నువ్వు మహాత్ముడివా !మహర్షివా !మామూలు మానవుడివా !
అట్టడుగున కూరుకొన్న మానవతను వెలికితీయు మాన్యుడివా !
జంగు పట్టి పోతున్న జనంలో నిజాయితీకి తుప్పు వదలించే దమ్మున్న అసామాన్యుడివా !
నలుగురితో నారాయణగా సామాన్యంగా మసలుతున్న సామాన్యుడివా !
అవినీతి , స్వార్ధపు కోరలు విరిచే మేటి విలుకాడివా !
నువ్వు మాన్యుడవైనా ... సామాన్యుడవైనా ... అసామాన్యుడవైనా
నువ్వు ఎవరైనా... ఎవరైనా ఎవరైనా .. గాని ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచించే మనసున్న మనిషివయితే చాలు .
నీలో జరిగే ప్రతి సంఘర్షణలో, సంఘానికి హితపడు హితవుంది .
నువ్వేడ్చినప్పుడు , ఎదుటివారి ధుఖ్ఖాన్ని
నువ్వు నవ్వినపుడు నవ్వలేని బ్రతుకుల్లో నవ్వే లేని వారిని
నువ్వాకలిగొన్నపుడు ఆకలితో అలమటించే వారెందరని
నీ ప్రతీ భావంలో , ఎదుటివారి భాదల్ని ప్రతిబింబిస్తే
ఎవరో మన బ్రతుకుల్లో వెలుగులు నింపాల్సిన అగత్యమేముంది
ప్రతి నువ్వూ స్పందిస్తే , ప్రపంచమే మారదా !
పట్టువీడక ప్రయత్నిస్తే, పసిడి పండదా... బీడు భూమిలో
ఎదుటి మనిషిలో దైవాన్నే ధర్శిస్తే , ధన్యమవదా ప్రతి మానవ జీవితం .
పరోపకార గుణం ప్రతి మనిషికి వరమయితే ,
పని తేలిక కదా ... పరమాత్ముడికీ
కన్నేరెందుకు కార్చాలి మంచికీ , చెడుకీ , ... పైసా ఖర్చు లేదనా ......
కారుచిచ్చు కాల్చేసినా కలసిరాని కాలంలో నువ్వు అలసి సొలసి కూచున్నా
నేనున్నా నీకోరకనే ఒక్క స్నేహ హస్తం. అరక్షణంలో అంతమవదా ఆవేదన
మానవత్వపు ధన్వంతరి మహత్తరమయిన మందు మానవ సంబంధాలకు
అందులకే నేస్తం !
ఆదుకొనే గుణముంటే ఆద్యంతం ఆనందం మన సొంతం
మనం , మనం ఒక్కటంటే మాన్యమవును మన మానవ సంబంధం
మరచిపోకు నేస్తం మనమంతా మానవులం .
మనదంతా ఒకే కులం .
అది విశ్వక్షేత్ర శ్రామికులం .
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి