ఏడాదాగున్నావే తుమ్మెదా ... ఎద గిల్లి పోయావే తుమ్మెదా ...
హాయి,హాయిగ నువ్వు ఎగిరిపోయావు
తీయ,తీయని మధువును దోచేసినావు
మురిపించి ముచ్చట్ల ఊసులాడావు
అర ఘడియలో చూస్తే తుమ్మెదా ... . అస్సలు కానరావె తుమ్మెదా ..
మేఘాలు చాటుకు పరుగులు తీసావా ... తరుల పరదాల మాటున ఒదిగిపోయావా
చారెడేసి కళ్ళు తుమ్మెదా ... కాయల్లు గాసాయే తుమ్మెద
ఏడు మల్లెల మేను తుమ్మెదా ... అలసి సొలసినే తుమ్మెద
మెరిసే పూబాలను నన్నే ... నీ వన్నెలతో మురిపించినావు
మైమరపు వెల్లువల వల్లో ... నిలువెల్లా ముంచేసినావే
ఆటలన్నావు ,పాటలన్నావు,మాటల్లో మదనుడి తలనేదన్నావు
మాయ మాటలతోటి తుమ్మెదా ... మనసెత్తు కెళ్ళావే తుమ్మెదా
తుంటరోడివి నువ్వు తుమ్మెదా .. ఒంటరి చేసి జారుకొన్నావా ...
దిక్కుల మాటున నక్కి సక్కగున్నావో ... గగనపు చుక్కల సందిట చిక్కావో ...
ఏ పూవుల ప్రక్కన చేరి సరసాలాడేవో ... ఈ పూబాలనెట్టా ... ఆదమరిచావో ...
సాలిపల్లి మంగామణి@ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి