భూమిపుత్రా...
నీకు బువ్వ కరువాయెనా?
అన్నదాతా...
నీదు గుండె బరువాయెనా?
క్షేత్రమిత్రా...నీ బ్రతుకు
కన్నీటి చెరువాయెనా
రోజంతా ఊడిగమై
గానుగెద్దు జీవితమై
మట్టిని నమ్మిన నీకు
వెట్టిచాకిరీ మిగిలి
నీ స్వేదం ధారపోసి
నీ సత్తువ కూడదీసి
సేధ్యంచేసిన నీకు
వేదనే...వరమాయెనా?
చితికినబ్రతుకుకు
అతుకులు వేస్తూ
చితికిచితికి ఛితికి
చేరువై
బ్రతుకుబండి లాగలేక
నీడొక్కలెండి పోయెనా?
పుట్టినూరులో సైతం
పట్టెడన్నం పుట్టక
పుట్టెడు అప్పులపాలై
పొట్ట చేతపట్టుకోని
తినడానికి తిండిలేక
నిలుచుందుకు నీడలేక
ఏడ్వలేక,నవ్వలేక
ఓదార్చే వారులేక
అంతిమపోరాటంలో
ఆత్మహత్యనే ఎంచుకు
నేల ఋణం త్రుంచుకు పోతున్నావా....😥
(ఆకలిచావులు,
చీకటితావుల్లో
అప్పులపాలై
అతలాకుతలమై
ఆత్మహత్యలు
చేసుకొంటున్న
రైతన్నల బ్రతుకులను
చూసి చలించి రాసుకొన్న కవనం)........శ్రీమణి
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
29, ఏప్రిల్ 2018, ఆదివారం
భూమిపుత్రా...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి