పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
8, నవంబర్ 2014, శనివారం
1, నవంబర్ 2014, శనివారం
అధినాయకుడు
మా పాలి ఆ దైవం నియమించిన బంటువి .
కావయ్యా .. .. నీవూ మామూలు నాయకుడువి .
మొక్కవోని ధీక్షలో మొట్టమొదటి సైనికుడవు .
పొగడాలని కాదు నిన్ను . ఎడతెగనీ నీ తెగింపు .
కుదేలయిన వైశాఖికి తిరుగులేని ఓదార్పు .
హుదూద్ బెబ్బులి పంజా దెబ్బకి కమిలిన మా గుండెల్లో
కొండంతటి ధైర్యం పూసి , కర్తవ్యం తక్షణమే స్ఫురింపచేసి
కార్యోన్ముఖులను చేసి ,కాంతి రేఖ నీవై నిలిచి
విశాఖ విషణ్ణ వదనాలలో కొత్త దివ్వె వెలిగించి
చిందర వందరయిన విశాఖను బహు సుందర నందన వనముగ మార్చాలని
ఒక ఋషిలా శ్రమించి "అధినాయకుడను " పదాన్ని ఆత్మీయతతో అధిరోహించి
అలసిన మాకు బాసట నిలిచిన ఆత్మబంధువు నీవు .
తిన్నావో .. లెదో .. .. కన్నతల్లి గుండె నీది . మాకు తిండి మెతుకులివ్వాలని ఆరాటంలో ....
కునుకయినా .. తీశావో ... లెదో ... చెదిరిన మా గూళ్ళే ... నీ కలలోకొచ్చి .
నిన్నటి కటిక చేదు విష విలయాన్ని నీల కంఠుని వోలె నీలోనే దాచి
నీ కరుణామృత ధారలతో మాకూరటనిచ్చి
పెను తుఫాను సైతం తలవంచేలా ...........
చేజారిన బ్రతుకుల్లో , బేజారయిపోయిన మా గుండెల్లో
మనోధైర్య బీజాలను , మానవతా తేజాన్ని మాలో నింపి, మోడువారిన నేలపైన కొత్త చివురులు తొడిగించి
మార్గదర్శి వై నిలిచి , మా ఇలవేలుపువయినావు .
ఆ రాకాసి సుడిగాలి రక్కసి కర్ఖశ క్రీడలో చేతలుడిగి నా విశాఖ నడివీధిలో
నిల్చుంటే ,శిలలా వెలవెలబోతే ,కన్నేర్రజేసిన కడలి ప్రకోపానికి కకావికలమై , కళా విహీనమయి
మరుభూమిని తలపిస్తే ,
కారు చీకటైన మా బ్రతుకుల్లో వెన్నెల కురిపిస్తానని వాగ్ధానం చేసిన విశాఖ చందురుడవు నీవు
పడి లేచే కెరటానికి ఉందా .. అలసట అంటూ ....
మరలా మనం వెలగాలని మార్గం నిర్దేశించి
మొద్దు నిద్దరోతున్న నాయకులను ఉలిక్కిపాటు చేసి
అధికార యంత్రాంగాన్ని ఆసాంతం కుదిపేసి
నవ విశాఖ నిర్మాణం సంకల్పించి ,కధన రంగ సింగంలా రంగంలో దూకి
కర్తవ్య ధీరుడవై ముందుకు నడచేవు . మాలో ఒకడిగ నిలిచావు .
మా ఆశా జ్యోతిగా నిలిచేవు .
(నిన్నటి హుదూద్ విలయంలో విలవిలలాడిన నాటి నుండి నేను ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎన్నో విదాల ప్రయత్నించి
విఫలమయి నా మనస్సులోని కృతజ్ఞతను , వేవేల గుండెల్లో భావనను
ఆయనకు చేరాలనే చిరు ఆకాంక్షతో మీ అందరితో పంచుకొంటున్నాను .. .. ఒక సాదారణ గృహిణి )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
21, సెప్టెంబర్ 2014, ఆదివారం
ఒట్టేసి చెప్పెయ్యవా !

ప్రియా ! నీవు నీ సతి వలపుల వెల్లువలో పరవశమై ఆ ప్రణయ రస సుధా ఝరిలో మునిగి
పంచ వన్నెల పసిడి స్వప్నాల సిరి చందనాల పరిమళాల ఆదమరచి నిదురోతుంటే
నీ పుట్టిన రోజని నీ చుట్టూ చేరి చెట్టూ చేమా , శుభాకాంక్షలన్నాయి
నింగిలోని నులు వెచ్చని చంద్రికలు వెన్నియలను వెంటబెట్టుకొచ్చాయి. నీకు శుభాకాంక్షలంటూ
అరవిరిసిన గులాభీ నిదురించిన నీ మోమునే గోముగా చూస్తుంది . నీ మోమును గని తన వలె సుమమనుకొని
నీలి మేఘాలు నీకోసమే లేఖ రాసి పంపాయి నీరజాక్షునికి .నీకు నిండు నూరేళ్ళు వర్ధిల్ల వరమిమ్మని
కలువ చెలియలు , కులుకు చిలుకలు , మకరందపు తుమ్మెదలు , మైమరపించే మరు మల్లియలు
తలో కానుకను వెంట బెట్టుకొచ్చాయి . నీ పుట్టిన రోజుకి . పట్టరాని ప్రేమ సంతకాలతో
ప్రకృతి అంతా పరవశించి పోతుంటే , నీ సతి మాత్రం రెప్ప వేయక చూస్తుంది . నీ తెరిచిన కనురెప్పల మాటున
చప్పుడు చేయక కూచున్నది తనే నా ! అని . తనువూ మనసూ ఏకం చేసి తపో కన్యకలా తపిస్తోంది . అను క్షణం నీ ప్రణయ కటాక్ష వీక్షణాలకై . ఈ పుట్టిన రోజయినా ఒట్టేసి చెప్పెయ్యవా ! నీవే నా ప్రియ సఖివని ,
పదివేల జన్మలకూ ఈ బంధమే పదిలమనీ , నా చేయినెన్నడు వీడిపోనని
నా శ్వాసలో నీ ధ్యాసనే కలగలిపి తన వలపుల, నీ తలపుల సుమ మాలతో వేచియుంది . నీకు శుభాకాంక్షలంటూ ...
.....
29, ఆగస్టు 2014, శుక్రవారం
28, ఆగస్టు 2014, గురువారం
తెలుగు భాషా దినోత్సవo గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా
తెలుగు నేలపై కురిసిన సుధా మధుర మాధుర్యం విరి తేనియ మకరందం మన గిడుగు
పర్వతాలపేటయందుదయించిన తెలుగు పర్వత శిఖరం మన పంతులు
గిడుగు వారిఇంట జనించిన పిడుగు లాంటి తెలుగు కలికితురాయి
గ్రాంధికపు కౌగిలి నుండి సాహిత్యాన్ని వ్యవహారిక భాషకూ వరమిచ్చిన వ్యావహారిక భాషోద్దరుడు
మామూలు మనిషికీ మధురమయిన సాహిత్యం చవి చూపిన సరళ కవితా నిర్దేశకుడు
సమాజానికి చేరువగా సాహిత్యాన్ని అలవోకగా అందరికీ అందించిన నవ కవితా వైతాళికుడు
ఆ మహోన్నతుని అడుగు జాడఏవత్ తెలుగు భాషసరి కొత్త వెలుగు జాడ
కన్నతల్లి తేట తెలుగులమ్మకు సహజ మెరుగులు అద్దిన మేటి చిత్రకారుడు
తన అక్షరాల అల్లికతో కలానికి కొత్త కళను నేర్పిన కళా ప్రపూర్ణుడు
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
18, ఆగస్టు 2014, సోమవారం
ఎట్టా చేరను కిట్టయ్యా
ఎట్టా చేరను కిట్టయ్యా నిన్నెట్టా చేరను కిట్టయ్యా
చెట్టా పట్టాలేస్తావు మళ్ళీ పత్తా లేనే లేవు
చుట్టూ నువ్వే ఉంటావు తీరా కనికట్టేదో చేస్తావు
చెట్టూ చేమల మాటున నక్కి నన్ను అష్టాకష్టాలెడతావు
హద్దు లేని ప్రేమంటావు . నీ ముద్దు చెలియ నేనంటావు
ముద్దుగుమ్మల చెంత చేరి మైమరచి రాసలీలలాడుతావు
వెన్నముద్ద నన్నడిగి మిన్నకుండిపోతావు
నీ సన్న చెక్కిలి నవ్వుతో చెలియల మనసును దోచేస్తావు
నా హృదయపు తలుపులు నీకై తెరిచా కన్నయ్యా
నీ వలపుల తలపులు మాత్రం పలువురిపైనా పరిచేవా
నా గుండె సప్పుడు విన్నావో ఎప్పుడూ కిట్టయ్యంటాది
మల్లె చెండూ నీ మనసుమాత్రం మగువల మద్యనే మారుతుంటది
ఎన్ని జన్మాలెత్తాలయ్యా నల్లనయ్యా
నీ ఎద సన్నిధి చేరుటకై ఓ చల్లనయ్యా
నువ్వెన్నెన్ని చిన్నెలు చేసినా వెన్నదొంగా .. నిన్ను వీడను
నీ తలపుల మకరందపు సుధను కలనైనా మరువను నేను
నిను చేరే దారిని సరళం చేస్తే గరళాన్నైనా సేవించేస్తా
నిను చూసే భాగ్యం నా కనులకు ఇస్తే అంధకారంలోనూ ఆనందిస్తా
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
17, ఆగస్టు 2014, ఆదివారం
నన్నెరుగవా.....
నన్నెరుగవా !కృష్ణా .. నన్నెరుగవా !
నన్నెరుగవా .. కృష్ణా .. నన్నెరుగవా ...
మన్ను తిన్న చిన్ని కృష్ణా .. నన్నెరుగవా
కన్నె మానసచోరా .. కృష్ణా .. నన్నెరుగవా
వెన్నముద్దలు ,జున్నుముక్కలు దోచుకొన్న
చిలిపి కృష్ణా నన్నెరుగవా ..
దోబూచులాడుకొన్నాం నన్నెరుగవా
తాయిలాలు పంచుకొన్నాం నన్నెరుగవా
నీ వేణువునకు మైమరచిన నన్నెరుగవా
బృందావన మురళీ లోల నన్నెరుగవా
అందచందాల మోహనకృష్ణ నన్నెరుగవా
నంద భూపాల గోపాల కృష్ణా నన్నెరుగవా
యశోదమ్మ ముద్దుల కృష్ణా నన్నెరుగవా
రేపల్లెనేలేటి మురిపాల కృష్ణా .. నన్నెరుగవా
నీ మది దోచిన ప్రియసఖి నే నన్నెరుగవా
నీలమేఘశ్యామా కృష్ణా .. నన్నెరుగవా
నీ చెలిమికై నిరీక్షించె నేచ్చేలినే .. నన్నెరుగవా
నీ తలపులలో వేచియున్న నీ రాధను నేనే .. నన్నెరుగవా
పారిజాతపూలు నా దోసిట నింపి
నీ రాకకై వేచి యుంటి .. నన్నెరుగవా
వేగిరముగా రమ్మంటూ జాగరాలు చేస్తున్నా
నా కన్నె మనసు దోచుకొన్న కన్నయ్యా
కలవరపెట్టకచెప్పు నన్నెరుగవా ...
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
నన్నెరుగవా .. కృష్ణా .. నన్నెరుగవా ...
మన్ను తిన్న చిన్ని కృష్ణా .. నన్నెరుగవా
కన్నె మానసచోరా .. కృష్ణా .. నన్నెరుగవా
వెన్నముద్దలు ,జున్నుముక్కలు దోచుకొన్న
చిలిపి కృష్ణా నన్నెరుగవా ..
దోబూచులాడుకొన్నాం నన్నెరుగవా
తాయిలాలు పంచుకొన్నాం నన్నెరుగవా
నీ వేణువునకు మైమరచిన నన్నెరుగవా
బృందావన మురళీ లోల నన్నెరుగవా
అందచందాల మోహనకృష్ణ నన్నెరుగవా
నంద భూపాల గోపాల కృష్ణా నన్నెరుగవా
యశోదమ్మ ముద్దుల కృష్ణా నన్నెరుగవా
రేపల్లెనేలేటి మురిపాల కృష్ణా .. నన్నెరుగవా
నీ మది దోచిన ప్రియసఖి నే నన్నెరుగవా
నీలమేఘశ్యామా కృష్ణా .. నన్నెరుగవా
నీ చెలిమికై నిరీక్షించె నేచ్చేలినే .. నన్నెరుగవా
నీ తలపులలో వేచియున్న నీ రాధను నేనే .. నన్నెరుగవా
పారిజాతపూలు నా దోసిట నింపి
నీ రాకకై వేచి యుంటి .. నన్నెరుగవా
వేగిరముగా రమ్మంటూ జాగరాలు చేస్తున్నా
నా కన్నె మనసు దోచుకొన్న కన్నయ్యా
కలవరపెట్టకచెప్పు నన్నెరుగవా ...
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
15, ఆగస్టు 2014, శుక్రవారం
జయహో నా భారత ధరిత్రి
వీరులకు , ధీరులకు జన్మనిచ్చిన ధన్యశ్రీ
కవిత్రయం కన్నతల్లి పుణ్యశ్రీ నా తల్లి భారతి
సస్య శ్యామల దివ్య ధాత్రి నా ధరిత్రి
సృష్టి సిగలో మెరిసిన వాడని కుసుమం నా ధరిత్రీ
ఉగ్గుపాలతోనే ఇకమత్యం కలిపిచ్చిన సమైక్య భారతి
గోరుముద్దలతోనే మానవతను నేర్పించిన కారుణ్య మూర్తి
తన సంస్కృతీ సౌరభాలు నలుదిశలా వెదజల్లిన నా తల్లి భారతి
పరాయి పంచన బందీ అయి తల్లడిల్లి జనకరాజ పుత్రి లా
ఓరిమితో తన బిడ్డలత్యాగంతో దాస్య శృంఖలాలు తెంచుకొన్న నా స్వతంత్ర భారతి
వేవేల వేదాల ఘోషించిన పరమ పావన చరిత నా తల్లి భారతి
వెలకట్టలేని విలువల గని ,సాంప్రదాయ , సంస్కారాలలో ఎడతెగని కీర్తి
కుల మతాలకతీతమయి , శాంతి , అహింసలకు ఆలవాలమయినట్టి అమృతమూర్తి
అలరారే పసిడి మనసున్న కొంగు బంగారు తల్లి మము గన్న భారతి
ఒక బుద్ధుని ,ఒక అశోకుని మనకొసగిన తల్లి
ఒక బాపూ కి జన్మనిచ్చిన ధన్య చరిత నా తల్లి భారతి
హిమశిఖరపు మారుతాన్ని , పలనాటి పౌరుషాన్ని
పుణికిపుచ్చుకొన్న పునీత నా తల్లి భారతి
అల్లూరిని అల్లారుముద్దుగా పెంచి
అమరవీరులను కన్న నా మాతృమూర్తి ధీరో ధాత్రి
గంగా ,యమునా ,కృష్ణా ,పెన్నా
జీవన నదులతో అక్షయమై ,సుభిక్షమై సాక్షాత్తు అన్నపూర్ణ నా తల్లి
అందులకే మనమందరమూ భారతి బిడ్డలమైనందుకు
గర్విద్దాం . కన్నతల్లి ఋణం తీర్చగ
మన భరత ఖ్యాతిని ఇనుమడింపచేద్దాం
ఎల్లలు దాటి మన కన్నతల్లి ఔన్నత్యం చరిత్రలో పసిడి అక్షరాల లిఖిద్దాం
అవనిపై అదృష్టవశాత్తూ భారత బిడ్డలమైనందుకు బ్రతికి ఉన్నంతవరకు
తల్లి భారతికి జయహో అందాం,భారతమాతకి అభివందనాలు తెలుపుదాం
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
ఉగ్గుపాలతోనే ఇకమత్యం కలిపిచ్చిన సమైక్య భారతి
గోరుముద్దలతోనే మానవతను నేర్పించిన కారుణ్య మూర్తి
తన సంస్కృతీ సౌరభాలు నలుదిశలా వెదజల్లిన నా తల్లి భారతి
పరాయి పంచన బందీ అయి తల్లడిల్లి జనకరాజ పుత్రి లా
ఓరిమితో తన బిడ్డలత్యాగంతో దాస్య శృంఖలాలు తెంచుకొన్న నా స్వతంత్ర భారతి
వేవేల వేదాల ఘోషించిన పరమ పావన చరిత నా తల్లి భారతి
వెలకట్టలేని విలువల గని ,సాంప్రదాయ , సంస్కారాలలో ఎడతెగని కీర్తి
కుల మతాలకతీతమయి , శాంతి , అహింసలకు ఆలవాలమయినట్టి అమృతమూర్తి
అలరారే పసిడి మనసున్న కొంగు బంగారు తల్లి మము గన్న భారతి
ఒక బుద్ధుని ,ఒక అశోకుని మనకొసగిన తల్లి
ఒక బాపూ కి జన్మనిచ్చిన ధన్య చరిత నా తల్లి భారతి
హిమశిఖరపు మారుతాన్ని , పలనాటి పౌరుషాన్ని
పుణికిపుచ్చుకొన్న పునీత నా తల్లి భారతి
అల్లూరిని అల్లారుముద్దుగా పెంచి
అమరవీరులను కన్న నా మాతృమూర్తి ధీరో ధాత్రి
గంగా ,యమునా ,కృష్ణా ,పెన్నా
జీవన నదులతో అక్షయమై ,సుభిక్షమై సాక్షాత్తు అన్నపూర్ణ నా తల్లి
అందులకే మనమందరమూ భారతి బిడ్డలమైనందుకు
గర్విద్దాం . కన్నతల్లి ఋణం తీర్చగ
మన భరత ఖ్యాతిని ఇనుమడింపచేద్దాం
ఎల్లలు దాటి మన కన్నతల్లి ఔన్నత్యం చరిత్రలో పసిడి అక్షరాల లిఖిద్దాం
అవనిపై అదృష్టవశాత్తూ భారత బిడ్డలమైనందుకు బ్రతికి ఉన్నంతవరకు
తల్లి భారతికి జయహో అందాం,భారతమాతకి అభివందనాలు తెలుపుదాం
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
14, ఆగస్టు 2014, గురువారం
7, ఆగస్టు 2014, గురువారం
మరవకురా ....
నా అందెల రవళి అలికిడిలోనూ చెలికాడా నీ పలుకుల సవ్వడి వింటున్నా
సాయం సందియ వెలుతురులో ప్రతి కదలికలో నీ నగుమోమే కనుగొన్నా
నిద్దురలోనూ ,మెలకువలోనూ ,నా కనుపాపలలో కదలాడి కలవరపరచి
వదలక నన్ను నిమిషము మాత్రమూ నీ తలపులు తరచి తరచి వెంటాడి
చల్లని పిల్లగాలి తాకినా మేను వేసవినే తలపిస్తుంటే తాళలేక
నీ అల్లరి ఊహల ఒరవడిలో అల్లంత దూరంలో ఉండిపోయా నాకు నేను
మనమల్లుకున్న ఆశల పొదరింట్లో నీ కోసమే నే నిరీక్షిస్తున్నా నువ్వొస్తావని
గొల్లున గోల చేస్తున్నాయి మరుమల్లికలు నా సరసన నువ్వు లేవని . వారిస్తున్నా వినకుండా
మన ఇరువురి ప్రణయం ఎరిగిన సెలయేరు గుచ్చి గుచ్చి అడుగుతుంది నీవెక్కడని
వేవేల పూబాలలు ఏకమయి ,ఏడనున్నాడంటూ నీ జాడనే అడిగాయి
వలపుల చెలికాడా ! నీ చెలినే మరచావా
అలిగిన వేళలో నా సొగసు చూడనెంచి
జాబిలి వంపున ఒదిగి దోబూచులాడేవా
నీవు ఆదమరచగలవా ప్రభూ నీ పాద మంజీర నాదాల సేద తీరే నీ రాధనేను
సాలిపల్లిమంగామణి @శ్రీమణి
31, జులై 2014, గురువారం
నేనే రాధనోయి
నీ తేనె రాగాల మురళీ పదనిసలో నిలువెల్ల నా శ్వాస
నీ నీడ జాడల్లోవడివడిగా అడుగులు వేసా
అరఘడియా మనలేక నీ ఎడబాటులో అలసి సొలిసా
కలువల రేడుని వేడుకొంటి నీ చెలియ గోడు ఆలకించమని
ప్రతి రేయిలో పున్నమి ఎన్నియలు విరజిమ్మమని
చామంతి ,సంపెంగలతో మంతనాలు చేశా
నువ్వు నడిచే దారుల్లో విరబూయమని
కిన్నెరసానిపై కన్నెర్ర చేశా వన్నెలసోయగంతో
నన్ను మీరి నిను మురిపించొద్దని , మైమరపించొద్దని
అది హాయో మాయో తెలియని అయోమయంలో
అల్లాడిపోతున్నా నీకై. తల్లడిల్లి పోతున్నా నీ లాలనకై
నీ అనురాగంలో నను నేనే మరిచిపోవాలని
నీ ప్రేమఝరిలో ముగ్ధనై మురిసిపోవాలని
నీ సమ్మోహన రూపం నిరతం నా కనుపాపలలోనే కదలాడాలని
నా మది దోచిన మురళీ మోహనా .. నీ మనసును నాకే కానుకనీవా
నాఇరు కనుపాపల్లో చిరు దివ్వె వెలిగించి నీకోసం నిరీక్షిస్తున్నా ....
నీ రాక కోసం నిశిరాతిరిలోనూ నిదురమరచి నిలుచున్నా...
రారా కృష్ణా !
మన ప్రణయ రససామ్రాజ్యం లో నా హృదయ పీటమేసాను
కినుక వహించక నీ అలివేణి పై
సందేహము వలదు కృష్ణా నేనే నీ రాధను
12, జులై 2014, శనివారం
గురు చరణం
కరువాయెను కవితకు ఆదరణ అని ,
బరువెక్కిన హృదయంతో ,ఎరుపెక్కిన వదనంతో,
వెనుదిరిగిన తరుణంలో ,
గురువాయెను నండూరివారు ,దిశానిర్దేశం చేయ మార్గదర్శియై !
కన్న తల్లి పాలు , తండ్రి మురిపాలు పసిబిడ్డకు జీవం పోస్తే ,
గురువు ఆశీస్సులే చాలు
కలం పట్టిన కవి కావ్యం పండడానికి
అల్లిబిల్లి అక్షరాలూ కవితా సుమాలై విరబూయాలన్నా ,
హిమశిఖరపు అంచులంత నీవు ఎదిగిపోయినా ,
ఒదిగిపో ... నీ గురు పాదాల చెంత
నా కవితా రధానికి సారధి అయిన నండూరి వారికి ,
పండూరు చెరువు గట్టు వారి వినమ్రతా పూర్వక పాదాభివందనాలు తో
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)











