పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి శుభాకాంక్షలు



చామంతుల,  పూబంతుల తోరణాలు 
గృహలక్ష్ముల దీపాలతో, ధనలక్ష్ములకు పూజలు 
కొత్తదుస్తులలో మగువల అందచందాలు 
మామ గారి కానుకలతో మురిసిన కొత్త అల్లుళ్ళు 
తీయని మిథాయితో తాతాగారి బోసినవ్వులు 
మతాబులు చిచ్చుబుడ్లతో బుడతల కేరింతలు 
కాకరపూవత్తులతో అమావాస్యలో వెన్నెల వెలుగులు 
టపాసులు, తారాజువ్వలతో 
తారాస్థాయికి చేరిన ఆనందాల హరివిల్లు 
మిరుమిట్లుగొల్పుతూ  కోటి దివ్వెలతో వచ్చింది దీపావళి 
మన  ముంగిలిలో సువర్ణ కాంతులను నింపినది ఈ దీపావళి 
మన జీవితాలను  వేయి వెలుగుల సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో నింపాలని 
కోరుకుంటూ బ్లాగరులందరికీ దీపావళి శుభాకాంక్షలు  



23, అక్టోబర్ 2011, ఆదివారం

నిను చూసిన క్షణం


నా ఆశల ఊపిరి నీవే 
నా ఊహల రూపం నీవే 
నా జీవిత గమ్యం నీవే 
నా కలలకు సాక్షివి నీవే 
నా తలపుల రేడువి నీవే 
నా వలపుల చెలికాడివి నీవే 
నిన్ను చూసిన చాలు 
నా కళ్ళ లొగిళ్ళ పూదోట నిలిచేను 
అవధుల్లేని ఆనందం 
ఉవ్వెత్తున అలల లా లేచేను 
వద్దన్నా  వినకుండా మేను పులకరించేను 
అలవోకగ నా ఆశలు తెరచాపలా పయనించేను 
చెంత చేరి కోకిలమ్మ కబురులేవొ చెప్పేను 
వింత వింత ఊహలతో మది ఉక్కిరిబిక్కిరి అయ్యేను 
మాట రాక నా అధరాలు మూగబోయి చూసేను 
నిను చూసిన క్షణం  
నా ఊహలలోని   నీకోసం 

13, అక్టోబర్ 2011, గురువారం

నేనెంత? నేనెంత ? కాదు.. కాదు... నేనే అంతా !

నేనెంత?  నేనెంత ? 
ఈ అనంత మానవాళి 
జీవితాలు మార్చుటకై ! కష్టాలు కడతేర్చుటకై !
నేనెంత?  నేనెంత ?
అనుకోకుండా... 
నేనే అంతా.. నేనే అంతా.. అనుకో ! 
ఒక జీవితాన్నైనా మార్చి 
కష్టాలకు అండవై 
ఆ మండుటెండ గొడుగువై 
కటిక చీకటి చిరుదీపపు వెలుగువై 
ప్రకాశాన్ని అందించు 
చిగురుటాకు చిగురించినా, పండుటాకు నేల రాలినా  
ప్రకృతి ధర్మమే కదా !  మరి, 
ఎందుకు ఈ ఆందోళన, ఈ ఆక్రందన 
ప్రతి జీవి పుట్టిన నాటినుండి చిగురిస్తూ, 
ఫలితాలను అందిస్తూ చివరకు తనువు చాలిస్తూ 
మట్టిలో  కలిసిపోతుంది   కదా 
మరి ఎందుకు? ఇంత ఆరాటం?
ఇది ఆపలేని,  ఆగని,  జీవనపోరాటం అని 
తెలుసుకదా....
ఉన్నంత వరకు  ఏమి  చేయగలమో  
ఎంత చేయగలమో , ఎలా చేయగలమో  
ఎందుకు చేస్తున్నామో   అని అలోచిస్తూ 
ఒక్క జీవితానికైనా దారి చూపుదాం 
అవనిపై అదృష్టవశాత్తూ లభించిన 
మన , ఈ జన్మకు సార్ధకత చేకూర్చుదాం 


8, అక్టోబర్ 2011, శనివారం

మనిషి - మనుగడ

కలుషితమైన నేటి రొంపి వ్యవస్థలో  
షికార్లు చేస్తున్న మానవ వరాహాలు 
బ్రష్టు పట్టిన మానవ జాతిలో 
తుప్పు పట్టిన మనసులున్న,  రాక్షస రాయుళ్ళు తిరుగాడుతున్న 
నేటి ఆధునిక గంజాయి వనంలో 
నిర్మలమైన తులసి జీవించడం ఎంత కష్టమో 
కరడు గట్టిన పైశాచిక సమాజంలో 
కర్పూరమంటి మనసున్న మనిషి 
మనుగడ కూడా మరణప్రాయమే సుమా 

3, అక్టోబర్ 2011, సోమవారం

ఓ మహాత్మా, ఓ మహర్షీ.... .మన్నించు.. నీవిచ్చిన స్వాతంత్ర్య ఫలాలను అనుభవించలేకపోతున్నందుకు


గాంధీ జయంతి వేడుకలు  నిన్న దేశమంతా జాతి యవత్తూ ఎంతో ఘనంగా  గాంధేయవాదం స్పూర్తితో  జరుపుకొన్నాం.  నిజానికి నిన్న జరిగిన వేడుకలు నిజంగా గాంధీ గారికి ఘనమైన నివాళేనా......
ఎందరు అధికారులు, రాజకీయనాయకులు, గుత్తేదారులు, పెట్టుబడిదారులు, ఆఖరుకు ప్రజలు  బాపూజీ స్పూర్తిగా పనిచేస్తున్నారు (దేశ సేవ సంగతి వదిలెయ్యండి) నిజాయితీ, నిబద్దత, నిష్కళంకమైన క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంతమంది గడుపుతున్నారుఇంతవరకు ఎంతమంది అదికార్లుగాని, రాజకీయనాయకులు గాని పెట్టుబడిదారులు గాని వారి వారి ఆస్తులు వెల్లడించారు? ఎంతమంది గుత్తేదార్లు నిజాయితీతో కట్టడాలు నిర్మిస్తున్నారు? ఎంతమంధి అధికారులు నిజాయితీతో వారి వారి విధులు నిర్వర్తిస్తున్నారు? నిజంగా అలనాటి బ్రిటీషు ప్రభుత్వమే నిజాయితీతో నిబద్దతతో పనిచేసిందనటానికి  నాటి ప్రాజక్టులె నేటికి నిదర్శనాలు (కాదంటారా) మరి మనకు  స్వాతంత్ర్యం తేవడానికి  అంకిత భావంతో కృషి సల్పిన మహానుభావులకు ఇదేనా  మనమిచ్చే ఘనమైన నివాళి.. నిజానికి నేడు దర్యాప్తు చేస్తున్న సి.బి.ఐ. కు స్వయం ప్రతిపత్తి ఇచ్చినట్లైతే దెశంలో ఉన్న అవినీతి అధికారులను గాని, రాజకీయనాయకులను గాని అక్రమాలకు పాల్పడే వ్యక్తులను గాని ఉంచడానికి మన జైళ్ళు సరిపోతాయా? విచారించడానికి ఉన్న న్యాయస్థానాలు సరిపోతాయా 
మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ది చెందిననాడే దేశానికి స్వాతంత్ర్యం అన్నారు గాంధీజి. నేటికీ మన దేశంలొ  మహిళా బిల్లు సాధికారతకు నోచుకోలేదే? మరి ఎక్కడ స్వాతంత్ర్యం?
గనులను దోచుకోవడంలోనా, 2జి  కుంభకోణాల్లో మునిగిపోవడంలోనా, నల్లధనాన్ని దాచుకోవడంలోనా, గాంధేయవాదంతో అవినీతి  రహిత సమాజ స్థాపనకు  కృషి చేస్తున్న వారిని అణగద్రొక్కటంలోనా?  
ఎక్కడ స్వాతంత్ర్యం?  నిజానికి విదేశీయులకు ఉన్న స్ఫూర్తి కూడా మనలో లేదే మరి, ఎవరిని మోసం చేయడానికి ఈ నివాళుల కార్యక్రమాలు?
మీకు నిజంగా నిజాయితీ అనేదే ఉంటే నిన్న మీరు గాంధీ గారి చిత్రపటానికోవిగ్రహానికో నమస్కరించినపుడు గాని, దండ వేసే సమయంలో  గాని (అవినీతిపరులైతే) మీరు ఆత్మన్యూనతా  భావానికి గురైతే (ఎందుకంటె మనలొ ఎక్కడొ, ఏ మూలో, కొంచెం మానవత్వం ఉంటుంది కనుక) ఇకనైనా మీకు చేతనైన, చేయగలిగిన, దేశ సేవ నిజాయితీతోనిష్కళంకమైన మనసుతో, చిత్తసుద్ధితో చేసిననాడు అవినీతిరహిత సమాజాన్ని నెలకొల్పడంలో కృషి  సల్పిననాడు నాటి స్వాతంత్ర్య సమరయోధులకు, బాపూజికి అదే మనమిచ్చే ఘనమైన నివాళి
ఓ మహాత్మాఓ మహర్షీ.... .మన్నించు.. నీవిచ్చిన  స్వాతంత్ర్య ఫలాలను అనుభవించలేకపోతున్నందుకు

1, అక్టోబర్ 2011, శనివారం

జీవనశైలి (నాటి తరం - నేటితరం) పెద్దల (వృద్దుల) దినొత్సవం సందర్భంగా

నాటి తరం జీవనశైలి ఎంతో అద్భుతమైనది. ఉమ్మడి కుటుంబం,కలసిమెలసి సఖ్యతతో కూడిన జీవనవిధానం. ఇంట్లో ఎమిజరిగినా అందరూ కలసి ఆనందింఛి అనుభవించే జీవనశైలి. నాడు లేని ఈ పెద్దల దినోత్సవాలు. నేడు ఎందుకు చేసుకోవలసి వస్తుందంటారు? (కారణం) నేటితరంలో తల్లి దండ్రులకు దూరంగా జీవనపోరాటం సాగిస్తున్నాం కనుక,  (ఉద్యొగాలు, పిల్లల్ల చదువులు) మన దైనందిన జీవితంలో మనకోసం, మన అభివృద్దికోసం మన తల్లిదండ్రులు పడిన శ్రమ, పంచియిచ్చిన అనురాగం ఆప్యాయత, నిరంతరం మన యొగక్షెమాలు కాంక్షించె ఆనందించే వారు . కాని నేడు మనలో ఎంతమంది  మన తల్లిదండ్రులు   యొగ క్షెమాలు తెలుసుకుంటున్నాం.   మనల్ని మనమే  ప్రశ్నించుకోవాల్సిన అగత్యం (కాదంటారా) 
మనతో పాటె మన తల్లిదండ్రులు వాళ్ళ తలిదండ్రులు కలసి (ఉంటే) ఎంత బాగుంటుంది. వినడానికె ఎంత ఆహ్లాదంగా ఉందంటే నిజంగా అనుభవించే వారు ఇంకెంత అదృష్టవంతులో కదావారికి వారి కుటుంబానికి జోహారులు .

ఇక్కడి వరకూ సరే, కొంతమంధి ఈ భాగ్యానికి నోచుకోని నిర్భాగ్యులు  చాలా మంది ఉన్నారు. ఎందుకంటె మనలొ తగ్గిపోతున్న మానవత్వం, నైతిక విలువలు, లోపిస్తున్న సంబంధ బాంధవ్యాలు, (నేటి నగర జీవన విధానం కూడా కొంత కారణం కావచ్చు) పిల్లల చదువుల కొరకు  (kinder garten)  పెద్దలను వేలివేయ్యడానికి వృద్దశ్రమాలు. వ్యత్యాసం ఎమిటంటె ,సాయంకాలం పిల్లలను ఇంటికి తీసుకు వచ్చెస్తున్నారు. తల్లి దండ్రులను మాత్రం నెలకో, సంవత్సరానికో, ఒకసారి చూడటానికి వెళ్ళాలని ప్రయత్నించేవారెందరో ఉన్నారు . అందుకే నేటి నగరాలలో ఇన్ని వృద్ద ఆశ్రమాలు. ఇవి అవసరం అంటారా?  
మనల్ని ఎలా అయితే మన తలిదండ్రులు చూసుకోన్నారో అదేవిధంగా వారిని మనం చూసుకున్ననాడు మన పిల్లలు దగ్గర మనకు కూడా అదే గౌరవం దక్కుతుంది (అలా అని మనకు అనురాగం ఆప్యాయత లేదని కాదు
ఏది ఏమైనా పెద్దలందరికీ, పిల్లలతో కలసి ఉన్నవారికి, పిల్లలకు దూరంగా ఉంటున్నవారికి అందరికి హృదయపూర్వక  శుభాకాంక్షలు 
ఈ క్రింది వీడియో గమనించగలరు