పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, నవంబర్ 2022, బుధవారం

*గురజాడ సాంస్కృతిక సమాఖ్య,విజయనగరం*మహాకవి గురజాడ వర్ధంతిసందర్భంగా గురజాడ సాహితీ చైతన్యోత్సవంలో భాగంగా నిర్వహించిన కవితల పోటీలోనేను రాసిన "అక్షరతపస్సు"కవితకు బహుమతి దక్కిన సందర్భంగా సత్కారంఅందుకున్న శుభతరుణంమీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

*గురజాడ సాంస్కృతిక సమాఖ్య,విజయనగరం*
మహాకవి గురజాడ వర్ధంతి
సందర్భంగా గురజాడ సాహితీ చైతన్యోత్సవంలో భాగంగా నిర్వహించిన కవితల పోటీలో
నేను రాసిన "అక్షరతపస్సు"
కవితకు బహుమతి దక్కిన సందర్భంగా సత్కారం
అందుకున్న శుభతరుణం
మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

28, నవంబర్ 2022, సోమవారం

నిన్న ఒంగోలులో NTR కళాక్షేత్రం నందు అంగరంగ వైభవంగా జరిగిన *కళామిత్రమండలి(తెలుగు లోగిలి)* వారి వార్షికోత్సవ వేడుకలలో *రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం* పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు, అధ్యక్షులు శ్రీ నూనె అంకమ్మ రావుగారు,శ్రీమతి తేళ్ళ అరుణ గారి చేతులమీదుగా అందుకున్న శుభతరుణంమీఅందరి అమూల్యమైన ఆశీస్సులను మనసారా కోరుకుంటూ......Thanks to kalamithra mandali...*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*🙏🌹🌹🌹🌹🌹🌹🙏

నిన్న ఒంగోలులో NTR కళాక్షేత్రం నందు అంగరంగ వైభవంగా జరిగిన *కళామిత్రమండలి(తెలుగు లోగిలి)* వారి వార్షికోత్సవ వేడుకలలో  *రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం* పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు, అధ్యక్షులు శ్రీ నూనె అంకమ్మ రావుగారు,శ్రీమతి తేళ్ళ అరుణ గారి చేతులమీదుగా అందుకున్న శుభతరుణం
మీఅందరి అమూల్యమైన ఆశీస్సులను మనసారా కోరుకుంటూ......Thanks to kalamithra mandali...
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
🙏🌹🌹🌹🌹🌹🌹🙏

25, నవంబర్ 2022, శుక్రవారం

జాబిలితో

*జాబిలితో*

ఒక నిశిరాతిరి
నాలో ముసిరేసిన 
తియతీయని భావాలను 
దోసిలినింపి‌....వాటికి
కాసిన్ని అక్షరాలనద్ది‌,
జాబిలికి......
జాబురాసుకున్నా..
ఒకనాటి పున్నమిరేయి
వెన్నెల వాకిట్లో...
కవన పూలవాన
కురవాలని,
అది కాంచిన నామది
మకరందం చవిచూడాలని,
అడిగాననో...లేదో
నిదురించిన
నాకనురెప్పలపై
సుతిమెత్తని స్వప్నంలా
అరుదెంచాయి
అత్యద్భుత కావ్యాలేవో...
అందమైన నా ఊహకు
అచ్చమైన ప్రతిరూపంగా..
జాబిలి నాకిచ్చిన 
జవాబు కాబోలు‌....
   *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

21, నవంబర్ 2022, సోమవారం

నీమీదొట్టు

*నీమీదొట్టు*

ఝుమ్మని ఎద పలికినట్టు
లెమ్మని కల కదిలించినట్టు
రారమ్మని పిలిచినట్టు
కమ్మని కబురొచ్చినట్టు
నే ఉన్నా లేనట్టు
లేకున్నా ఉన్నట్టు
ఊపిరాగుతున్నట్టు
ఊసులేవొవిన్నట్టు
నీ మీదొట్టు.నే వున్నా లేనట్టు
నిను చూడక నే లేనన్నట్టు
వెన్నెల దిగబోసినట్టు
వన్నెలొలకబోసినట్టు 
కన్నులెదుట పూదోటే 
కావలి ఉన్న ట్టు,ఏవేవో కానుకలు కావాలన్నట్టు....,
అధరాలపై నీ పేరే 
మధుర మాయినట్టు
మది లోపల
మధురోహల మదనమాయినట్టు
తడవ,తడవకూ తడబడి,అణువుఅణువులో నీవని పొరబడి‌,
నిద్దుర మొదలే కొరవడి,తత్తరపడి,బిత్తరపడి
 చిత్తరువయి నిలుచున్నా.....
నీ మీదొట్టు...నే వున్నా లేనట్టు,
నిను చూడక నే లేనన్నట్టు.....!

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*  http://pandoorucheruvugattu.blogspot.com

*అంతానువ్వే చేసావు*



బ్రతుకు గోడలపై నైరాశ్యపుచిత్రాలనలా
వ్రేళ్ళాడదీస్తావెందుకు
నిమిషాలను నిప్పుకణికల్లా మండిస్తున్నావెందుకు
గుండెగొంతుక ఘోషించినప్పుడల్లా
నిశ్శబ్దాన్నే ఆశ్రయించుమని శాసించావు 
మనస్సాక్షి నిరసిస్తుంటే 
మౌనంతో చేతులు కలిపావు
గుప్పెడు ఆశల ఊపిరిరెక్కలు
ఉస్సూరంటూ నేలరాలుతున్న
ప్రతిసారీ నేరం నాది కాదనే వాదించావు
అంతా నువ్వే చేసి
అంతులేని నిర్వేదాన్ని ఆహ్వానిస్తే ఎలా
అంతర్యుద్ధంలో గెలిచిచూడు
అదృష్టం దురదృష్టం లాంటి అదృశ్యభావనలకు తలవంచాల్సిన
అగత్యమైతే లేదు
నిన్న రాలిన ఆశలు,ఆశయాలు
రేపటి చైతన్యపు బీజాలై
ఈ విశ్వక్షేత్రంలో ఏదో మూల
అంకురిస్తూనే వుంటాయి,
ఎగిసిన నక్షత్రాలన్నీ ఏకమై
సరికొత్త పాలపుంతను పలపరిచే వుంటాయి
అన్వేషించాలే గానీ ఆశలకాంతిపుంజాలు
అంతరంగాన్ని వెలుతురుతో నింపేయవూ
ఆత్మనిబ్బరం,ఆశాభావం అలంకరించుకు 
విజయం మెట్లెక్కిన మానవునికి
విధిసైతం మోకరిల్లుతుంది
యథార్ధం కైవసం చేసుకొన్న విజయం
శాశ్వతమై విరాజిల్లుతుంది
అప్పుడు మౌనం మాట్లాడుతుంది
మనిషిని మహనీయత అనే
మరో అధ్యాయాన్ని పరిచయంచేస్తూ..
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
http://pandoorucheruvugattu.blogspot.com

19, నవంబర్ 2022, శనివారం

*అలసిపోతున్నాడు మనిషి*


ఎన్ని కలలను మోసినా 
అలసిపోలేదు యామిని
ఎన్ని అలలను ప్రసవించినా 
సడలిపోలేదు కడలి
వెన్నెలంతా ధారపోసి 
వెలిసిపోలేదు పున్నమి
చీకటి కొమ్మకు పూసినఉదయం 
ప్రశ్నించదు కాలాన్ని
అదే ఆకాశం,అదే ధరణీతలం
అవే పంచభూతాలు
యధావిధిగా దృశ్యాదృశ్య ప్రపంచం
అవిశ్రాంత విశ్వ గమనం
యుగాలుగా పరిభ్రమిస్తున్న 
భూగోళం
ప్రకృతి ప్రతీధర్మంలోనూ
శ్రమైక జీవన సౌందర్యం
నిగూఢమైన సత్యం 
కొన్ని పువ్వులను దోసిట్లోకి తీసుకొని 
చూడు నవ్వుతునే పలకరిస్తాయి
జీవించేది స్వల్పమని వగచి
స్వభావాన్ని మార్చుకోవు
వికసించే నైజం విషాదానికి తావివ్వదన్న
సత్యం విప్పారిన రేకుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది
ఈమౌనసాక్ష్యాలు మార్గనిర్దేశకాలు కాదా
మానవ జీవనగమనానికి,
ఆలోచనవరమొందిన
అత్యున్నత ప్రాణి 
అవలోకనం విస్మరించాడు
ప్రతిఫలాన్వేషణతో బ్రతుకు
సాగిస్తున్నాడు,స్వార్ధచింతనయే జీవనమనుకొని 
అర్ధరహిత ప్రయాసతోనే 
అడుగులు వేస్తూ
అలసిపోతున్నాడు మనిషి
అరచేతిలో లోకాన్ని మోస్తున్నాడు కదూ.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

10, నవంబర్ 2022, గురువారం

7, నవంబర్ 2022, సోమవారం

ఈశ్వరా...

*ఈశ్వరా...*

నిన్ను నమ్మిన మదికి
మాలిన్యమంటునా...
నిను కాంచిన కనులు
 అంధకారమెరుగునా...
నిను మ్రొక్కిన కరములకు
కొరవడునా అదృష్టం
నీనామస్మరణమే
అమృతాస్వాదనం శివా...
ఈశ్వరా యన్నట్టి ఏ ఇంటనైనా
ఇడుములకు ఇసుమంత
 తావుండునా ...
మారేడు పత్రాన్ని మనసార అర్పించ
మారాతనే మార్చేటి మా రేడు వయ్యా
భోళా శంకరుడా బోలెడంత దయ నీది
నీ చల్లని చూపులే మా పాలిట
వేయి కాంతిదీపాలు
నీ కనుసైగ చేతనే కరుగును మాపాపాలు
దోసెడు నీటిని నీపై
మనసార జారవిడిచిన చాలు
అసలుండునా...ఆపై
కన్నీటి ఆనవాలు
దొడ్డ మనసయ్యా నీది జంగమయ్యా...
సర్వమూ నీకెరుకె సాంబమూర్తీ 
ఆపద్బాంధవుడవయ్యా హరా
ఆదిదేవుడా...
మమ్మాదుకోవయ్యా ముక్కంటి 
నీ దివ్య పాదాల మ్రొక్కితి
నీవే మా దిక్కంటూ మోకరిల్లి.

    *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*