ఆ మదనుని మహిమాస్త్రమో!
నీ ప్రణయ రసామృత సేవన వైచిత్రమో !
ముడి వేసిన మనసుల మానస సరాగమో
నీ జతలో నాకు గురుతు రాదు సమయం
నీ సరసన నా హృదయం ,నిత్య విహంగ వీక్షణము
నిను చూడక క్షణమయినా... తరగదు ఆ తరుణం
ఇదేమి సిత్రమో ... నాకు నేనే అపరిచితగా...
నా చుట్టూరా లోకమే సరి కొత్తగా ...
ఏ వైపు చూస్తున్నానీ మైమరపు తెమ్మెరలే
కనుచూపు మేరలో కమ్మని మన ప్రణయ సొరభమే
ఏమరపాటుగా చూస్తే యేటి కొలనుల్లో నా రూపులో నీవు
కోటి వెన్నెల్ల జడి నాపై వర్షించి పోతావు,
కొనగోటితో నా మది మీటి
మేటి ముత్యాల నీ నగవు చిలుకరిస్తావు,
మురిపిస్తావు,నన్ను మరిపిస్తావు,
నవ్విస్తావు,నన్ను కవ్విస్తావు,
చెంత చేరి ఏవో వింతలు చేసి
తీరా చూస్తే !నా కళ్ళ గంతలు మూసి
కనుమరుగైపోతావు,కలలా కళ్ళల్లో కరిగిపోతావు.
ఇదేమి సిత్రం ప్రభూ ... కనికరమయినా లేదా
కదలనైనా లేను నిను సూడక,నేను
నిశ్చలమయిపోతా ... లేకుంటే నీ జత
దోబూచులేల ప్రభూ ... నీ ప్రియ సతితో
సప్త పదులు నడిచిన నీకై సదా నే కంకితం
నువ్వు నను వీడి మరుగైన మరు నిమిషం
మరణానికి మరుమల్లెల పానుపేసి పిలుస్తా..
మరు జన్మనైనా మిమ్ము మరలా కలుస్తా ,,,
( నిను వీడి మనలేని నీ సతి శ్రీమణికై
చిరంజీవివే నువ్వు నా సౌభాగ్య కానుకై )
సాలిపల్లిమంగామణి@శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి