*నిన్నుకోరి*
హృదయమిలా పున్నమిలా విరిసినదీ నిన్నుకోరి
ఎదసవ్వడి వేణువులో
నిలిచినదీ నిన్నుకోరి
మరపురాని నీగురుతులు మైమరపుల పరిమళాలు
మధుమాసపు కోయిలలా పిలిచినదీ నిన్నుకోరి
నులిసిగ్గుల సంతకాలు నులివెచ్చని నీతలపులు
నిద్దురచెడి నిట్టూరుపు విడిచినదీ నిన్నుకోరి
నిలువదుమది నీజతలో పురివిప్పిన మయూరమే
అలవోకగ వలపుధార
చిలికినదీ నిన్నుకోరి
మణిమనసే మధువనిగా మాధవుడా నీకోసం
నినువలచిన రాధికగా మిగిలినదీ నిన్నుకోరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి