చిట్టి చినుకుల్ల జడిలో, చిగురాకు అలజడిలో
నడి రేతిరి వెన్నియలో, జాబిలి నయగారపు హొయలో
సంధ్యారావంలో,వింధ్యామరరాగంలో ..
ఆనీలి మేఘంలో ,ఆ గగనపు హరివిల్లు వంపులో నిన్నే చూస్తున్నా...
ప్రతి సవ్వడిలో.. . ఆ ప్రకృతి ఒడిలో ,నిన్నే చూస్తున్నా ...
మరువపు సిరిలో ,మరు మల్లెల ఝరిలో,ఎగిసే ప్రణయపు ఒరవడిలో
పున్నమి వెన్నెల తాకిడిలో,సెలయేటి సందడిలో,ఆ సంద్రపు అలజడిలో
చూస్తేనే ఉన్నా ... నువ్వొస్తావనీ ,
కలగంటూనే ఉన్నా...
కనురెప్పల మాటునయినా ఉదయిస్తావని,
వింటూనే ఉన్నా ... నా గుప్పెడు గుండెలో
నీ గుండె సప్పుడు.
నిను వలచి,మైమరచి,నిన్నే తలచిన ఎదనే
ఏమార్చలేకున్నా ... అనుక్షణం నీ ఊహలే
విరి తేనియ జల్లులై, ఆ మదనుని విల్లులై
కలవరపెడుతుంటే !ఘడియాగలేక
నీ ఊహైనా రాక,తికమక పడుతున్నా...ప్రియసఖా
కల కూడా రానంటే నువు లేకుండా ... ఊపిరాగిపోదా... మరి
విలవిలలాడిందే నా చిట్టి గుండే ... నిన్నే చూడాలని,
(ఆ మాధవునికై రాధిక ప్రణయామృతం )
సాలిపల్లి మంగామణి@శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి