం
ఒట్టేసి చెప్పెయ్యవా !
ప్రియా ! నీవు నీ సతి వలపుల వెల్లువలో పరవశమై ఆ ప్రణయ రస సుధా ఝరిలో మునిగి
పంచ వన్నెల పసిడి స్వప్నాల సిరి చందనాల పరిమళాల ఆదమరచి నిదురోతుంటే
నీ పుట్టిన రోజని నీ చుట్టూ చేరి చెట్టూ చేమా , శుభాకాంక్షలన్నాయి
నింగిలోని నులు వెచ్చని చంద్రికలు వెన్నియలను వెంటబెట్టుకొచ్చాయి. నీకు శుభాకాంక్షలంటూ
అరవిరిసిన గులాభీ నిదురించిన నీ మోమునే గోముగా చూస్తుంది . నీ మోమును గని తన వలె సుమమనుకొని
నీలి మేఘాలు నీకోసమే లేఖ రాసి పంపాయి నీరజాక్షునికి .నీకు నిండు నూరేళ్ళు వర్ధిల్ల వరమిమ్మని
కలువ చెలియలు , కులుకు చిలుకలు , మకరందపు తుమ్మెదలు , మైమరపించే మరు మల్లియలు
తలో కానుకను వెంట బెట్టుకొచ్చాయి . నీ పుట్టిన రోజుకి . పట్టరాని ప్రేమ సంతకాలతో
ప్రకృతి అంతా పరవశించి పోతుంటే , నీ సతి మాత్రం రెప్ప వేయక చూస్తుంది . నీ తెరిచిన కనురెప్పల మాటున
చప్పుడు చేయక కూచున్నది తనే నా ! అని . తనువూ మనసూ ఏకం చేసి తపో కన్యకలా తపిస్తోంది . అను క్షణం నీ ప్రణయ కటాక్ష వీక్షణాలకై . ఈ పుట్టిన రోజయినా ఒట్టేసి చెప్పెయ్యవా ! నీవే నా ప్రియ సఖివని ,
పదివేల జన్మలకూ ఈ బంధమే పదిలమనీ , నా చేయినెన్నడు వీడిపోనని
నా శ్వాసలో నీ ధ్యాసనే కలగలిపి తన వలపుల, నీ తలపుల సుమ మాలతో వేచియుంది . నీకు శుభాకాంక్షలంటూ ...
.....
29, ఆగస్టు 2014, శుక్రవారం
28, ఆగస్టు 2014, గురువారం
తెలుగు భాషా దినోత్సవo గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా
తెలుగు నేలపై కురిసిన సుధా మధుర మాధుర్యం విరి తేనియ మకరందం మన గిడుగు
పర్వతాలపేటయందుదయించిన తెలుగు పర్వత శిఖరం మన పంతులు
గిడుగు వారిఇంట జనించిన పిడుగు లాంటి తెలుగు కలికితురాయి
గ్రాంధికపు కౌగిలి నుండి సాహిత్యాన్ని వ్యవహారిక భాషకూ వరమిచ్చిన వ్యావహారిక భాషోద్దరుడు
మామూలు మనిషికీ మధురమయిన సాహిత్యం చవి చూపిన సరళ కవితా నిర్దేశకుడు
సమాజానికి చేరువగా సాహిత్యాన్ని అలవోకగా అందరికీ అందించిన నవ కవితా వైతాళికుడు
ఆ మహోన్నతుని అడుగు జాడఏవత్ తెలుగు భాషసరి కొత్త వెలుగు జాడ
కన్నతల్లి తేట తెలుగులమ్మకు సహజ మెరుగులు అద్దిన మేటి చిత్రకారుడు
తన అక్షరాల అల్లికతో కలానికి కొత్త కళను నేర్పిన కళా ప్రపూర్ణుడు
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
18, ఆగస్టు 2014, సోమవారం
ఎట్టా చేరను కిట్టయ్యా
ఎట్టా చేరను కిట్టయ్యా నిన్నెట్టా చేరను కిట్టయ్యా
చెట్టా పట్టాలేస్తావు మళ్ళీ పత్తా లేనే లేవు
చుట్టూ నువ్వే ఉంటావు తీరా కనికట్టేదో చేస్తావు
చెట్టూ చేమల మాటున నక్కి నన్ను అష్టాకష్టాలెడతావు
హద్దు లేని ప్రేమంటావు . నీ ముద్దు చెలియ నేనంటావు
ముద్దుగుమ్మల చెంత చేరి మైమరచి రాసలీలలాడుతావు
వెన్నముద్ద నన్నడిగి మిన్నకుండిపోతావు
నీ సన్న చెక్కిలి నవ్వుతో చెలియల మనసును దోచేస్తావు
నా హృదయపు తలుపులు నీకై తెరిచా కన్నయ్యా
నీ వలపుల తలపులు మాత్రం పలువురిపైనా పరిచేవా
నా గుండె సప్పుడు విన్నావో ఎప్పుడూ కిట్టయ్యంటాది
మల్లె చెండూ నీ మనసుమాత్రం మగువల మద్యనే మారుతుంటది
ఎన్ని జన్మాలెత్తాలయ్యా నల్లనయ్యా
నీ ఎద సన్నిధి చేరుటకై ఓ చల్లనయ్యా
నువ్వెన్నెన్ని చిన్నెలు చేసినా వెన్నదొంగా .. నిన్ను వీడను
నీ తలపుల మకరందపు సుధను కలనైనా మరువను నేను
నిను చేరే దారిని సరళం చేస్తే గరళాన్నైనా సేవించేస్తా
నిను చూసే భాగ్యం నా కనులకు ఇస్తే అంధకారంలోనూ ఆనందిస్తా
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
17, ఆగస్టు 2014, ఆదివారం
నన్నెరుగవా.....
నన్నెరుగవా !కృష్ణా .. నన్నెరుగవా !
నన్నెరుగవా .. కృష్ణా .. నన్నెరుగవా ...
మన్ను తిన్న చిన్ని కృష్ణా .. నన్నెరుగవా
కన్నె మానసచోరా .. కృష్ణా .. నన్నెరుగవా
వెన్నముద్దలు ,జున్నుముక్కలు దోచుకొన్న
చిలిపి కృష్ణా నన్నెరుగవా ..
దోబూచులాడుకొన్నాం నన్నెరుగవా
తాయిలాలు పంచుకొన్నాం నన్నెరుగవా
నీ వేణువునకు మైమరచిన నన్నెరుగవా
బృందావన మురళీ లోల నన్నెరుగవా
అందచందాల మోహనకృష్ణ నన్నెరుగవా
నంద భూపాల గోపాల కృష్ణా నన్నెరుగవా
యశోదమ్మ ముద్దుల కృష్ణా నన్నెరుగవా
రేపల్లెనేలేటి మురిపాల కృష్ణా .. నన్నెరుగవా
నీ మది దోచిన ప్రియసఖి నే నన్నెరుగవా
నీలమేఘశ్యామా కృష్ణా .. నన్నెరుగవా
నీ చెలిమికై నిరీక్షించె నేచ్చేలినే .. నన్నెరుగవా
నీ తలపులలో వేచియున్న నీ రాధను నేనే .. నన్నెరుగవా
పారిజాతపూలు నా దోసిట నింపి
నీ రాకకై వేచి యుంటి .. నన్నెరుగవా
వేగిరముగా రమ్మంటూ జాగరాలు చేస్తున్నా
నా కన్నె మనసు దోచుకొన్న కన్నయ్యా
కలవరపెట్టకచెప్పు నన్నెరుగవా ...
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
నన్నెరుగవా .. కృష్ణా .. నన్నెరుగవా ...
మన్ను తిన్న చిన్ని కృష్ణా .. నన్నెరుగవా
కన్నె మానసచోరా .. కృష్ణా .. నన్నెరుగవా
వెన్నముద్దలు ,జున్నుముక్కలు దోచుకొన్న
చిలిపి కృష్ణా నన్నెరుగవా ..
దోబూచులాడుకొన్నాం నన్నెరుగవా
తాయిలాలు పంచుకొన్నాం నన్నెరుగవా
నీ వేణువునకు మైమరచిన నన్నెరుగవా
బృందావన మురళీ లోల నన్నెరుగవా
అందచందాల మోహనకృష్ణ నన్నెరుగవా
నంద భూపాల గోపాల కృష్ణా నన్నెరుగవా
యశోదమ్మ ముద్దుల కృష్ణా నన్నెరుగవా
రేపల్లెనేలేటి మురిపాల కృష్ణా .. నన్నెరుగవా
నీ మది దోచిన ప్రియసఖి నే నన్నెరుగవా
నీలమేఘశ్యామా కృష్ణా .. నన్నెరుగవా
నీ చెలిమికై నిరీక్షించె నేచ్చేలినే .. నన్నెరుగవా
నీ తలపులలో వేచియున్న నీ రాధను నేనే .. నన్నెరుగవా
పారిజాతపూలు నా దోసిట నింపి
నీ రాకకై వేచి యుంటి .. నన్నెరుగవా
వేగిరముగా రమ్మంటూ జాగరాలు చేస్తున్నా
నా కన్నె మనసు దోచుకొన్న కన్నయ్యా
కలవరపెట్టకచెప్పు నన్నెరుగవా ...
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
15, ఆగస్టు 2014, శుక్రవారం
జయహో నా భారత ధరిత్రి
వీరులకు , ధీరులకు జన్మనిచ్చిన ధన్యశ్రీ
కవిత్రయం కన్నతల్లి పుణ్యశ్రీ నా తల్లి భారతి
సస్య శ్యామల దివ్య ధాత్రి నా ధరిత్రి
సృష్టి సిగలో మెరిసిన వాడని కుసుమం నా ధరిత్రీ
ఉగ్గుపాలతోనే ఇకమత్యం కలిపిచ్చిన సమైక్య భారతి
గోరుముద్దలతోనే మానవతను నేర్పించిన కారుణ్య మూర్తి
తన సంస్కృతీ సౌరభాలు నలుదిశలా వెదజల్లిన నా తల్లి భారతి
పరాయి పంచన బందీ అయి తల్లడిల్లి జనకరాజ పుత్రి లా
ఓరిమితో తన బిడ్డలత్యాగంతో దాస్య శృంఖలాలు తెంచుకొన్న నా స్వతంత్ర భారతి
వేవేల వేదాల ఘోషించిన పరమ పావన చరిత నా తల్లి భారతి
వెలకట్టలేని విలువల గని ,సాంప్రదాయ , సంస్కారాలలో ఎడతెగని కీర్తి
కుల మతాలకతీతమయి , శాంతి , అహింసలకు ఆలవాలమయినట్టి అమృతమూర్తి
అలరారే పసిడి మనసున్న కొంగు బంగారు తల్లి మము గన్న భారతి
ఒక బుద్ధుని ,ఒక అశోకుని మనకొసగిన తల్లి
ఒక బాపూ కి జన్మనిచ్చిన ధన్య చరిత నా తల్లి భారతి
హిమశిఖరపు మారుతాన్ని , పలనాటి పౌరుషాన్ని
పుణికిపుచ్చుకొన్న పునీత నా తల్లి భారతి
అల్లూరిని అల్లారుముద్దుగా పెంచి
అమరవీరులను కన్న నా మాతృమూర్తి ధీరో ధాత్రి
గంగా ,యమునా ,కృష్ణా ,పెన్నా
జీవన నదులతో అక్షయమై ,సుభిక్షమై సాక్షాత్తు అన్నపూర్ణ నా తల్లి
అందులకే మనమందరమూ భారతి బిడ్డలమైనందుకు
గర్విద్దాం . కన్నతల్లి ఋణం తీర్చగ
మన భరత ఖ్యాతిని ఇనుమడింపచేద్దాం
ఎల్లలు దాటి మన కన్నతల్లి ఔన్నత్యం చరిత్రలో పసిడి అక్షరాల లిఖిద్దాం
అవనిపై అదృష్టవశాత్తూ భారత బిడ్డలమైనందుకు బ్రతికి ఉన్నంతవరకు
తల్లి భారతికి జయహో అందాం,భారతమాతకి అభివందనాలు తెలుపుదాం
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
ఉగ్గుపాలతోనే ఇకమత్యం కలిపిచ్చిన సమైక్య భారతి
గోరుముద్దలతోనే మానవతను నేర్పించిన కారుణ్య మూర్తి
తన సంస్కృతీ సౌరభాలు నలుదిశలా వెదజల్లిన నా తల్లి భారతి
పరాయి పంచన బందీ అయి తల్లడిల్లి జనకరాజ పుత్రి లా
ఓరిమితో తన బిడ్డలత్యాగంతో దాస్య శృంఖలాలు తెంచుకొన్న నా స్వతంత్ర భారతి
వేవేల వేదాల ఘోషించిన పరమ పావన చరిత నా తల్లి భారతి
వెలకట్టలేని విలువల గని ,సాంప్రదాయ , సంస్కారాలలో ఎడతెగని కీర్తి
కుల మతాలకతీతమయి , శాంతి , అహింసలకు ఆలవాలమయినట్టి అమృతమూర్తి
అలరారే పసిడి మనసున్న కొంగు బంగారు తల్లి మము గన్న భారతి
ఒక బుద్ధుని ,ఒక అశోకుని మనకొసగిన తల్లి
ఒక బాపూ కి జన్మనిచ్చిన ధన్య చరిత నా తల్లి భారతి
హిమశిఖరపు మారుతాన్ని , పలనాటి పౌరుషాన్ని
పుణికిపుచ్చుకొన్న పునీత నా తల్లి భారతి
అల్లూరిని అల్లారుముద్దుగా పెంచి
అమరవీరులను కన్న నా మాతృమూర్తి ధీరో ధాత్రి
గంగా ,యమునా ,కృష్ణా ,పెన్నా
జీవన నదులతో అక్షయమై ,సుభిక్షమై సాక్షాత్తు అన్నపూర్ణ నా తల్లి
అందులకే మనమందరమూ భారతి బిడ్డలమైనందుకు
గర్విద్దాం . కన్నతల్లి ఋణం తీర్చగ
మన భరత ఖ్యాతిని ఇనుమడింపచేద్దాం
ఎల్లలు దాటి మన కన్నతల్లి ఔన్నత్యం చరిత్రలో పసిడి అక్షరాల లిఖిద్దాం
అవనిపై అదృష్టవశాత్తూ భారత బిడ్డలమైనందుకు బ్రతికి ఉన్నంతవరకు
తల్లి భారతికి జయహో అందాం,భారతమాతకి అభివందనాలు తెలుపుదాం
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
14, ఆగస్టు 2014, గురువారం
7, ఆగస్టు 2014, గురువారం
మరవకురా ....
నా అందెల రవళి అలికిడిలోనూ చెలికాడా నీ పలుకుల సవ్వడి వింటున్నా
సాయం సందియ వెలుతురులో ప్రతి కదలికలో నీ నగుమోమే కనుగొన్నా
నిద్దురలోనూ ,మెలకువలోనూ ,నా కనుపాపలలో కదలాడి కలవరపరచి
వదలక నన్ను నిమిషము మాత్రమూ నీ తలపులు తరచి తరచి వెంటాడి
చల్లని పిల్లగాలి తాకినా మేను వేసవినే తలపిస్తుంటే తాళలేక
నీ అల్లరి ఊహల ఒరవడిలో అల్లంత దూరంలో ఉండిపోయా నాకు నేను
మనమల్లుకున్న ఆశల పొదరింట్లో నీ కోసమే నే నిరీక్షిస్తున్నా నువ్వొస్తావని
గొల్లున గోల చేస్తున్నాయి మరుమల్లికలు నా సరసన నువ్వు లేవని . వారిస్తున్నా వినకుండా
మన ఇరువురి ప్రణయం ఎరిగిన సెలయేరు గుచ్చి గుచ్చి అడుగుతుంది నీవెక్కడని
వేవేల పూబాలలు ఏకమయి ,ఏడనున్నాడంటూ నీ జాడనే అడిగాయి
వలపుల చెలికాడా ! నీ చెలినే మరచావా
అలిగిన వేళలో నా సొగసు చూడనెంచి
జాబిలి వంపున ఒదిగి దోబూచులాడేవా
నీవు ఆదమరచగలవా ప్రభూ నీ పాద మంజీర నాదాల సేద తీరే నీ రాధనేను
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
31, జులై 2014, గురువారం
నేనే రాధనోయి
నీ తేనె రాగాల మురళీ పదనిసలో నిలువెల్ల నా శ్వాస
నీ నీడ జాడల్లోవడివడిగా అడుగులు వేసా
అరఘడియా మనలేక నీ ఎడబాటులో అలసి సొలిసా
కలువల రేడుని వేడుకొంటి నీ చెలియ గోడు ఆలకించమని
ప్రతి రేయిలో పున్నమి ఎన్నియలు విరజిమ్మమని
చామంతి ,సంపెంగలతో మంతనాలు చేశా
నువ్వు నడిచే దారుల్లో విరబూయమని
కిన్నెరసానిపై కన్నెర్ర చేశా వన్నెలసోయగంతో
నన్ను మీరి నిను మురిపించొద్దని , మైమరపించొద్దని
అది హాయో మాయో తెలియని అయోమయంలో
అల్లాడిపోతున్నా నీకై. తల్లడిల్లి పోతున్నా నీ లాలనకై
నీ అనురాగంలో నను నేనే మరిచిపోవాలని
నీ ప్రేమఝరిలో ముగ్ధనై మురిసిపోవాలని
నీ సమ్మోహన రూపం నిరతం నా కనుపాపలలోనే కదలాడాలని
నా మది దోచిన మురళీ మోహనా .. నీ మనసును నాకే కానుకనీవా
నాఇరు కనుపాపల్లో చిరు దివ్వె వెలిగించి నీకోసం నిరీక్షిస్తున్నా ....
నీ రాక కోసం నిశిరాతిరిలోనూ నిదురమరచి నిలుచున్నా...
రారా కృష్ణా !
మన ప్రణయ రససామ్రాజ్యం లో నా హృదయ పీటమేసాను
కినుక వహించక నీ అలివేణి పై
సందేహము వలదు కృష్ణా నేనే నీ రాధను
12, జులై 2014, శనివారం
గురు చరణం
కరువాయెను కవితకు ఆదరణ అని ,
బరువెక్కిన హృదయంతో ,ఎరుపెక్కిన వదనంతో,
వెనుదిరిగిన తరుణంలో ,
గురువాయెను నండూరివారు ,దిశానిర్దేశం చేయ మార్గదర్శియై !
కన్న తల్లి పాలు , తండ్రి మురిపాలు పసిబిడ్డకు జీవం పోస్తే ,
గురువు ఆశీస్సులే చాలు
కలం పట్టిన కవి కావ్యం పండడానికి
అల్లిబిల్లి అక్షరాలూ కవితా సుమాలై విరబూయాలన్నా ,
హిమశిఖరపు అంచులంత నీవు ఎదిగిపోయినా ,
ఒదిగిపో ... నీ గురు పాదాల చెంత
నా కవితా రధానికి సారధి అయిన నండూరి వారికి ,
పండూరు చెరువు గట్టు వారి వినమ్రతా పూర్వక పాదాభివందనాలు తో
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
4, జులై 2014, శుక్రవారం
అల్లూరి సీతా రామ రాజు
మరువగలమా మహోన్నతుడా .
మాతృభూమి శ్రుంఖలాలు తెగదెంచ నెంచి
ఉడుకు నెత్తురు ఉప్పెనవగా ... రుద్ర నారసింహుడవై
తుచ్చమైన తెల్ల కుక్కల పాలిట సింహ స్వప్నo నీవై
బడుగు బ్రతుకుల వెలుగు నింపి ,గిరి పుత్రుల వెతలు కడిగిన మన్యవీరుడా
మానవ కుల మాన్య ధీరుడా
ఓ తెలుగు వీరుడా .. చైతన్య ధీరుడా .. స్వరాజ్య సమర యోధుడా ..
ఉద్యమానికి ఊపిరులూది వందేమాతరమన్న నినాదాన్ని ఎలుగెత్తి చాటిన విప్లవ స్పూర్తి
కొన ఊపిరి వరకు స్వరాజ్య పోరాటాన్నే నీ శ్వాస గా తలచి చరితార్దుడా
మర ఫిరంగులు వర్షంలో మృత్యువుకే దడ పుట్టిస్తూ
గుండెను చీల్చి తుపాకీకి ఎదురొడ్డి తెల్ల వారి గుండెల్లో గుభుళ్ళు పుట్టించిన
తెలుగు బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎల్లలు దాటి చాటి చెప్పిన చైతన్య స్ఫూర్తి
అమర జ్యోతివై నిలిచినావు ఈ భరత జాతి ఉన్నంత వరకు
ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో ఆత్మగౌరవానివై చిరంజీవి గా వర్దిల్లుతున్నావు
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
3, జులై 2014, గురువారం
"కల "వరం
అమ్మ గర్భం నుండి వస్తూనే అవాక్కయ్యా...
నాన్న చేతిలో ఆసుపత్రి బిల్లు చూసి
ఆకలి ఆమడ దూరం పరుగెట్టింది
అవసరాల ధర ఆకాశంలో చూసి ...
ఖర్చు లేదుకదా .. కమ్మని కల కందామంటే
కరెంటు బిల్లే కల్లోకొచ్చి కలవర పెడ్తుంది
నిజమే కదా ..
సగటు మనిషి నేటి సమాజంలో పడ్తున్న పాట్లు
కళ్ళు మూస్తే
తీపి జ్ఞాపకాల,కటిక చేదు వర్తమానాల ,
అర్ధరహితంగా అగుపిస్తోన్న భవిష్య దర్పణాల మేళవింపుతో తల బ్రద్దలవుతుంటే ... నిద్దరెలా వస్తుంది
వెన్నెల పట్టపగల్లా ఉన్నా..
పట్టపగ్గాల్లేని ఆలోచనలతో పట్టపగలే చుక్కలు చూపిస్తుంటే ...
అదేంటో చిన్నప్పుడు ఎంతో అందంగా భావుకత్వం పొంగివచ్చే ఆనవాళ్ళన్నీ ఈ నాడు అగమ్య గోచరంగా అగుపిస్తున్నాయి .
అమ్మ చిన్నప్పుడు ఆకాశంలో చందమామను చూపిస్తే అబ్బురమేసేది .
కానీ ఇప్పుడు ఆకాశంలో చూడాలంటే ఆకాశానికెక్కిన ధరలే దడ పుట్టిస్తున్నాయి . భావుకత్వం మాట దేవుడెరుగు. బావురుమనకుంటే చాలు
ఒకటో తారీఖు వస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది
ఒకప్పుడు కరెంటు ముట్టుకొంటేనే షాక్
కానీ ఈరోజు ఏది ముట్టుకొన్నా షాకే షాకు
నిత్యావసరాలు నిచ్చె నలెక్కి కూచుంటే
పాలధరలు పాలుపోక చూస్తున్నాయి
కాయగూరల ధరలు మనల్నే నమిలేసేట్టు చూస్తుంటే
బ్రతుకు పరుగుల పందెంలో పరుగులు తీయటమే తప్ప ,
జీవిత మాధుర్యం,ప్రేమానురాగాలు తావెక్కడుంది .
భార్య కళ్ళలోకి చూస్తే ఏదో తెలియని అనుభూతి అంటారు .
కానీ నేటి మద్యతరగతి భర్త కి భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటే
కన్నీరు అడ్డు వస్తుంది . తన కనీస అవసరాలు కూడా తీర్చలేక
ఆనాడు పిల్లల్ని ఎంతమందిని కందామనే ఆలోచనే అద్భుతంగా ఉంటే
ఇప్పుడు కన్నా ఒక్క బిడ్డ చదువుకీ కట్టుకొన్న ఇల్లు అమ్మినా అప్పు వెక్కిరిస్తోంది
అసలు మద్యతరగతి మానవుడికి మధురోహలు ఉండకూడదేమో !
చిన్నప్పుడు ఎలాగైనా విమానం ఎక్కితీరతానని మారాం చేసాం
నేడు వేడెక్కిన బుర్ర మాత్రం విమానం మోతెక్కుతోంది
భార్య కూరల్లో పోపు మానేసినా ...
భర్త స్నానంలో సోపు మానేసినా ..
జీవితాన్ని ఈడ్చుకొస్తామన్న హోపు మాత్రం లేదు
బ్రతకడానికి స్కోపు చాలా తక్కువగానే ఉంది
నిత్యం జారే కన్నీళ్ళే .. టీనీళ్లై నా బావుండు టీ ఖర్చు తప్పేది
కడుపుమంటే కడుపు నింపుతుంటే
అరిగిన మోకాలి చిప్పలు కిర్రుమంటూ జోల పాడితే
రెప్ప పడక కన్నులు లభో దిభో మంటుంటే నిద్దరేలా వస్తుంది
అమ్మో !ఒకటో తారీఖు అంటూ హడలెత్తి కన్నులు పత్తికాయల్లా విచ్చుకొంటే
వచ్చే నాలుగు డబ్బులు నాలుగు వైపులా పంచలేక
నగుపాటు పాలవుతుంటే ,తెల్లారితే అప్పులవాళ్ళ మేలుకోలుపుతో ఠారెత్తి పోతుంటే .చేసేదేముంది తెల్లారకూడదని తెల్లమొహం వేయడం తప్ప .
మతి లేక తప్పు చేసిన వాడికంటే , గతి లేక అప్పు చేసిన మాకే పెద్ద శిక్ష .
ఎలా ఎలా బ్రతకాలి అని ప్రశ్నించుకు పోతుంటే
సమాధానం నేటి ప్రభుత్వాల తీరా !
లేదంటే మా తల రాతే వేరా !
నిద్దరెలా వస్తుంది నిండా మునిగిన మా బ్రతుకులకని
అనుకొంటూ నిద్దురకుపక్రమిస్తూ
కల అయినా వస్తే బావుణ్ణు . కడుపునిండా తిన్నామని
కంటి నిండా నిద్రపోయామని , గుండెలపై చేయి వేసుకొని
మేము ఈ సమాజంలో బ్రతక గల్గుతున్నామని
కలైనా వస్తే బావుణ్ణు
"కల"వరమై వస్తే బావుణ్ణు" కలవరం" తగ్గడానికి
అనుకొంటూ నిర్లిప్తంగా వేడుకొంటూ
రాని నిద్రకై పరితపిస్తూ కఠినమైన రాత్రిని వదిలి
రేపటి అరుణోదయ కరుణాకిరణం కోసం వేచి చూస్తుండడం
నిత్య క్రుత్యమయిపోయే , ఈ కలచి వేసే మధ్యతరగతి బ్రతుకులపై
ఏ ప్రభుత్వపు కరుణా కటాక్షమవుతుందో ... సందేహమే ?????????
సాలిపల్లిమంగా మణి @శ్రీమణి
అవసరాల ధర ఆకాశంలో చూసి ...
ఖర్చు లేదుకదా .. కమ్మని కల కందామంటే
కరెంటు బిల్లే కల్లోకొచ్చి కలవర పెడ్తుంది
నిజమే కదా ..
సగటు మనిషి నేటి సమాజంలో పడ్తున్న పాట్లు
కళ్ళు మూస్తే
తీపి జ్ఞాపకాల,కటిక చేదు వర్తమానాల ,
అర్ధరహితంగా అగుపిస్తోన్న భవిష్య దర్పణాల మేళవింపుతో తల బ్రద్దలవుతుంటే ... నిద్దరెలా వస్తుంది
వెన్నెల పట్టపగల్లా ఉన్నా..
పట్టపగ్గాల్లేని ఆలోచనలతో పట్టపగలే చుక్కలు చూపిస్తుంటే ...
అదేంటో చిన్నప్పుడు ఎంతో అందంగా భావుకత్వం పొంగివచ్చే ఆనవాళ్ళన్నీ ఈ నాడు అగమ్య గోచరంగా అగుపిస్తున్నాయి .
అమ్మ చిన్నప్పుడు ఆకాశంలో చందమామను చూపిస్తే అబ్బురమేసేది .
కానీ ఇప్పుడు ఆకాశంలో చూడాలంటే ఆకాశానికెక్కిన ధరలే దడ పుట్టిస్తున్నాయి . భావుకత్వం మాట దేవుడెరుగు. బావురుమనకుంటే చాలు
ఒకటో తారీఖు వస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది
ఒకప్పుడు కరెంటు ముట్టుకొంటేనే షాక్
కానీ ఈరోజు ఏది ముట్టుకొన్నా షాకే షాకు
నిత్యావసరాలు నిచ్చె నలెక్కి కూచుంటే
పాలధరలు పాలుపోక చూస్తున్నాయి
కాయగూరల ధరలు మనల్నే నమిలేసేట్టు చూస్తుంటే
బ్రతుకు పరుగుల పందెంలో పరుగులు తీయటమే తప్ప ,
జీవిత మాధుర్యం,ప్రేమానురాగాలు తావెక్కడుంది .
భార్య కళ్ళలోకి చూస్తే ఏదో తెలియని అనుభూతి అంటారు .
కానీ నేటి మద్యతరగతి భర్త కి భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటే
కన్నీరు అడ్డు వస్తుంది . తన కనీస అవసరాలు కూడా తీర్చలేక
ఆనాడు పిల్లల్ని ఎంతమందిని కందామనే ఆలోచనే అద్భుతంగా ఉంటే
ఇప్పుడు కన్నా ఒక్క బిడ్డ చదువుకీ కట్టుకొన్న ఇల్లు అమ్మినా అప్పు వెక్కిరిస్తోంది
అసలు మద్యతరగతి మానవుడికి మధురోహలు ఉండకూడదేమో !
చిన్నప్పుడు ఎలాగైనా విమానం ఎక్కితీరతానని మారాం చేసాం
నేడు వేడెక్కిన బుర్ర మాత్రం విమానం మోతెక్కుతోంది
భార్య కూరల్లో పోపు మానేసినా ...
భర్త స్నానంలో సోపు మానేసినా ..
జీవితాన్ని ఈడ్చుకొస్తామన్న హోపు మాత్రం లేదు
బ్రతకడానికి స్కోపు చాలా తక్కువగానే ఉంది
నిత్యం జారే కన్నీళ్ళే .. టీనీళ్లై నా బావుండు టీ ఖర్చు తప్పేది
కడుపుమంటే కడుపు నింపుతుంటే
అరిగిన మోకాలి చిప్పలు కిర్రుమంటూ జోల పాడితే
రెప్ప పడక కన్నులు లభో దిభో మంటుంటే నిద్దరేలా వస్తుంది
అమ్మో !ఒకటో తారీఖు అంటూ హడలెత్తి కన్నులు పత్తికాయల్లా విచ్చుకొంటే
వచ్చే నాలుగు డబ్బులు నాలుగు వైపులా పంచలేక
నగుపాటు పాలవుతుంటే ,తెల్లారితే అప్పులవాళ్ళ మేలుకోలుపుతో ఠారెత్తి పోతుంటే .చేసేదేముంది తెల్లారకూడదని తెల్లమొహం వేయడం తప్ప .
మతి లేక తప్పు చేసిన వాడికంటే , గతి లేక అప్పు చేసిన మాకే పెద్ద శిక్ష .
ఎలా ఎలా బ్రతకాలి అని ప్రశ్నించుకు పోతుంటే
సమాధానం నేటి ప్రభుత్వాల తీరా !
లేదంటే మా తల రాతే వేరా !
నిద్దరెలా వస్తుంది నిండా మునిగిన మా బ్రతుకులకని
అనుకొంటూ నిద్దురకుపక్రమిస్తూ
కల అయినా వస్తే బావుణ్ణు . కడుపునిండా తిన్నామని
కంటి నిండా నిద్రపోయామని , గుండెలపై చేయి వేసుకొని
మేము ఈ సమాజంలో బ్రతక గల్గుతున్నామని
కలైనా వస్తే బావుణ్ణు
"కల"వరమై వస్తే బావుణ్ణు" కలవరం" తగ్గడానికి
అనుకొంటూ నిర్లిప్తంగా వేడుకొంటూ
రాని నిద్రకై పరితపిస్తూ కఠినమైన రాత్రిని వదిలి
రేపటి అరుణోదయ కరుణాకిరణం కోసం వేచి చూస్తుండడం
నిత్య క్రుత్యమయిపోయే , ఈ కలచి వేసే మధ్యతరగతి బ్రతుకులపై
ఏ ప్రభుత్వపు కరుణా కటాక్షమవుతుందో ... సందేహమే ?????????
సాలిపల్లిమంగా మణి @శ్రీమణి
2, జులై 2014, బుధవారం
'పైసా'చిక ప్రపంచం
ఎందుకు వృధా ప్రయాస , అన్నిటికీ హేతువు పైసా !
పరుగులు తీసే బ్రతుకు రధానికి పైసయే కదా పరమపదం .
మానవాళి మస్తిష్కంలో నిత్యం మసులుతున్న పైసా భూతం .
ప్రతీ మనిషీ జీవనగమనం
పైసా చుట్టూ పరిభ్రమణం .
ప్రతి నిమిషం పైసా కోసం యోచన ,
ప్రతి క్షణం పైసా కోసం యాచన ,
ప్రతి ఘడియ పైసా కోసమే వంచన .
పైసాకి పైశాచిక ఆనందం పాశాలను తెంచాలని .
పైసా ప్రయత్నం ప్రతి మనిషి తనకి దాసోహం కావాలనే .
బిచ్చగాడి సత్తు గిన్నెలో చతికిలపడినా....
చలువరాతి గదుల్లో మూలుగుతున్నా...
పైసా పైసాయే, పైసాది ఎప్పుడూ పైచేయే .
యధార్దానికి బుద్ధికి స్వార్ధం నేర్పింది పైసా .
మానవత్వానికి మరకలంటించిందీ పైసానే .
కడు బీద కనీళ్ళ సెలఏరులైపారి ఉన్నోళ్ళ
పన్నీటిజల్లుగా కురిసి
తన ఉనికి పదిలపరుచుకుంటుంది పైసా
బ్రతుకు రసాబాస చేసినా బంగరు రాచ బాట వేసినా ,
పట్టు పానుపు పరిచినా ,
ప్రాణం నిలువునా హరించినా ,
మాన్యతతో మన స్థాయిని
అత్యున్నత పరిచినా,
హీనతతో అధఃపాతాళానికి విసిరి పారేసినా ,
అన్నిటిని నడిపించే సూత్రధారి పైసా, పాత్రధారి పైసా.
వాస్తవానికి మనిషేప్పుడూ మహనీయుడే ,
తన సన్నిధిలో మనిషిని మరమనిషిని చేసి ,
మరో మనిషిలా మార్పు చేసిందీ పైసానే.
అందులకే ఓ మనిషీ... పైసాతో తస్మాత్ జాగ్రత్త
పైసా ని దైవంలా బావించు ... బానిసవైతే కావద్దు
నిండు నూరేళ్ళ జీవితంలో పచ్చనోటు కోసం పచ్చదనాన్ని కోల్పోవద్దు
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
1, జులై 2014, మంగళవారం
పల్లవించే ప్రణయ రాగం
ఏ మరులు దాచావు ఆ నవ్వులో
ఏ విరులు కూర్చావు నీ పదములో
ఏ సిరిచందనాల పరిమళాల మునిగి తేలినావు నీవు
ఆ మదనుని విల్లువి నీవో , ఆ సురులు సేవించిన సుధాజల్లువో
కటిక చీకటిపై కుమ్మరించిన వెన్నెల జడివో
ఏం మాయ చేశావో , ఏ మత్తు జల్లావో
ప్రకృతితో మమేకమై ప్రతి అణువును,ప్రణయరాగమాలికలో ఊయలలూగించావు
నిజమే నిరంతరం నీ సాంగత్యం కోరుతోంది ఆ నీలి గగనం కూడా
రా రమ్మని రాచిలకే రమ్మంటోంది . ఆ కొమ్మల మాటున నక్కి
ఏరికోరి కొండమల్లె నీ మీదే మనసు పారేసుకుంది
మండుటెండలో కూడా మైమరచే పాడుతోంది గండు కోయిల
నిను చూసి . అది వాసంత సమీరమని తలచి .
అంతెందుకు నీ జతకై
విహంగమై విహరిస్తూ పదే పదే పరితపించె నా మది
పల్లవించే ప్రతీ క్షణం ప్రణయవాహినీ లా
నీకై కలవరించే నా హృదయానికి నీ హృదయంతో సేద తీర్చు
ప్రకృతి సైతం పరవశించి మురిసేలా....
సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి
27, జూన్ 2014, శుక్రవారం
మేటి రతనాలవిరిబోణి నా విశాఖ
ఎటు చూసిన ఆహ్లాదం , ఎటు చూసిన ఆనందాల హరివిల్లు
ఎటు చూసినా మనోహర సౌందర్యం , ఎటు చూసిన మైమరపుల విరి జల్లె
ఎటు చూసిన గిరులు ఎటు చూసినపచ పచ్చని తరులు, విరులు , మరులు గొలుపు ఝరులు
ఎటు చూసినా ప్రకృతి రాసిన ప్రణయ ప్రబంధాలే
ఎటు చూసినా హృదయంగమమవు మలయ సమీర వీచికలే
మనోహరి నా విశాఖకే తలమానికం . మనసు తాకే సుందర సాగర తీరం
నా విశాఖ సాగర తీరం ప్రకృతి మెడలో అలంకరించిన మణిమయ హారం
విశాఖ నేల పైన పాదం మోపినంతే తుళ్ళింతలు , కేరింతలు ,చక్కిలిగింతలు
వింత వింత అనుభూతులతో మది సాంతం ప్రశాంతమై ప్రకృతిలో మమేకమై
విహంగమై విహరించుట తధ్యం వినీల గగనంపై .
ప్రత్యూషంలో ఆ భానుని పసిడి వన్నె కిరణం ఉదయించిన తరుణం
ఏ జన్మల అదృష్టమో మరి వీక్షించిన కన్నులకా వైభోగం
ఎటు చూసిన ముగ్ధ మోహన సౌందర్యదేవత సంతకాలే
సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రకృతి కాంత ప్రతిరూపం
అడుగడుగున అతిశయాన్ని దాచుకొన్న సువిశాల సుందర నగరం
వైశాఖీశ్వరుడు వెలసినట్టి మా వైశాఖీ నగరం
ఆ సురులైనా అచ్చెరువొందే అత్యద్భుత సౌందర్య సమాహారం
నమ్మి వచ్చిన వారికి కొమ్ము కాసే పురము .
ఏడుకొండల స్వామిని ఆ కరుణాముయుని కన్నతల్లి మరియమ్మని
అల్లా ను అల్లారుముద్దుగా మూడుకొండలపైనా కొలువుంచిన నా విశాఖ
సర్వమతా సమాహారం. సమతా, మమతల ప్రాకారం
ఏచోట నిలుచున్నా కన్నులపండుగ చేసే ఆది దంపతుల శిల్పాలతోటి
కళ్ళెదుటే కైలాశం మా కైలాశ గిరి శిఖరం
అరకులోయ అందాలతో , అరవిరిసిన వలిసెల సొగసులతో
అలరారే మా నగరి వైశాఖ నగరి
శ్రీ లక్ష్మీ నారసింహుని దివ్య ఆశీశ్శులతో
కనక మహా లక్ష్మీ దేవి కరుణాక్షలతో
నిత్య నీరాజనాలతో , అర్చనాభిషేకాల్తో , పునీతమైన నగరం
మహాత్ములను, మహా కవులను , మహానుభావులను కన్నతల్లి
సంగీత సాహిత్య సమలంకృత నా విశాఖ పట్నం
అన్ని రంగాలను వెన్నుతట్టి ప్రోత్సహించే విదుషీమణి మా విశాఖ
సంగీత సాహిత్య సమలంకృత నా విశాఖ పట్నం
అన్ని రంగాలను వెన్నుతట్టి ప్రోత్సహించే విదుషీమణి మా విశాఖ
ఆంధ్ర రాష్ట్రానికే మకుటాయమానం
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
26, జూన్ 2014, గురువారం
నిలువ జాల, నిమిషమైన
నే నిలువ జాల నిమిషమయిన. నిన్ను చూడక .
నిదుర రాని నా కనులను ఊరడించలేక, కరిగిపోయింది కమ్మని కల .
అదేంటో .. నీకై వగచె నా మదిలో నిప్పులే కురిపిస్తుంది. ఆ పండు వెన్నెల
నీ జత లేని నిశిరాతిరి నిశ్శబ్దం .నను అమాంతం మార్చేసింది జీవమున్న శిలలా ...
గుర్తుందా !మన జంట హృదయాలు మధురోహల సంతకాలు చేసిన వేళ
తనువులు, మనసులు , వలపుల తలపులతో తడిసి ముద్దైన వేళ
మన ప్రణయ కవితకు కొత్తరాగం జతకూర్చిన వేళ
పాలు , తేనెలు చిలికి అమృతాన్ని ఆస్వాదించిన వేళ
వేవేల కుసుమాల సౌగంధం మన మనసులను మైమరపించిన వేళ
మన పరువాల ప్రణయబంధం పరిణయ గ్రంధంగా లిఖించిన వేళ
ముద్దు, మురిపాలలో మునిగి మంత్రం ముగ్ధులమై మురిసిన వేళ
సప్తపదులూ నీతో నడిచిన నిమిషం నుండీ
నిను వీడి మనలేను నిమిషమయినా నేను
ఏ మలయ సమీరమైనా నిన్ను మీరి తాకలేదు నన్ను
నీ ఎడబాటులో నా హృది స్పందన తడబడి నా ఊపిరాగిపోతుందేమో
పరిపాటేనని, పరధ్యానపడక , పరుగున రావా
నీలో సగమై నిన్నే తలచే నీ అర్ధాంగి కి ఊరట నిచ్చే
నీ అనురాగాన్ని తలపించే అనుపానం లేదు మరి
నీ ప్రణయామృతమ్ము తప్ప
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
నిదుర రాని నా కనులను ఊరడించలేక, కరిగిపోయింది కమ్మని కల .
అదేంటో .. నీకై వగచె నా మదిలో నిప్పులే కురిపిస్తుంది. ఆ పండు వెన్నెల
నీ జత లేని నిశిరాతిరి నిశ్శబ్దం .నను అమాంతం మార్చేసింది జీవమున్న శిలలా ...
గుర్తుందా !మన జంట హృదయాలు మధురోహల సంతకాలు చేసిన వేళ
తనువులు, మనసులు , వలపుల తలపులతో తడిసి ముద్దైన వేళ
మన ప్రణయ కవితకు కొత్తరాగం జతకూర్చిన వేళ
పాలు , తేనెలు చిలికి అమృతాన్ని ఆస్వాదించిన వేళ
వేవేల కుసుమాల సౌగంధం మన మనసులను మైమరపించిన వేళ
మన పరువాల ప్రణయబంధం పరిణయ గ్రంధంగా లిఖించిన వేళ
ముద్దు, మురిపాలలో మునిగి మంత్రం ముగ్ధులమై మురిసిన వేళ
సప్తపదులూ నీతో నడిచిన నిమిషం నుండీ
నిను వీడి మనలేను నిమిషమయినా నేను
ఏ మలయ సమీరమైనా నిన్ను మీరి తాకలేదు నన్ను
నీ ఎడబాటులో నా హృది స్పందన తడబడి నా ఊపిరాగిపోతుందేమో
పరిపాటేనని, పరధ్యానపడక , పరుగున రావా
నీలో సగమై నిన్నే తలచే నీ అర్ధాంగి కి ఊరట నిచ్చే
నీ అనురాగాన్ని తలపించే అనుపానం లేదు మరి
నీ ప్రణయామృతమ్ము తప్ప
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
25, జూన్ 2014, బుధవారం
ఒక్క క్షణం ... ఒకే ఒక్క క్షణం...
నువ్వు మహాత్ముడివా !మహర్షివా !మామూలు మానవుడివా !
అట్టడుగున కూరుకొన్న మానవతను వెలికితీయు మాన్యుడివా !
జంగు పట్టి పోతున్న జనంలో నిజాయితీకి తుప్పు వదలించే దమ్మున్న అసామాన్యుడివా !
నలుగురితో నారాయణగా సామాన్యంగా మసలుతున్న సామాన్యుడివా !
అవినీతి , స్వార్ధపు కోరలు విరిచే మేటి విలుకాడివా !
నువ్వు మాన్యుడవైనా ... సామాన్యుడవైనా ... అసామాన్యుడవైనా
నువ్వు ఎవరైనా... ఎవరైనా ఎవరైనా .. గాని ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచించే మనసున్న మనిషివయితే చాలు .
నీలో జరిగే ప్రతి సంఘర్షణలో, సంఘానికి హితపడు హితవుంది .
నువ్వేడ్చినప్పుడు , ఎదుటివారి ధుఖ్ఖాన్ని
నువ్వు నవ్వినపుడు నవ్వలేని బ్రతుకుల్లో నవ్వే లేని వారిని
నువ్వాకలిగొన్నపుడు ఆకలితో అలమటించే వారెందరని
నీ ప్రతీ భావంలో , ఎదుటివారి భాదల్ని ప్రతిబింబిస్తే
ఎవరో మన బ్రతుకుల్లో వెలుగులు నింపాల్సిన అగత్యమేముంది
ప్రతి నువ్వూ స్పందిస్తే , ప్రపంచమే మారదా !
పట్టువీడక ప్రయత్నిస్తే, పసిడి పండదా... బీడు భూమిలో
ఎదుటి మనిషిలో దైవాన్నే ధర్శిస్తే , ధన్యమవదా ప్రతి మానవ జీవితం .
పరోపకార గుణం ప్రతి మనిషికి వరమయితే ,
పని తేలిక కదా ... పరమాత్ముడికీ
కన్నేరెందుకు కార్చాలి మంచికీ , చెడుకీ , ... పైసా ఖర్చు లేదనా ......
కారుచిచ్చు కాల్చేసినా కలసిరాని కాలంలో నువ్వు అలసి సొలసి కూచున్నా
నేనున్నా నీకోరకనే ఒక్క స్నేహ హస్తం. అరక్షణంలో అంతమవదా ఆవేదన
మానవత్వపు ధన్వంతరి మహత్తరమయిన మందు మానవ సంబంధాలకు
అందులకే నేస్తం !
ఆదుకొనే గుణముంటే ఆద్యంతం ఆనందం మన సొంతం
మనం , మనం ఒక్కటంటే మాన్యమవును మన మానవ సంబంధం
మరచిపోకు నేస్తం మనమంతా మానవులం .
మనదంతా ఒకే కులం .
అది విశ్వక్షేత్ర శ్రామికులం .
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
24, జూన్ 2014, మంగళవారం
పరితప్త హృదయాలు
నిశ్చేతనులై ,నిషణ్ణులై ,నిహతికై ,నిరీక్షించు ఆ నిండు జీవితాలు
ఆ .. వృద్ధ మాతాపితరులు .
నీలకంఠుని వేడి తమ నెంజలి తీర్చగ వరమిమ్మనె . నిర్వృతి కొరకై
ఆనక ఆత్మశాంతి నొందుటకై .
కన్ను మూయులోపు తమకు రెక్కలీయమనె .
ఆ రెక్కలతో తమ తనయుల దరికేగి,
తనివి తీర చూసుకొని తనువులు చాలిస్తామనె .
ఇది కడసారి చూపులకు నోచుకోని కన్నవారి హృదయవిదారక రోదన
కనిపించని తనయులకై కనిపెంచిన వేదన .
కాసుల మోజుల్లో విదేశాల వ్యామోహపు బూజుల్లో
కొందరు కన్నవారి ఋణం తృణప్రాయం చేసి , కన్నభూమికి ,
కన్నతల్లికి కడుపుకోత మిగిల్చేరు
గోరుముద్దలిడిన తల్లి గోడు పట్టని మూఢులు ఆ బిడ్డలు .
బిడ్డలు కారు వారు తల్లి గుండెల పై గడ్డలు
అన్నీ తానై పెంచిన తండ్రిని అనాధగా వదిలెళ్లిన అనామకులు వారు , అతి ధూర్తులు వారు .
రక్తం పంచిన తల్లితండ్రులను వృద్ధాశ్రమాల పాల్జేసిన వారు కొందరు .
నడివీధిలో విడిచివెళ్లిన నాసిరకం మానవులు మరికొందరు .
మరచిపోకు నేటి నీ తల్లితండ్రుల దుస్థితి . నీకొరకు వేచియున్న పరిస్థితి .
పచ్చనోట్ల కన్నా .. పచ్చడి మెతుకులు తిన్నా
తల్లి తండ్రీ నీడనున్న నీ జీవితమే మిన్న అని తెలుసుకో ...
కన్నవారి మనసునెరిగి మసలుకో
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
22, జూన్ 2014, ఆదివారం
జత చేరవా
మరచితివా నన్ను, నీ మరులొలికే ప్రియురాలను
ప్రకృతి కే పరవశమనిపించే నీ చెలి జత వీడి
మనగలవా నిమిషమాత్రమయినా. నా మది దోచిన చెలికాడా !
నను రమ్మని, ఝుం ఝుమ్మని, తన కమ్మని కధ చెబుతానని
గోముగా పిలిచింది ఆ తుమ్మెద. నా మోమును గని సుమమనుకొని .
నను తాకినంతనే నా తనువంత తానై పులకించి
వెన్నెలంతా నాపైనే ఒలకబోసింది ఆ పున్నమి రేయి
నా సిరి మువ్వల అడుగులసడి విని తడబడి పోయింది ఆమని కూడా !
నా కొంగు పట్టి లాగింది పైరగాలి పలకరించవా .. సఖీ అని
నాపై అలిగి కూచుంది చిటారు కొమ్మన ,ఆ చిట్టి చిలుకమ్మ తన తేనె పలుకులు నే దోచానని
ఆ మాధవీ లత నన్ను కన్నార్పక చూస్తుంది ఈ పసిడి వన్నె తీగ ఎవరని
నా నీలి ముంగురులు సవరించ చూస్తుంది పిల్ల తెమ్మెర
నీ ఎడబాటుకి వగచే నా సిగలో ఆ సిరిమల్లె చేరి మరుమల్లెల వాన కురిపించింది
రాజహంసతో లేఖ రాసి పంపడానికని మంతనాలు చేస్తున్నా ...
మారు మాట్లాడక ఆఘ మేఘాలపై పయనించి ఇటు రా !
ప్రకృతిలో ప్రతి అణువు నాపై ప్రణయాస్త్రాలు సంధిస్తుంటే
నీకై వెతికే నా మది తల్లడిల్లి పోతుంది నీ చెంత చేరడానికై
చింత తీర్చగలేవా !నీ చిన్నదాని మదిలో
జత చేరగా రావా ! నీ కోసం నిరీక్షించే నీ ప్రేయసి సన్నిధికి
( శ్రీను +మణి =శ్రీమణి )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
21, జూన్ 2014, శనివారం
తెలుగు "ధనం"
నల్లనయ్య పిల్లనగ్రోవి ఆలపించిన రాగంలా !
చల్లనయ్య చిందించిన పున్నమి వెలుగు సరాగంలా !
మధుమాసం మది తాకి నటుల ,
మధుదారలు అధరాలకు జాలువారినటుల ,
మంచిగంధం పూసినటుల ,
మరు మల్లియ విరబూసినటుల ,
నాలుక నవనీతం చవి చూసినటుల ,
పాలూ ,తేనెలు బోసి వండిన పరమాన్నంలా ...
పంచదార పాకమున పల్కులు ముంచి తీసినటుల ,
తియ తీయని అనుభూతులు నా తెలుగుదనంలో ..
విడదీయలేని అనుబంధం నా తెలుగు దనంతో ...
నా తెలుగులమ్మ సుమ సరములోని వాడని కుసుమంగా నిలవాలని ,
విను వీధులు వినిపించగ తెలుగు పాట పాడాలని ,
ఎల్లలు దాటి చల్లని మా తెలుగుతల్లి ఖ్యాతి దిగ్దిగంతాలా ఎలుగెత్తి చాటాలని ,
ఆ గగనపు సరిహద్దు మీద తెలుగు ఓనమాలు లిఖించాలని ,
చిన్ని ఆశ మాకు. జన్మ భూమి ఋణం తీర్చుకోవాలని ,
పట్టా చేతబట్టి పొట్ట చేత పట్టుకోని పొరుగు నేలకై మేము తరలినా ...
మరలునా మా మాతృభూమిపై తరగని మమకారం .
అమ్మే లేదంటే ఏ జీవికైన జన్మెక్కడిది ?
తెలుగే లేదంటే తెలుగుబిడ్డకు వెలుగెక్కడిది ?
అమ్మ చేతి గోరుముద్దకు సరి తూగునా పరాయి నేలపైన పరమాన్నం .
తేటతెలుగు లాలిపాటకు సాటి ఏదీ అధ్బుత రాగం ?
ఆకాశపుటంచులు తాకినా ... తరువు ఎరుగదా తన మూలం నేలయని .
ఖండాంతరాలు దాటెగిరినా .. మా కన్నతల్లి గుండె చప్పుడు మారుమ్రోగుతోందిక్కడ .
ప్రతీ నిమిషం అమ్మ ఒడిని తలుచుకొంటూ ..
కర్తవ్య పాలనలో పరాయి నేలపైన పరుంటూ ...
తెలుగుకై తెలుగన్నదమ్ములం తెగ మురిసి పోతున్నాం .
అవనిపై అదృష్టవశాత్తూ తెలుగు బిడ్డలమైనందుకు గర్విస్తున్నాం .
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి ,
http://pandoorucheruvugattu.blogspot.in
19, జూన్ 2014, గురువారం
అమ్మా ... మన్నించు
నేటి స్వంతత్ర భారతమా ...
అవినీతికి,అన్యాయానికి ఆలవాలమా ?
ప్రజాస్వామ్య దేశమా
ప్రజల పాలిట శాపమా ...
విన్నావా .. సగటు జీవి ఆర్తనాదాలు
కన్నావా .. కన్నీటి కధనాలు ?
మరచినావా .. మానవత్వం
నేర్చినావా .. పైశాచికత్వం ?
కలచివేసే బ్రతుకులే కన్నులకగుపిస్తున్నా
కాలానికి వదిలేసి కళ్ళు మూసుకొంటున్నావా
తెల్ల దొరల కాలంలో బానిస బ్రతుకైనా బ్రతికాం
నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రతుకే బరువాయె కదా ..
అణువణువున స్వార్ధంతో అల్లాడుతున్న వ్యవస్థ
మంచం లేచిన మొదలు లంచమే లాంచనమాయె .
పాపాయి పాల డబ్బాలో కల్తీ , ప్రాణం పోసే మందులలో కల్తీ
తల్లి పాలు తప్ప కల్తీ లేనిదేది ?ఈ లోకంలో
నిత్యావసరాల ధరలు నిత్యం వేధిస్తుంటే
నల్ల ఖజానాలు మాత్రం నింగికెగసిపోయెనా ?
వెల పెరిగిన వేగంతో నెల జీతం పెరగదేం ?
అవ్వల ,తాతయ్యల పించనులో లంచం
బడుగు జీవి పధకాలలో లంచం
ఎక్కడ చూసినా .. లంచం .. లంచం .. లంచం
దీనికి లేదా అంతం ?
మన నుండే ప్రతి మార్పూ రావాలి
అది సమాజాన్ని శాసించే తుది తీర్పు కావాలి
ప్రక్షాళన చేసేద్దాం పాతుకుపోయిన పాపాన్ని
విమోచన కల్పిద్దాం బ్రష్టు పట్టిన జాతికి
కూకటి వేళ్ళతో పెకలిద్దాం .. అవినీతి కలుపు మొక్కల్ని
చేయి చేయి కలిపి అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం ...
ప్రజాస్వామ్యం పరువు నిలబెడదాం .. .
భారత పౌరులమైనందుకు
మన జన్మభూమి ఋణం తీర్చుదాం (నిరతంతరం నిజాయితీ గా జీవిద్దాం )
సాలిపల్లిమంగా మణి @శ్రీమణి
15, జూన్ 2014, ఆదివారం
నాన్నా ....
అడగక ముందే అన్నీ ఇచ్చిన నాన్నా ....
నువ్వు మా ప్రాణం కన్నా మిన్న
అమ్మకడుపారా జన్మిచ్చినా గాని ,
మా చిటికిన వేలును పట్టి మార్గదర్శిగా మారి
చిట్టి ,పొట్టి తడబడు అడుగుల దారు
ల్లో నీ అరిచేతిని పానుపుగా పరచి
బొజ్జ నింపిన అమ్మకు సరిగా
అనురాగపు ఉగ్గుపాలు తాగించి అమ్మనే తలపించావు .
అమృతాన్నే చవి చూపించావు ,నీ లాలనలో. .
ఎన్నెన్ని సంఘర్షణలతో నువ్వు తలమునకలవుతున్నా
చిరునవ్వులే మా మోమున విరబూయించావు
కష్టాలు కన్నీళ్ళకు కావలి కాసి,
ఆవల ఆనందపు అంచులలో నను కూర్చోబెట్టావ్ .
మా నవ్వుల ముత్యాలను నీ దోసిట నింపి
ముత్యాల జల్లు మా జీవితాలకు కానుకనిచ్చావు
మేం ఎంతెత్తుకు ఎదిగినా.... మీ అడుగుజాడలే మా ఆదర్శం
మీ అంతగా మేం ఎదిగినాగాని ... మీ కనుసైగలే మాకు శిరోధార్యం
మా తుది శ్వాస వరకు అమ్మా ,నాన్న ఒడి మా సొంతం కావాలి
ఆనక ఆపై వాడు తధాస్తు !అంటూ ఆశీర్వదించాలి
నాన్నా !ఎన్ని జన్మలయినా నీ బిడ్డగానే జన్మించాలి
ఆ దేవుడే వరమిస్తానంటే !వెనువెంటనే అడిగేస్తా
నాన్నకి బిడ్డగ జన్మజన్మలకీ జన్మించే భాగ్యం ఇమ్మని
(ప్రేమతో.... మా నాన్న గారికి)
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
14, జూన్ 2014, శనివారం
మరువకురా....
మనలేను మనిషిలా !మరువక ఎన్నడు నన్ను
నువు చెంతలేని నేను ,సిరా లేని కలాన్ని ,
వెన్నెల కురియని పున్నమిని, విరియక వాడిన కుసుమాన్ని ,
నువు దూరమయిన మరు క్షణం. మొదలవుతోంది నా నిరీక్షణం
కంటి నిండుగ నీ రూపం. నిలువనీదు నిమిషమయిన నిశ్చింతగా నన్ను ,
ఝుంటి తేనియ మధుర రసం సేవించి నా మది
నీ సరసపు తలపుల్లో తూలుతోంది మైమరచిపోయి ,నన్నే మరచిపోయి
నీ అనురాగం చవి చూసిన నాకు ,ఏ రాగమైన మౌనంగా తోస్తుంది
రోజూ ఊసులాడే సంపంగీ మూగ నోము పట్టింది
పిల్ల గాలి కూడా మూతి ముడిచి కూచుంది
నా వలపుల వాకిలిలో నీకై మేల్కొని ఉన్న నాకు , రంగవల్లి జోల పాడింది
పరధ్యానంలో ఉన్న నన్ను, ప్రక్క నున్న సెలయేరు పలకరింపు కొచ్చింది
నీ పలుకు వినక చిలకలమ్మ కులుకు మరచి కూచుంది.
నీ ఎడబాటు మండు వేసవి లా నిప్పులు చెరిగేస్తుంటే
సీత కన్ను వేయమాకు నాపై .. నీ సతి నేనని మరచి
అరక్షణములో నా ఎదుట నిలువలేవా !నీ చెలి నిరీక్షణకు నీరాకను కానుక నీవా
ప్రణయరాగం పల్లవించగ , పయనమయిరా !నీ ప్రియ సఖి సన్నిధికి
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)