అరక్షణమూ ...
ఆదమరచక
అక్షర యాగం చేస్తున్నా...
అనుక్షణమూ...అన్వేషిస్తూ..
అచ్చమైన తెలుగును
ఔపోసన పడ్తున్నా...
అభిజ్ఞను కానునేను
అతిసాధారణ అతివను
హృదయం చవిచూసిన
అనుభూతులను
అక్షరీకరిస్తున్నా...
ప్రకృతితో ప్రతీ
సౌందర్యాన్నీ
పదాలతో పదిలం
గావిస్తున్నా...
ఉదయించే
ప్రతి కిరణం
కవితనై
ప్రతిబింబిస్తున్నా...
సమాజానికి
నవఉషస్సునివ్వాలని
ఆకాంక్షిస్తూ...
నాలో మెదిలిన ప్రతిభావాన్నీ
ప్రతిగా...ప్రతిబింబిస్తున్నా..
పట్టాలు పట్టలేదుగానీ
మాతృబాషపై పట్టరాని
మమకారంతో....
కాలంతో పాటు నా కలాన్ని
కదిలిస్తూ...కవనసేద్యం
సాగిస్తున్నా...
*సాలిపల్లి మంగామణి (srimaani)*
మీ నిరంతర కవనచైతన్యస్రవంతి ఇలాగే ప్రవహించాలి. హృదయాలను భావసస్యశ్యామలం చేయాలి.
రిప్లయితొలగించండిడాక్టర్ తొగట సురేశ్ బాబు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిChala bagundi 👌
రిప్లయితొలగించండిBeautiful ✍👍🏻
రిప్లయితొలగించండిహృదయపూర్వక ధన్యవాదాలు మీకందరికీ 🙏
రిప్లయితొలగించండి