*నీ చుట్టూ...*
నీవు వెన్నెలై కురుస్తున్నావు
నిలువునా తడుస్తూ నేను
కన్నార్పక చూస్తుంది రాత్రి
ఆకాశం బుగ్గలు ఎర్రబడ్డాయి
ఓర్వలేని నిశానిష్పాలు
వివర్ణమౌతూ నిరసన ప్రకటిస్తున్నా
వివశత్వంలోనే ఘడియలన్నీ..
అంచులు లేని ఆకాశంపై
ఆగీతం ఆలపిస్తూ నీవు
ఆలకిస్తూ వేకువరెక్కలపై
నింపాదిగా సోలిపోతూ నేను
ఇంతలో తూరుపు విరబూసింది
ఇంతలా నన్ను నీవని ఏమార్చింది
ఇంకేముంది నీ మురళి
నా ముంగురులతో నాట్యం చేయిస్తూ..
నా ఎదసొదలో నీ ఊపిరి
మమేకమౌతూ...
కదలని నా కలలనిండా...
వదలవుగా నీతలపులతుంపరలు
ఎలా నిలిచేది నేను
మది మధువనిలో కూరుకుపోతుంటే
ఎలా మరిచేది నిన్నూ
కథ నీ చుట్టూ అల్లుకుపోతుంటే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి