నిను చేరే దారిని సరళం చేస్తే
గరళాన్నైనా చిరు నవ్వుతో సేవించేస్తా !
నిన్ను చూడగ కనులకు కానుకనిస్తే
కటిక చీకటినైనా ఆహ్వానిస్తా
నా ప్రణయం తెలుపగ
నా అధరాలకు భాగ్యమునిస్తే
ఆపై మూగబోయినా
నే మురిసిపోతా...
నీ మనసును ఒకపరి గెలుచుటకై ,
నిరంతరమూ నే ఓడిపోతా !
నా కన్నుల పొదరింటికి నువ్వొస్తానంటే
నూరేళ్ళైనా కనురేప్పేయక
నిరీక్షిస్తూనే ఉంటా !
నమ్మరాదా కృష్ణా..
ఈ రాధ ఆరాధనని..
నీకై తెల్లవారుతోంది ఉదయం
నీ కోసమే ఆ సాయం సమయం
కలను కూడా ఆదేశిస్తా !
నిన్నే తనతో తీసుకురమ్మని .
లేకుంటే కరిగిపొమ్మని .
ఇల నా జీవితాన్నే శాశిస్తా !
నీ జత లేదంటే శూన్యం కమ్మని,
నువ్వోస్తావనే
నే జీవిస్తున్నా !
నీకోసమే నిరీక్షిస్తున్నా..
నిద్దురలోనూ మేలుకొని....
సాలిపల్లి మంగామణి (శ్రీమణి)
<a href="https://www.indiblogger.in/iba/2017/winners/regional-languages" target="_blank"><img src="https://indiblogger.s3.amazonaws.com/iba/winners-2017/winner-poster-10225.png" alt="Winner of The Indian Blogger Awards 2017 - Regional Languages"></a>
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి