మరువగలమా మహోన్నతుడా .
మాతృభూమి శ్రుంఖలాలు తెగదెంచ నెంచి
ఉడుకు నెత్తురు ఉప్పెనవగా ... రుద్ర నారసింహుడవై
తుచ్చమైన తెల్ల కుక్కల పాలిట సింహ స్వప్నo నీవై
బడుగు బ్రతుకుల వెలుగు నింపి ,గిరి పుత్రుల వెతలు కడిగిన మన్యవీరుడా
మానవ కుల మాన్య ధీరుడా
ఓ తెలుగు వీరుడా .. చైతన్య ధీరుడా .. స్వరాజ్య సమర యోధుడా ..
ఉద్యమానికి ఊపిరులూది వందేమాతరమన్న నినాదాన్ని ఎలుగెత్తి చాటిన విప్లవ స్పూర్తి
కొన ఊపిరి వరకు స్వరాజ్య పోరాటాన్నే నీ శ్వాస గా తలచి చరితార్దుడా
మర ఫిరంగులు వర్షంలో మృత్యువుకే దడ పుట్టిస్తూ
గుండెను చీల్చి తుపాకీకి ఎదురొడ్డి తెల్ల వారి గుండెల్లో గుభుళ్ళు పుట్టించిన
తెలుగు బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎల్లలు దాటి చాటి చెప్పిన చైతన్య స్ఫూర్తి
అమర జ్యోతివై నిలిచినావు ఈ భరత జాతి ఉన్నంత వరకు
ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో ఆత్మగౌరవానివై చిరంజీవి గా వర్దిల్లుతున్నావు
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి