వలపుపూల జడివానల
తడిసినదీ గురుతుందా
నిదురరాక నిట్టూర్పులు
విడిచినదీ గురుతుందా
తేనెలూరు ఘడియలన్ని
కరిగిపోక తరిమినవీ
తడియారని తలపులతో
మురిసినదీ గురుతుందా
నులివెచ్చని కలలన్నీ
నడిరేతిరి పరమాయెను
కవ్వింతల కలవరమై
నిలిచినదీ గురుతుందా
ప్రణయవీణ మీటినపుడు
పరువమంత పరవశమే
తపనలన్ని తనివితీర
విరిసినదీ గురుతుందా
మనమనసులు మమేకమై
మధువనిలా మారువేళ
మణి ఖచితపు ప్రేమనగరి
మెరిసినదీ గురుతుందా.
Wow❤👌
రిప్లయితొలగించండిఎంత బాగుందో👌✍️
రిప్లయితొలగించండిSuper 👌
రిప్లయితొలగించండి