నా తలపుల వనంలో
విరబూసిన పారిజాతమా
విరబూసిన పారిజాతమా
నా జీవన బృందావనిలో
వినిపించిన వేణుగానమా
వినిపించిన వేణుగానమా
నా గుండె గొంతుకలో
పలికిన మృదుసరిగమా
పలికిన మృదుసరిగమా
నా మనసును శృతి చేసిన వీణా నాదమా
...... ప్రియతమా ......
మదిలొ మెదిలె మధురగీతమా
కన్నుల కదిలె పసిడి స్వప్నమా
నా ఊహల ఒదిగిన నా ప్రాణమా
మమతను పంచే మధురాను రాగమా
మరపు రానిది నీ ఔన్నత్యం
మరువలేనిది నీ సాంగత్యం
Bavundi...
రిప్లయితొలగించండిChala Bavundi...
రిప్లయితొలగించండిchala bavundi...
రిప్లయితొలగించండిChala Bavundi
రిప్లయితొలగించండిమంగా మణి గారు !
రిప్లయితొలగించండి"మరపు రానిది నీ ఔన్నత్యం
మరువలేనిది నీ సాంగత్యం "
మీ "ప్రియతమా" కవిత చదివాను. చాలా భాగుంది.