పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

4, జూన్ 2018, సోమవారం

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా

ఏగానగాంధర్వుని
కన్నానని
తెలుగునేల గర్వంతో
ఉప్పొంగిపోతుందో...
ఏఘనసంగీతమాలకించి
గగనం సైతం పులకించిందో...
ఏస్వరమైతే
అశేషభరతావనికీ...
అద్భుత వరమయ్యిందో
ఏ"బాలు"ని గానం విని
ఆబాలగోపాలమూ...
అమృతాన్ని..చవిచూసిందో
ఏస్వరమాలకించగానే ప్రకృతిలో పరమాణువుసైతం
పరవశమైపాడుతుందో..
ఏగాత్రంవింటూనే..
ప్రతిహృదయానికి
చైత్రం ఎదురవుతుందో...
ఏరాగం వింటూనే..
ఎద వెన్నెల్లో
స్నానమాడుతుందో..
ఏగొంతుచేరగనే
సరిగమలన్నీ
మధురిమలైసుధలు
గుమ్మరిస్తాయో...
ఏనోట పలికితే
పాటలు..తేనెల ఊటలై
జాలువారుతాయో..
ఏగళమున చేరితే
రాగాలన్నీ...
మానసరాగాలై
వెల్లివిరుస్తాయో...
అతడే...
మనసుస్వరాల
సుమమాలి
ఉరికే సంగీత ఝరి,
స్వర రాజశిఖరి
సరిగమలతో
స్వర్ణరాగాలు పలికించి
కొసరికొసరి తన
గానామృతాన్ని ఒలికించి
మనలనలరించ
భువికేతెంచిన
ఘన గానగాంధర్వులు
బహుబాషాగాయకులు
బహుముఖ ప్రజ్ఞాశాలి
మృధుస్వభావి..
సహృదయులు..
సప్తస్వర మాంత్రికులు
శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు
సప్తపదులు దాటి
ముచ్చటగా మూడవవసంతంలోకి(73)
అడుగిడుతున్న శుభసందర్భంలో...
చిరు..అక్షరమాలికతో
జన్మదినశుభాకాంక్షలర్పిస్తూ..
                 
                        శ్రీమణి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి