పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

4, అక్టోబర్ 2022, మంగళవారం

విరుల విలాసం

*విరులవిలాసం*

పూవులు పలకరించాయి
కలియ తిరుగుతావే గానీ
త్రుంచి సిగలో ముడుచుకోవేమనీ,
ఈ సుమలలామలదెంతటి
వెర్రి బాగులతనం,
 అమ్మ కొమ్మపై ఆడుకొనే అవకాశం ఇచ్చాననుకోవేం,
 అంత చిన్న జీవితంలోనూ 
చిరునవ్వులు చిందించడం
 ఎక్కడ అభ్యసించాయో తాము వాడిపోతామని తెలిసీ
 తనివితీరా విరబూయడం 
విరులకే సాధ్యమేమోకదా
పరులకోసం తపిస్తూ
పరవశాన్నందించే
ప్రకృతి స్వభావం  అద్వితీయం కదా..
సదా...ఏదో ఒక మనోజ్ఞ దృశ్యం తారసపడి హృదయపుటలపై రమణీయ చిత్తరువులద్దుతుంటే..ఆహా ఎంతహాయి, తాదాత్మ్యమై తరించిపోయెను కదా ఈ కనుదోయి.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి