పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, జూన్ 2016, గురువారం

దోబూచులేలా ....


చిలుక నడిగి కులుకు  నేర్చుకున్నా.... 
తారక నడిగి తళుకు తెచ్చుకొన్నా... 
మేనక నడిగి మెలికలు అందిపుచ్చుకొన్నా 
 జాబిలికి జాబు రాసుకున్నా... జామురాతిరి వెన్నెల ఒలకబోయమని 
జడివానకు కబురెట్టా ... ఎట్టాగైనా ముత్యాల జల్లు కురవాలని  
హరివిల్లును  అడిగి  పానుపేసా ... నీలి మేఘాల దుప్పటి అప్పడిగి తెచ్చా ... 
పిల్లగాలి పరదాను విసరమన్నా.. కోయిలమ్మను మనకు జోల పాడమన్నా..
మధుపంతో  మంతనాలు చేసి మకరందం అధరాలకు అద్దేయమన్నా.... 
సూరీడికి మనవి  చేసుకొన్నా ... నెమ్మదిగా ఉదయించమని 
 అన్నీ సిద్ధం చేసా... ముద్దుల నా కృష్ణా 
 సద్దు సేయక వచ్చి కనులు మూస్తావని 
 ముద్దులన్నీకలిపి వెన్నముద్దలిస్తావని 
 వలపులన్నీ మురళిలో మూటగట్టి 
 నీ ప్రణయరాగాలలో ఓలలాడిస్తావని 
వేచియున్నా... ప్రియా .. 
దోసిట నా చిరునగవుల సిరులతో 
సిగలో సిరి మల్లియ మాలికతో 
ఎగసే నా మనసును ఊరడించలేకున్నా ... 
ఆలస్యం  సేయక రా..  కృష్ణా అలసిన నీ రాధిక కై  
దోబూచులు చాలించి దరి చేరవా మాధవా నీ ప్రేమికకై . 

                            సాలిపల్లిమంగామణి @శ్రీమణి 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి