చేసుకొన్న బాసల తోడు నేనే నీ సరిజోడు
నా తుది శ్వాస వరకు నా ఉనికి నీ కొరకే
నా మనసు నిరంతరం నీ హృదయంలోనే మసలుతోంది మోన సుందరిలా
దాని మోనరాగమాలకించి నీ ప్రణయ రస సామ్రాజ్ఞిగా పదిలపరచుకోవా
బరువై పోయిన నా కనురెప్పల చాటుకు అరుదెంచావు కమ్మని కలవై
వేవేల వర్ణాల నా స్వప్న లోకాన విహరించి నీ మేను అలసియున్నదేమో
సేద తీర్చెద రావా నీ నెచ్చెలి వెచ్చని ఒడిలో
నా కనుసన్నల నీ రూపం సమ్మోహనమవుతుంటే
నా అధరపుటంచుల నీ తలపులు వలపుల వానై మధువొలకబోసే
అదుపు తప్పి నీ ఆశలు ఆకాశపుటంచులపై నా చిత్రమే గీస్తుంటే
చిత్తరువై నిలుచున్నాయ్ నీలి మేఘ మాలికలు
సృష్టిలోని బంధాలన్నీ మాటరాక నిలుచున్నాయ్ . మన ప్రణయ బంధాన్ని చూసి
అద్భుతానికే అచ్చేరువేసింది అత్యద్భుతమైన మన ప్రణయ పరిమళాన్ని పసిగట్టి
అమృతానికీ ఆకలయింది మన ప్రేమ సుధను ఒక్క మారైనా ఆశ్వాదించాలని
ఆలోచించకుండా సంతకం పెట్టింది ప్రేమదేవత
మన జంట హృదయాల పైన పసిడి అక్షరాలతో
ప్రేమ విజేతలయ్యారని (శ్రీను +మణి=శ్రీమణి )
ప్రేమాభివందనాలతో (ప్రేమికులందరికీ )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి