ఆకలి దీరె దారదిగో... అది ఆమడ దూరం ఉండాదింకా
ఉగ్గబట్టుకో ఉబుకొత్తున్న ఉడుకు కన్నీల్లని,
చేతి నిండా పని కానోత్తాది,కడుపెచ్చ బొచ్చెడు గంజేత్తాది
కన్నపల్లె నొగ్గేసి,బయలొత్తు ఉంటే ..గుండెకాయ భగ్గుమంతన్నా
అగ్గి రాజేత్తన్న ఆకలి కడుపుకి,యేరే దారి కనబడక
మెతుకు కరువై ,బతుకు బరువై ,బతుకు తెరువుకై ఎదురు నడక
సల సల సూరీడు కాల్చేత్తన్నా... సల్లగే ఉందది మన ఆకలి మంటలకన్నా...
సందిట బిడ్డలనదిమిపట్టుకొని,మూటాముల్లె సంకనెత్తుకుని,
గంపెడు ఆశతో పట్టపు తోవన పరుగులు తీత్తన్నాం
పట్టణానికెళ్తే పట్టెడన్నమయినా పుడతాదని ,
కరువుధాటికి కన్నపల్లెనొదిలి,ఉన్నపలంగా పట్టపు దారి పట్టాం,
పలకరిత్తదంతవా... మన్నిసూసి పకపకా నవ్వుకుంతదంతవా
కనికరిత్తదంతవా.,పనిచ్చి . .... కాదు పొమ్మంత దంతవా....
ఓ లమ్మా .. పట్నమెల్లేక పంట్లామెత్తానే,,, ఇసుకూలుకెలతానే,ఇంగిలీసు నేరతానే
అట్టెగాని ఆట్టే కలలొద్దులేరా .. పొట్టకూటికి లోటు రాకుంతే అద్గదే పదేలు,
రంగురంగుల మేడలవిగోరా బిడ్డా,,, ఆట్టే సూసావంటే ఆకాశమంటేటి ఆ మేడలొంక,
మెడ నొచ్చిపోతాది,ఎర్రాటి సూరీని ఎండ కాల్సేత్తాది.
గిర్రుగిర్రున బుర్ర కిర్రెక్కుతాది. బేగా పదరా బిడ్డా... పొద్దు పోతుండాది
కోటి ఆశల తోటి,పట్టపు బాట పట్టి,

సెంగు,సెంగున ఆడే చంటి బిడ్డలతో,సెంగుసివర నూరు రూకల్ల ముడితో
అడుగు వేసింది పల్లె ఇల్లాలు,పట్టణాలొంక.
బతుకెట్టాగుంటదో సూడాలి ఇంక,
(రైతు రైతుకూలీగా, పొట్టకూటికై పట్టణాల బాట పడ్తున్న నేటి తరుణంలో పల్లె వెలవెల బోతే పచ్చదనమెట్టాగో,రానున్న కాలంలో రైతుంటాడో ,లేడో,)
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
pandoorucheruvugattu.blogspot.in
(రైతు రైతుకూలీగా, పొట్టకూటికై పట్టణాల బాట పడ్తున్న నేటి తరుణంలో పల్లె వెలవెల బోతే పచ్చదనమెట్టాగో,రానున్న కాలంలో రైతుంటాడో ,లేడో,)
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
pandoorucheruvugattu.blogspot.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి