పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, మార్చి 2017, బుధవారం

మధు మాసపల్లకినెక్కి ...



ఏ  మధుర రాగాలు ఆలపిస్తుందో 
ఏ మకరంధ కలశాలు గుమ్మరిస్తుందో 
ఏ అంబరాల సంబరాల  మోసుకువస్తుందో 
ఏ సంతసాల సంతకాలు చేయవచ్చిందో 
ఆ ఆనంద డోలికల ఓలలాడిస్తుందో 
ఏ మలయమారుతాల మైమరపిస్తుందో 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల 
మత్తకోకిల  రాగంలా 
మధురోహల పరిమళంలా 
మావిచిగురు సోయగంలా 
మధుమాస సరాగంలా  
మైమరపుల పరాగంలా 
మైవచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
పచ్చని మాగాణిలా 
నిత్యకళ్యాణిలా 
చైత్రపు మారాణిలా 
పచ్చని పారాణిలా 
రాణిలా 
మారాణిలా 
విరిసిన పూబోణిలా 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
కోటి ఆశల తీరాల 
కోరిక నెరవేరేలా 
కొంగుబంగారంలా 
సిరిలిచ్చిగలగలా 
సిరులొచ్చి కళకళా 
విరులొచ్చి కలకలా 
వింధ్యామర వీచికలా 
తుళ్ళింతల కేరింతల 
తొలకరి గిలిగింతల 
ఇంతిలా 
చామంతిలా 
ముద్దపసిడి బంతిలా 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
కోటి ఆశల తీరేలా 
కోరిక నెరవేరేలా 
కొంగుబంగారంలా
భవిత సింగారంలా 
వచ్చింది నవవధువై 
తెలుగులోగిలికి 
వెలుగుల్లు చిలికి 
వెన్నియలు కలిపి
 వన్నెల కానుకిచ్చింది 
మధు మాసపల్లకినెక్కి 
మరు మల్లియ పరదాల
      హేవిళంబిసంవత్సర ఉగాది శుభాకాంక్షలతో .... 
                                                         సాలిపల్లి మంగామణి@ శ్రీమణి 
 
 


26, మార్చి 2017, ఆదివారం

కళావేదిక

ముందుగా మన కళావేదికపుస్తకాలయ వ్యవస్థాపకులు శ్రీ నండూరి రామకృష్ణగారిని వేదికనలంకరించాల్సిందిగా కోరుచున్నాను,
ఆపన్నుల పాలిట అభయహస్తం వారు,అన్నింటా విజయాల పయనించు ధీమంతులు
యెంత ఎదిగినా ఒదిగివుండే వినయశీలురు,విత్తమ్ముతో ఎన్ని కార్యాలు  సాధించినా,చిత్తముతో సాయమందించు చేతులే మిన్నయని S.B.S.R ట్రస్ట్ స్థాపించి గ్రామగ్రామాలకూ సేవలందింస్తూ
కోస్తానలుమూలలా కీర్తిబావుటా ఎగురవేసిన అవిరళ కృషీ వలురు,                                                 శ్రీ సత్తి రామకృష్ణా రెడ్డిగారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుచున్నాము,

24, మార్చి 2017, శుక్రవారం

పూవు లేని తావి


సంధ్య వాలిపోయే 
సూరీడింటికి ఎల్లిపోయే 
గువ్వలు గూటికి చేరిపోయే 
నీ అలికిడయినా  లేదాయె
నాలో  అలజడేదో మొదలాయె 
ఎటు చూసినా .....  నీ అడుగుల సడి .
ప్రతీ జడిలో  నీవేనని తడబడి ,
ఘడిఘడికీ  మకరందపుమధు జడితో  
నీ తలపులు చొరబడి ,
నిద్దుర  కొరవడి
ఆ  ఊహల  ఒరవడిలో
నులివెచ్చని నీ ఒడిలో ...
తలవాల్చిన నా మది  
అది  తనువును విడివడి
విహంగమాయే వినీలగగనానికెగబడి,
అరనిమిషమయినా
నువు లేక నేను
పూవు లేని తావిని 
నీ జత లేని నేను 
సిరా లేని పెన్ను 
నువ్వెంట లేని గమనం
అది ఎండమావి పయనం
నీతో నడచిన సప్తపదుల సాక్షి
నిమిషమయినా ...
నిను చూడక నేనుండలేను,
సవరించిన నా కురుల సాక్షి
నీ సాంగత్యమే  వేయిపున్నముల సాటి. 
                                                           
                                                  సాలిపల్లి మంగామణి@శ్రీమణి
                                                        pandoorucheruvugattu.blogspot.in
                             

23, మార్చి 2017, గురువారం

పదపదనిసలు


లివేణి  ఆధరమ్ములు మకరంధపు ఝరులని తలచి  తుమ్మెద ఝుమ్మని గ్రోలబోవగా 
oదువదన సౌదర్యంఇనుమడించ మదనుడినీ మంత్రముగ్ధుని గావించగా 
విద పాదాల పారాణి శోభించ ప్రకృతి పరవశించి పోగా 
లతీగబోణి కూని రాగాలు ఎలకోయిలకే చలనం తేగా    
లికి  కాటుక కన్నుల కాంతికి కలకంఠులందరికీ కనులు కుట్టగా 
చెలియ సిగ సోయగాన మల్లియ మరువం  వెలవెలబోగా
వ్వని జడపాయలు జలపాతాలై  జతులాడగా 
రుణి నుదుటఅరుణారుణకిరణం సింధూరమవగా 
ధారణి  ధరహాసపు ధగధగ  జలతారు మెరుపువగా  
నెచ్చెలి నడకల వయ్యారానికి  మయూరికే మతిచెడిపోగా 
డతి తేనియ పలుకుకు చిలుక మూగబోగా 
భామిని సొగసును ఏమని వర్ణించాలని కవి కవనం నివ్వెరపోగా 
ముదిత మోమును ముద్దాడిన ముంగురుల భాగ్యమే భాగ్యమో 
వ్వని  కరమున  జాలువారిన  రంగవల్లికి యోగమేమని చెప్పగలము . 
మణి తలపులు తడిమిచూసిన కలల రాతిరి ధన్యమే కద 
లన  తనువున నాట్యమాడిన చీరదే  జన్మవరమో 
విరిబోణి పాదాల పారాడె అందియల ఆనందమేలాగు వర్ణించగలము 
శోభనాంగిని అలంకరించిన సిరి  చందనాలదేమి పుణ్యము 
సురదన సుందర వదనం తాకిన మలయమారుతమ్ముదెంత సుకృతము 
oసయాన మిసమిసలు గాంచిన  అసలు సిసలైన జతగాని అదృష్టఫలమెంత లెక్కించ గలమా ...........
                       (తెలుగు అక్షరాలతో తెలుగు అమ్మాయిని వర్ణించాలనే నాతపన మాత్రమే) 


                                                                               సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి 

                                                                       pandoorucheruvugattu.blogspot.in


22, మార్చి 2017, బుధవారం

అచ్చతెలుగు సోయగం


ఎన్నెన్నో అందాలు,
వెన్నెల సిరిగందాలు
మది బృందావనిచేరే
మృధు మందారాలై
ఆకాశం నీలి అందాలు అందుకోమంది
నాకోసం జాబిల్లి మధువు చిలకరించింది
కూనలమ్మ కులుకులిచ్చింది
వానలమ్మ వలపులిచ్చింది
కోకిలమ్మ కొత్తరాగమాలపించింది
పరువాలచిలకమ్మ 
పంచాదారపలుకులిచ్చి పలకరించింది
సయ్యాటనేర్పింది వయ్యారికలువభామ
ఒంపుసొంపులద్దింది సంపెంగపూరెమ్మ
పులకింత పంచింది పలుకుతెనేలమ్మ
అవి చాలక ఆ తారక తళుకును అరువడిగా
పుణికి పుచ్చుకొన్నా... తెలుగునేల సారాన్ని 
   అందిపుచ్చుకొన్నా... అచ్చతెలుగుసోయగాన్ని 
అచ్చరకన్యను కాను
అచ్చతెలుగుసోయగాన్ని. 

                            సాలిపల్లిమంగామణి @శ్రీమణి   
               pandoorucheruvugattu.blogspot.in


21, మార్చి 2017, మంగళవారం

neekai



ఎటు చూసినా గిరులే,పచపచ్చని తరులే 
ఎటు చూసినా విరులు, మరులుగొలుపు ఝరులు 
ఎటు చూసినా ప్రకృతి రాసిన ప్రణయ ప్రబందాలే 
ఎటు చూసినా హృదయంగమమవు మలయ సమీరాలే 
ఎటు చూసినా తుళ్ళింతలు, కేరింతలు, గిలిగింతలు ,చక్కిలిగింతలే 
వింత వింత అనుభూతుల నా మది సాంతం ప్రశాంతమై ప్రకృతిలో మమేకమై 
విహంగమై విహరించా వినీల గగనం వైపు 
అలా అలా అలలా ఎగిసిన 
 నాహృదయంలో ఒక ఊపిరిఊగిసలాడింది 
తన్మయమొందిన తరుణంలో ఒక  ప్రణయం పలకరించింది. 
అది నాగుండెలో  మానసరాగంలా! మైమరపులసరాగంలా!
 మధుపం పన్నిన వలపులవలలా 
మదనుడు సంధించిన సుమబాణంలా 
నవ ఉషస్సులో మెరిసిన తుషారంలా 
పున్నమి జల్లిన వెన్నెలజడిలా 
కలల మాటునా !కనురెప్పచాటునా కన్నుగీటుతూ పలకరించిన
అరవిరిసిన నా పరువానికి కొత్త అనుభూతిని పంచిన ప్రాయంలా 
ఎదురయ్యింది . 
 అలా నా కన్నె మనస్సులోకి
 కమ్మని కావ్యంలా అరుదెంచిన మరు క్షణం ,
నాలో మొదలయింది నిరీక్షణం 
వేవేల వర్ణాల హరివిల్లు లో నీవు 
చలువల రేడు ప్రతిబింబంలో నీవు 
కలువల సరసన సరసుల్లో నీవు 
చిటపట  చినుకుల చిరుజడిలోనీవు 
నా కన్నె మనసు అలజడిలో నీవు 
ఏ వలపుల వలపన్నావో !!
నా తలపుల్లో 
సవరించిన నా కురులు సాక్షిగా 
నిలువజాల !నిను చూడక

నా తుది శ్వాస వరకు నా ఉనికి నీ కొరకే 
సప్త సంద్రాల ఆవల నీవున్నా .. 
నే సప్తపదులు నడిచిన నీకై నిరీక్షిస్తూనే ఉంటా ... 

                                                             సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 


హామీపత్రం

ఈ కవిత నా సొంతమనియు,అముద్రితమనియు హామీ ఇవ్వడమయినది.

నాపేరు:సాలిపల్లి మంగామణి ,
కలంపేరు :శ్రీమణి ,
వృత్తి :గృహిణి
ప్రవృత్తి :కవయిత్రి (కార్యదర్శి,కళావేదిక కల్చరల్&ఛారిటబుల్ ట్రస్ట్)
ముద్రితాలు:3
అముద్రితాలు:100కి పైగా
నా బ్లాగు: http://pandoorucheruvugattu.blogspot.in
నా చిరునామా : సాలిపల్లిమంగామణి
w|o సాలిపల్లి శ్రీనివాసరావు
ప్లాట్ నం-9,డో.నం-54-4-29,
సాయిస్రవంతి రెసిడెన్సీ,శివాలయం ఎదురుగా ,
ఇసుకతోట,విశాఖపట్నం-530022,
సెల్:8522899458,
ఫోన్ :0891-2567609,

20, మార్చి 2017, సోమవారం

అంతర్జాతీయపిచ్చుకలదినోత్సవంసందర్భంగా ...


కాకమ్మ,పిచ్చుకమ్మ కథ వినని వారున్నారా ..!
పిచుకమ్మే మన కిష్టమయిన కథానాయిక మనపిట్టకధల్లో ...
పిచ్చుకగూళ్ళను చూస్తూ అమ్మ చెప్పే కమ్మని కథలు వింటూ పెరిగాం... 
పిచుకమ్మ లేని కమ్మని బాల్యం  ఊహించగలమా ... 
చిట్టిపొట్టి పిచుక మట్టికలవబోతుందంటే తట్టుకోగలమా ... 
మనకు మచ్చికయిన పిచ్చుక మచ్చుకుకూడా కనబడదంట 
బంగారు పిచ్చుక  పిట్ట కధలకే పరిమితమంట  
అంతరించబోతుందట అందాల పిచుక,
కిచకిచలింక వినబడవంట ... బుల్లిపిచ్చుకకు నూకలు చెల్లిపోయేనంట,
అచ్ఛిక బుచ్చిక మాటలు కావివి,
మన శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చిన పచ్చినిజాలు 
అమ్మో!మన చిన్ననాటి  నేస్తాన్ని మరచిపోవాలంటే 
నాకయితే గుండె కలుక్కుమంటుంది. 
దారుణమేంటంటే 
మారణకాండకు మనమే కారణమంట 
 మన విచ్చలవిడి వికిరణాల విషప్రయోగ ధాటికి 
నిలవలేక ,ప్రకృతిప్రకోపానికి  తట్టుకోలేక
భానుని తాపానికి,పెరిగినభూతాపానికి 
తాళలేక,తలదాచుకునే వీలులేక ,
గ్రుక్కెడు నీళ్లు దొరక్క,తిండి గింజలు లేక 
డొక్కలెండి,రెక్కలుడిగి నేలకొరుగుతున్నాయట. 
మరుగవబోతున్నమరో జాతిని బ్రతికించుకొందాం ,,, 
మన తప్పిదాలకు  మనవంతు  పరిహారం చేద్దాం...
మన ఇంటిముంగిట పక్షులకుఆహారాన్నీ,నీటినీ అందుబాటులో ఉంచుదాం
 అన్యంపుణ్యం ఎరుగని అతిచిన్నపక్షిజాతిని ఆడుకొందాం. 
(నేను 5 సంవత్సరాలనుండి పిచ్చుకలకు ధాన్యం నీళ్లు అందిస్తున్నాను. 
మా ఫ్లాట్ ముందు ధాన్యపు గుత్తులు కడుతుంటాను,చాలా పక్షులు వచ్చి కడుపునిండా తిని వెళ్తుంటాయి.. నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది.)

                                                                                          సాలిపల్లిమంగా మణి @@శ్రీమణి 

19, మార్చి 2017, ఆదివారం

అమ్మకన్నీటిచెమ్మ




ఆమాతృమూర్తికి  ఏం తెలుసు ... తను తరిమేయబడ్డానని,
కన్నకడుపుకేం తెలుసు కన్నబిడ్డలు  కటిక పాషాణాలని,
కలనయినా అనుకొందా ...
జన్మనిచ్చుటలో  మరు జన్మమెత్తిన అమ్మనే  అంగడికీడుస్తారని ,
నడిరాతిరి  నడివీధి కుప్పతొట్టికి తనను కానుకిస్తారని,
అరక్షణములో వస్తానని ఆరుబయటే వదిలేసి వెనుదిరిగి చూడకున్నా,..
నీరెండిన కళ్ళతో నిరీక్షిస్తూనే ఉంది,
 ఆ అమ్మను చూస్తే  అమ్మతనమే మూగబోయింది.
 ఆకాశం గుండె బ్రద్దలయ్యింది,నేలతల్లి సైతం పాలుపోక చూస్తుంది ,
 కన్నబిడ్డల కసాయి చర్యను కనిపెట్టలేని ఆ కనిపెంచినతల్లి  కడుదీనస్థితి చూసి .
 ఆ నిర్వికార  చూపులతో,నిశ్చేతనయైన ఆ శరీరాన్ని ముసురుతున్న మురికి జీవాలు అమాంతం స్వాధీనపరచుకొని ,దొరికినంతా దోచుకొంటూ రక్త మాంసాలు పంచుకొంటూ స్వైర విహారం చేస్తున్నా ... వాటిని అదిలించటానికీ కదిలే సత్తువలేక .   స్థాణువై .నిస్త్రాణమైనా  నిరీక్షిస్తూనే ఉంది.
అరక్షణం లో వస్తానంటూ...  తరలెల్లిన తన బిడ్డలు ఏ క్షణాన వస్తారో యని
అమ్మతనం మాత్రం ఆదమరచక చూస్తేనే ఉంది.  ఆ కన్నబిడ్డల రాక కోసం.
ఏమానవత్వపు  హృదయం అయినా చేరదీసి సేద తీర్చుదామన్నా !
తనను కానక తనబిడ్డలు తలమునకలవుతారని ఆ పిచ్చి తల్లి ఆరాటం
. అంగుళమయినా కదలనీదే ...
చావు బ్రతుకుల పోరాటంలో చివరి మజిలీ చేరుకొన్నా ..
ఆ తల్లి ని చూసిన ప్రతీ బిడ్డా చలించి పోతున్నా!
కన్న బిడ్డలే కాలయములై  కారు చీకటికి బలి ఇస్తే ,
ఆకలి దప్పులు మరచినా కడుపు తీపిని మాత్రం కడ దాకా దాచే ఉంచింది.
కన్న ప్రేగుబంధనాలను త్రెంచుకోలేక. 
దారి మరచి పోయారో,ఏమో ... అని తల్లడిల్లి , .
ఏ దారిన మీరెల్లినా ! నా వాళ్ళు జాడ కనిపిస్తే ఈ అమ్మకప్పగించండి .
అందాకా కనురేప్పేయక కాచుకొనే ఉంటా !కదలలేని నేను .మృత్యు వొచ్చి కభళిస్తానన్నా !
నా బిడ్డల చూసే వరకు నువు వేచే ఉండమని  మొరాయిస్తానంటూ ..ఆ అభాగ్యపు అమ్మ తన కన్నీటిచెమ్మలో కన్నబిడ్డల ప్రతిబింబం పదిలం గావిస్తూ...
  వదిలేసింది,వదులై పోయిన ఆ అమ్మ జన్మను,
 అమ్మతనాన్ని ,అనురాగాన్ని అమరం చేస్తూ .. కమ్మనైన అమ్మఆత్మ కాలగర్భంలో కలిసిపోయింది సమరం చేయలేక నేటి పైశాచిక తనయుల పై,తనువే చాలించింది . అదే అంగడి కుప్పతొట్టిదరి ఎదురుచూపుల ఎండమావిపై.
( దినపత్రికల్లోప్రతీ రోజు మనం చూస్తున్న ఎందరో అమ్మల ధీనస్థితి ఇది.
కన్నవారిని కానివారిగా కర్మానికి వదిలేయకండి,
కడవరకూ కంటికి రెప్పగా కాపాడుకోండి.)              
                                                                          సాలిపల్లి మంగామణి @శ్రీమణి  

17, మార్చి 2017, శుక్రవారం

మత్తు-గమ్మత్తు


 ఊది ఊది ఊపిరి ఆగిపోయే వరకు ,పీల్చేసై ,
 టన్నుల కొద్దీ సిగరెట్లు కాల్చేసై . జల్సా చెయ్ , . 
హద్దులు మరచి,విందులో, కనువిందుగా ,... 
మందుతో బహు పసందుగా ... 
వెలిగించు రింగురింగులుగా..... పొగ గుప్పించు
ఎలాగూ... రేపటి నీ బ్రతుకు ఆరిపోయే దీపమేగా... వెలుగెక్కువే ..
మసి పట్టిన ఊపిరితిత్తులెలాగూ నీ ఊపిరితీసి నిను మట్టి కలుపుతాయి.
 నీ ఆయువు ఆవిరయినా ... 
నిండు బ్రతుకు నీవల్లే నిప్పులకొలిమయినా ... 
 నీ ఇల్లాలి తాళి చేల్లిపోతేనేం ?నీ బిడ్డల తలరాతలు తలక్రిందులయితేనేం?
 కన్నవాళ్ళ గుండె బ్రద్దలయితేనేం?
 గుప్పుగుప్పు మంటూ ఆ గబ్బును గభ గభా లాగించెయ్, 
 మత్తులోని గమ్మత్తు ను అమాంతం ఆస్వాధించెయ్ , 
 నువ్వు కాల్చేప్రతీ సిగెరెట్టు, ప్రతీక్షణం ,నీలో ప్రతికణాన్నికణకణమని  కాలుస్తూ 
నీకే ,తెలియకుండానే నీ ఉసురు తీసేందుకు,ముసురు గాసింది. 
కాటికి దగ్గర దారి... కాలయముడితో కాలక్షేపం సరాసరి,
నిన్నటి  నీ వ్యసనానికి నీ వొళ్ళు, నిన్నునమ్ముకొన్నవాళ్ళ ఆశలకు నీళ్ళొదిలేసేయ్, నీ తనువు చిధ్రమై ,బ్రతుకు నిరర్ధకమై ,నిత్యం మృత్యు కేళీ విలాసంలోఊగిస లాడుతూ 
నీకు నీవే భారమై , నీవారికీ పెనుభారమై ,గమ్మత్తులకెగబడి మత్తుల్లో తూలితే  మరమత్తు చెయ్యలేని మరబొమ్మగా మిగిలి తగలబెట్టు నీ వాళ్ళ నిండు భవితను నిర్దాక్షిణ్యంగా ... 

గమ్మత్తులు చూడాలనిమత్తుల్లో తూలితే మరమ్మత్తు చేయలేని మరబొమ్మై మిగులుతావు.           తస్మాత్ జాగ్రత్త !   ( ధూమపానం-మరణానికి సోపానం ,యమపాశానికిఆహ్వానం )
            దయచేసి మత్తుమందులకు బానిసలవ్వద్దని అభ్యర్థిస్తూ... మీ సహోదరి

                                                                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                                                                             pandoorucheruvugattu.blogspot.in
                                                       



15, మార్చి 2017, బుధవారం

వరాన్వేషణ


చిలకమ్మ అడిగింది చిగురాకుని 
చిరునవ్వు వెల యెంతని? 
భ్రమరమ్ము అడిగింది పూబాలను
తను చవులూర్చు మధువేదని ? 
చిరు కోయిల అడిగింది వాసంతాన్ని 
తను అరుదెంచు ఘడియేదని  
కలువభామ అడిగింది చందమామని
 వెన్నెలొలకబోసి తను చుంబించరావా... అని 
తరచి తరచి అడిగింది రాధిక బృందావనిని 
వలచిన తన జతగాని  జాడేదని. 
                సాలిపల్లిమంగామణి@శ్రీమణి  

13, మార్చి 2017, సోమవారం

ఎల్లా వేగేదీ నీతో ...


ఎల్లా వేగేదీ నీతో ...
నేనెల్లా  సాగేది నీతో...
నల్లని వాడా...  నావల్ల కాదిక
గొల్లపల్లంతా గొల్లుమందిక
తెల్లతెల్లవారకనే నీ అల్లరే
మాకు మేలుకొలుపా!
కన్నులు కలనుండి కదలకనే
కలహాలే మాకు పొద్దుపొడుపా !
అల్లన గొల్లపిల్లను చేరి,
 అచ్ఛికబుచ్చికలాడావంట.
అంచయాన జడకుచ్చులు లాగి,
జర్రున జారుకొన్నావంట.
జలకాలాటలో కలిచిలుకల చేరి,
జలతారువలువలు దోచావంట.
పాలుపెరుగు దొంగిలించావంట,
జున్నులు ఎంగిలి చేశావంట,
వెన్నమీగడలు దోచావంట.,
అమ్మణ్ణి నోటికి పూసావంట .,
కొప్పుల గొడవలు పెట్టావంట.
ఉట్టిలో కడవలు కొట్టావంట
  తాళలేనిక నీ అల్లరి చాలిక
 రోళ్ళు తాళ్లే నీ నేస్తాలింక.

12, మార్చి 2017, ఆదివారం

ఈ కన్నీళ్లు ... ఇంకెన్నాళ్లు ?



ఎన్నాళ్ళిలా .. 
 పావలా బతుకులో  ముప్పావలా వెతలు 
 పట్టెడు   మెతుకులకై పుట్టెడు అగచాట్లు . 
 కంట కన్నీళ్లు ,ఇంట గంజి నీళ్ళు .  
 భూమి పుత్రుల ఆత్మార్పణలు ,
 ఎన్నాళ్ళిలా 
 మంచం లేచిన మొదలు లంచపు లాంచనాలు . 
 గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తూలుతూ 
 మరమ్మత్తు చేయలేని మరబొమ్మ గా మారుతున్న వైనాలు
 కుప్పతొట్టికి బహూకరించిన పసిమొగ్గల  ఆక్రందనలు 
  చీత్కారంతో అమ్మల కు నడిరోడ్డు సత్కారాలు 
  ఎన్నాళ్ళిలా .. 
 అడుగడుగునా అబలలపై  అకృత్యాలు 
  అడ్డుకట్టలేని అవినీతి మురికి కూపాలు . 
  మసక బారిపోతున్న మానవత్వపు  ఆనవాళ్ళు . 
 మర జీవనాలు,అనురాగ రహిత జీవశ్చవాలు 
 నల్లధనం మూటలు ,కోటలు దాటిన మాటలు 
 ఎన్నుకొన్న నాయకుల వెన్నుపోట్లు ,పన్నుపోట్లు 
 అడుగడుగునా  విద్య విక్రయశాలలు . 
 పైసా లేక ఆసుపత్రుల్లో అసువులు బాసిన అభాగ్యులు 
 ప్రభుత్వంలో భుక్తాలు ,
 పాలనా యంత్రాంగంలో మంత్రాంగాలు 
  దొంగోడే దొరలా ..   నిలువు దోపిడీ విధానాలు . 
 నీరసించిన ధర్మపాదం . 
 పెచ్చుమీరిన  అధర్మ వాదం . 
 ఈ కన్నీళ్లు ... ఇంకెన్నాళ్లు ?
 రాదంటారా కలలు గన్న సమాజం . 
 లేదంటారా .. సుభిక్షమయిన  జనజీవనం 
 అర్ధ రహితమంటూ  .... వృధా యత్నమంటూ 
ఈ వ్యవస్థ ఇంతేనని తమ  మట్టుకు తలపట్టుకు కూచోక 
మీ నుండే మొదలెడితే  .. మార్పు అనే మరమ్మత్తు.  
మన  వంతుగ కృషి చేస్తే  ..మాన్యమగు  వ్యవస్థ తధ్యం 
 ప్రతీ నీవు స్పందిస్తే ప్రపంచమే మారదా ... 
 పట్టు వీడక ప్రయత్నిస్తే పసిడి పండదా బీడు భూమిలో .... 
 ప్రయత్నిద్దాం ... ప్రయత్నిస్తూనే ఉందాం . 


                                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                      http://pandoorucheruvugattu.blogspot.in




హోలీ


 సంబరాలు  అంబరాన్ని తాకేలా !
ఆకాశమే  హద్దు  సప్త వర్ణాలు  మెరిసేటి  ఈ వేళ !
సరిహద్దులే  మరచి  ఆడిపాడాలి  ప్రతీ  మనసు మైమరచేలా !
ఉవ్వెత్తున ఎగిసిపడే  ఆ సంద్రపు  అలలా !
నెరవేరాలి  ఈ వేళ  రంగురంగుల  కల !
విరిసిన   ముద్దు రోజా రేకులా !
కురిసిన  హరివిల్లులో వర్ణాలు  సిరిజల్లులా !
చిరుగాలి పరదాల ఊగిసలాడే  మనసే  ఊగాలి  ఊయలలా !
ప్రతి  స్వరం పరవశించి  పాడాలి  ఎల కోయిలలా !
మనసు  పూల తోటలో ఆనంద కుసుమాలు  విరబూయాలా !
వెల్లి  విరియాలి  ప్రతి  ఎద లోగిలిలో ఆనంద  హేల !
                              
                అని  ఆకాంక్షిస్తూ ........ 
                                                      మీ  

                                   సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

11, మార్చి 2017, శనివారం

ప్ర(కృ)తిఫలం



విరులు విరబూసి నవ్వవా!
వాలుజడ చేరి  వాడినా... 
తరులు తరించిపోవా! 
తమను సాంతం అర్పించుకొన్నా!
నెలజీతం అడిగాయా !సెలయేటి ఝరులు 
మబ్బులు కురవాలని ... డబ్బడిగాయా 
మధువిచ్చి భ్రమరమ్ము మరలి పోదా !
మోయలేనందా.... నేలమ్మ మనను 
రేయి నిద్దరోతుందా !వెన్నెల 
హాయికి వెలకడుతుందా ... 
  పొద్దుపొడవనందా...ప్రతిఫలమేదంటూ 
తెల్లబోయి చూస్తుందా !పిల్లగాలి  వీచక 
నావల్ల కాదని నింగి నీరసించిందా 
నాకెందుకొచ్చిందని జాబిలి నిదరోతుందా 
పడి లేవనంటుందా .. ఎగిసే కెరటం
పురిటినొప్పులకువెరసి 
అమ్మ జన్మనివ్వకుంటే 
మనుగడేదీమనకు పుడమిపైన 
ప్రతిఫలమాశించక ప్రకృతిలో
ప్రతి అణువు పరులకై పరిశ్రమిస్తుంటే 
తనకోసం తానే జీవించే మనిషికి మాత్రం
 ప్రతీ పనిలో ప్రతిఫలాపేక్షణమే.. 
కర్తవ్యం లోనూ... కాసులకైంకర్యమే 
                  (కాదంటారా... నా మాటలని 
                 కొట్టిపారేస్తారా వట్టి మూటలని) 

                                          సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

                                          Pandoorucheruvugattu.blogspot.in







 

5, మార్చి 2017, ఆదివారం

ఆ వేళలో...


పారిజాత పరిమళాల ఆ ప్రభాతవేళ
 కులుకుపూల,పలుకుతేనెలూరేవేళ
 విరులు ,వింధ్యామరలై
మరులు మరువంపు సరులై ప్రభవించే  వేళ
కోయిల కువకువలే  వేకువ రాగాలై
నీలిమేఘాల దొంతరపై మది సోలిపోయేటి వేళ.
పొగమంచు పరదాల పచ్చిక మురిసే వేళ
తొలిపొద్దును వెలుగురేడు ముద్దులాడే వేళ
ఆవేళలో   ...ఆవేళలో మొదలాయె
వేవేల కదలికలు,
కలలో,కన్నుల్లో వెలిసిన కమ్మని కావ్యాలో
తలపులో,మైమరపులో
వలపులో,వెచ్చని నిట్టూర్పులో
మురిపాలో,తొలకరి రసరాగాలో
ఊరించే కలలో ,ఊహల కెరటాలో
హరివింటిసరాలో,విరివింటి శరాలో
కలకంఠి గుండెల్లో కమ్మని కధనాలో
నులివెచ్చని  తలపులు ఎద తలుపులు
తలపులు కావవి . వలపుల మైమరపులు
అన్నులమిన్నకుఅరమోడ్పుకన్నులు
అమ్మో !ఆ ఊసులు ముసిరే మురిపాలు,
వినువీధుల పైనే ఊరేగే కలలూ ...
మానసచోరుని,మధుగోపాలుని
సద్దులుసేయక నిద్దురలోనే చేరే దారులు,
మురళీ లోలుని,మదిలో మలిచే
మనమోహన మదనుని ఎదలో కొలిచే
ఎన్నో కలలను కనులకు పూసే వెన్నెల దారులు.
                 
                                               సాలిపల్లి మంగామణి@ శ్రీమణి

                                               pandoorucheruvugattu.blogspot.in