ఎటు చూసినా .....
నీ అడుగుల సడి .
ప్రతీ జడిలో
నీవేనని తడబడి ,
ఘడిఘడికీ మకరందపుమధుజడిలో
నీ తలపులు చొరబడి ,
నిద్దుర కొరవడి
ఆ ఊహల ఒరవడిలో
నులివెచ్చని నీ ఒడిలో ...
తలవాల్చిన నా మది
అది తనువును విడివడి
విహంగమాయే వినీలగగనానికెగబడి,
అరఘడియైనా
నువు లేక నేను
పూవు లేని తావిని
నీ జత లేని నేను
సిరా లేని పెన్ను
నువ్వెంట లేని గమనం
అది ఎండమావి పయనం
నీతో నడచిన సప్తపదుల సాక్షి
కలనయినా...నేను
నిను చూడక నేనుండలేను,
సవరించిన నా కురులసాక్షి
నీ సాంగత్యమే వేయిపున్నముల సాటి.
శ్రీమణి.
pandoorucheruvugattu.blogspot.in
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
7, నవంబర్ 2017, మంగళవారం
అడుగులసడి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి