ఏమని పొగడగలము ఎల్లలు దాటిన శ్రీ నేమాని యశో తేజో విరాజ రాజసాన్ని,
ఎంతని కొనియాడగలము. ఆ అవిరళ కృషీవలుని,అలుపెరుగని ఋషీశ్వరుని,
అంబరాన్ని తాకిన ఆ అభిజ్ఞుఁని ప్రజ్ఞాప్రాభవాన్ని వర్ణించగ ప్రబంధమైనా సరిపడునా...
ఆ అసమాన ఆచార్య సార్వభౌమునీ ,ఆ అభీకునీ
సన్నుతించగ పదములున్నవా పృథ్వి పైన.
ఆ రసాయన శాస్త్రవిదుఁనీ ,చిత్రకళా కోవిదునీ
ప్రస్తుతించగ పదివేల మాటలు చాలునా.. ..
ఆ మాన్యుని కుంచె నుండి ప్రభవించిన నన్నయ, తిక్కన,ఎఱ్ఱన,శ్రీనాధ పోతనామాత్యుల చిత్రాల అమృతత్వమేమని ప్రసంశించగలము.
గీతోపదేశమంటి ఎనలేని అపూర్వ చిత్తరువుల మనోహరంగా మలచి , మన సంస్కృతీ సౌరభాన్ని దిగ్దిగంతాలా చాటిన ఆకళాభిజ్ఞుని కౌసల్యమెంతని అభివర్ణించగలము.
మన నయనమ్ములు చేసుకొన్న సుకృతమ్ము గాక వేరు గాదు. శిష్యకోటి కల్పతరువును, మేరువంటి గురువర్యుని చేరువగ అభివీక్షించ,
నా కలానికొచ్చిన వైభోగం.ఆహిరణ్య కంకణ సుశోభితుని వర్ణించగ నా కవనమందు.
సాక్షాత్తు శ్రీ కృష్ణుడు ,రుక్మిణీ దంపతుల అభిదేయమే మన కృష్ణమూర్తి రుక్మిణమ్మ దంపతుల నామధేయమగుట దైవ సంకల్పమే.. గదా
అలనాడుద్వాపరయుగంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి రుక్మిణీ దేవి సపర్యలు చేసి తరిస్తే , నేడు ఈ కృష్ణమూర్తి
"నాతిచరామి" అన్న కళ్యాణ మంత్రాన్నివాస్తవంలో ఆచరిస్తూ రుక్మిణమ్మకి అన్నీ తానై సేవలందిస్తున్న ఆదర్శ విభుడు.
మానవత్వం మూర్తీభవించిన మానవతామూర్తి అతడు .
ఓ మనీషీ,
ఓ మహర్షీ ,
ఓ మహాత్మా,
ఓ మనోజ్ణమూర్తీ,
ఓ మార్గదర్శీ,
ఓ చిత్రకళా చక్రవర్తీ ,
ఓ అభినవ బృహస్పతీ..
ఆధర్శ దాంపత్య నిలువెత్తు నిదర్శనమైన మా
అభినవ కృష్ణమూర్తి అయిన మీకు ,మీ సహధర్మచారిణి రుక్మిణమ్మకీ
ఈ సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేళ పరిపూర్ణ ఆయుష్షునివ్వాలని ఆ పరమాత్మునికి సహస్రకోటి నమస్సులర్పిస్తూ ...
మీపాదారవిందాలకివే మా అభివందన మందార సుమ మాలికలు .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి