ఎంకన్న ఇయ్యాల పలకరించాడు
పలుకుల్లో తేనెల్లు
చిలకరించాడు
బంగారుఉయ్యాల
కలలవాకిట్లో
కొంగుబంగరుతల్లి అలిమేలుమంగతో
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
కన్నీరు తుడిచి
పన్నీరు పోసి,
వెతలన్ని తీసేసి
వెన్నెల్లు బోసి,
చిన్నబోయిన నాకు
చిరునవ్వుపూసి
నేనున్నా ..నీకంటూ
నావెన్నుగాసి
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
అమ్మలా లాలించి
అమ్రృతం వడ్డించి
నాన్నలా ఆడించి
నను లాలిపుచ్చి
ఆడించిపాడించి
ఆనందడోలికల
ఓలలాడించి
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
.......శ్రీమణి.
ఎవరైనాఈపాటను స్వర పరచగలిగితే నా అద్రృష్టంగాభావిస్తాను.
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
17, ఆగస్టు 2017, గురువారం
ఎంకన్న ఇయ్యాల పలకరించాడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి