చిరు కోకిలమ్మ, చిగురు మావికొమ్మ, సిరిమల్లె పూరెమ్మా,
పరవశాన ఆహ్వానం పలికే నవ్య శకానికి ఈ "ఉగాది"
మధుకలశం మనకోసం తేవాలని,
కువ కువలతొ కోయిలమ్మా, కిలకిలరావాలతో పక్షు లు
చిరుగాలి పరదాలతో, రసరాగాలతో రా రమ్మని
నవ్య పరిమళాలు మన జీవితాన వెదజల్లాలని
ఉదయించే ప్రతిదినం నవ ఉషస్సులతో నిండాలని,
వేసే ప్రతి అడుగు ప్రగతికి పసిడి బాట కావాలని
ప్రతి మనసు సంతసాలతో పరవసించి ఆనందోత్సాహాలతో ఉండాలనీ,
విశ్వమానవాళి చిరునగవుతో జగతిన వెలుగులు నిండాలని,
కోటి ఆశల తీరం నుండి విజయఢంఖా మ్రోగిస్తూ వచ్చింది ఉగాది మన లోగిళ్ళలోకి
విజయాలను కాంక్షిస్తూ ఆహ్వానిద్దాం మన ముంగిళ్ళలోనికి.
హితులకు, స్నేహితులకు, బ్లాగర్లకు అందరికీ
విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ
"విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"