పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

11, జూన్ 2018, సోమవారం

స్వంతత్ర భారతం


ఓ..స్వంతత్ర భారతమా ... 
అవినీతికి,అన్యాయానికి
  నీవుఆలవాలమా ?
ఓ..ప్రజాస్వామ్య  దేశమా 
ప్రజల పాలిట శాపమా ... 
విన్నావా ..
సగటు జీవిఆర్తనాదాలు?
కన్నావా .. కన్నీటి కధనాలు ?
మరచినావా .. మానవత్వం 
నేర్చినావా .. పైశాచికత్వం ?
కలచివేసే బ్రతుకులే
కన్నులకగుపిస్తున్నా 
కాలానికి వదిలేసి కళ్ళు మూసుకొంటున్నావా ..
తెల్ల దొరల కాలంలో
బానిస బ్రతుకే...బ్రతికాం 
నేటి ప్రజాస్వామ్య  వ్యవస్థలో
బ్రతుకే బరువాయె కదా .. 
అణువణువున స్వార్ధంతో
అల్లాడుతున్న వ్యవస్థ 
మంచం లేచిన మొదలు లంచమే లాంచనమాయె
నిత్యావసరాల ధరలు నిత్యంవేధిస్తుంటే...
నల్ల ఖజానాలు మాత్రం
నింగికెగసిపోయెనా ?
వెల పెరిగిన వేగంతో
నెల జీతం పెరగదేం?
నీరసించెనా..ధర్మపాదం
పెచ్చుమీరెనా...అధర్మవాదం
రాదంటారా....
మనంకలలుగన్న సమాజం
లేదంటారా ...
సుభిక్షమమైనజనజీవనం
అర్ధరహితమంటూ..
వృధాయత్నమంటూ...
ఈవ్యవస్ధ ఇంతేనని
తమమట్టుకు
తలపట్టుకు...కూచోక
మననుండే..మొదలెడితే
మార్పు అనే మరమ్మత్తు
మనవంతుగ కృషిచేస్తే
మాన్యమవదా..వ్యవస్ధ
యావత్తూ...
ప్రతి ఒక్కరు స్పందిస్తే..
ప్రపంచమే..మారదా?
పట్టువీడక ప్రయత్నిస్తే...
పసిడిపండదా!బీడుభూమిలో?
                       
                 శ్రీమణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి