ఓ మహిళా ఏది నీ ప్రగతి ?
స్త్రీ అంటే మాతృమూర్తి అని తెలుసు,
వెన్నవంటిది ఆమె మనసు
అనురాగానికి చిరునామా ఆమె
క్షమ, సహనం, ఔన్నత్యాలకు ఆలవాలం ఆమె
ఇంటికి మాత్రమేకాదు ఆమె దీపం
సృష్టికి మూలం ఆమె
మరిఎందుకు అంత అలుసు ?
అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిస్తే...
స్వాతంత్ర్యం అన్నారు గాంధీ,
రాక్షసమూకలు జగతిని ఉండగా..
పట్టపగలే కరువైంది... నేటి మన భారతంలో
వంచించకు వనితను వంటింటి కుందేలని
పురుషాధిక్యం జగతిని మెండుగయుండగ
ఇంతి బ్రతుకు ఇక దండగా ?
కాదు.. కానే కాదు...
వీర నారి ఝాన్సి కాదా ఆడది ,
రాణి రుద్రమ కాదా ఆడది ,
మన ఇందిర కాదా ఆడది,
అంతరిక్షానికేగిన మన సునితా విలియమ్స్ కాదా ఆడది
తెలుసుకదా వాళ్ళ హిస్టరీ
చెయ్యొద్దు మహిళ బ్రతుకు ఒక మిస్టరీ .
ద్విగుణీకృతం చెయ్యండి వారిలో
ధైర్యం, స్థైర్యం
సహకరించి, ప్రోత్సహించి
ధైర్యం, స్థైర్యం
సహకరించి, ప్రోత్సహించి
బావుంది...
రిప్లయితొలగించండి