కలికిని ,చిలుకల కొలికిని ,
చెలియను ని,చంద్రుని నెచ్చెలిని
కలకంఠిని,కలువకంటిని నేను
కిన్నెరసానిని,వన్నెల అలివేణిని
భామినిని ,సుందర సౌదామినిని
వలపుల విరిబోణిని,మెలికల మాలినిని
ఎలతీగబోణిని,ఎలకోయిల రాగాన్ని
అంచను,రాయంచనునేను ,
మెలుతను,విద్యుల్లతను
సురదనను ,సుహాసినిని
సీమంతిని,సొగసుల చామంతిని నేను
నివ్వెరబోవా ...జవ్వని సౌదర్యానికి
నిలువలేక సరిసాటిగా .... సృష్టి అందాలు.
చిన్నబోవా మరి .. ఆ నింగి తారకలు
మిన్నకుండిపోవా... వెన్నెల రాతురులు
చెలరేగిపోవా మరి సెలయేటి గలగలలు
ఇల చేరిపోవా .. దివి చందనాలు
వరదలా కదలవా వింద్యామరలు
జలజలా రాలవా .. జలతారు మేఘాలు
మసకబారిపోవా .... మణులు మాణిక్యాలు
మూగబోవా మరి ముద్దబంతిపూలు
పడచు ప్రాయాన పడతి పదనిసలివి
అతిశయించిన సొగసు మిసమిసలివి
ఊసులాడే సన్న జాజి బాసలివి
అసలు సిసలైన కన్నె మోజు రాశులివి.
సాలిపల్లి మంగామణి@ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి