ధరహాసపునీమోమును గని
విరబూసిన
సుమమనుకొని
ఝుమ్మని తుమ్మెద గ్రోలబోయెనే.....శ్రీమణి
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
22, ఆగస్టు 2017, మంగళవారం
21, ఆగస్టు 2017, సోమవారం
ప్రణయమా...అభివందనం
ప్రేమంటే గెలుపు ప్రేమంటే మలుపు ప్రేమంటే తియ తీయని తలపు ప్రేమంటే వసివాడని వలపు ప్రేమంటే ఓదార్పు ప్రేమంటే మాయని మైమరపు ప్రేమంటే ఒక హాయి నిట్టూర్పు ప్రేమంటే జత హృదయాల పలకరింపు ప్రేమంటే ఒక తొలకరి పులకరింపు ప్రేమంటే అనురాగసుధల చిలకరింపు ప్రేమంటే నమ్మకమనే తెగింపు నిజమైన ప్రేమెప్పుడూ త్రిప్పదు మడమ ఓడిపోతే అది కేవలం మోహపు భ్రమ ఎప్పటికీ ప్రేమ మకరంధాన్నే చిందిస్తుంది కన్నీటిని చిమ్మిదంటే ఆ ప్రేమను అపనమ్మకం కమ్మేసిందనే స్వచ్చమైన ప్రేమ మనిషి మట్టి కలిసినా మనస్సునంటే పయనిస్తుంది , మరణమన్నది మనిషికేగా .. మనసుకెందుకు అంటుతుందది అందుకే ప్రణయమా ... నీకు అభివందనం అందుకో .. .. ప్రతీ మది నీరాజనం . సాలిపల్లి మంగామణి @శ్రీమణి pandoorucheruvugattu.blogspot.in
కల-అల
రెపరెపలాడే కనురెప్పలమాటున గుప్పుమన్నకలలెన్నెన్నో
గుప్పెడుగుండెల చప్పుడు మాటున ఉప్పొంగుతున్న అలలెన్నెన్నో...శ్రీమణి
17, ఆగస్టు 2017, గురువారం
ఎంకన్న ఇయ్యాల పలకరించాడు.
ఎంకన్న ఇయ్యాల పలకరించాడు
పలుకుల్లో తేనెల్లు
చిలకరించాడు
బంగారుఉయ్యాల
కలలవాకిట్లో
కొంగుబంగరుతల్లి అలిమేలుమంగతో
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
కన్నీరు తుడిచి
పన్నీరు పోసి,
వెతలన్ని తీసేసి
వెన్నెల్లు బోసి,
చిన్నబోయిన నాకు
చిరునవ్వుపూసి
నేనున్నా ..నీకంటూ
నావెన్నుగాసి
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
అమ్మలా లాలించి
అమ్రృతం వడ్డించి
నాన్నలా ఆడించి
నను లాలిపుచ్చి
ఆడించిపాడించి
ఆనందడోలికల
ఓలలాడించి
చింత తీర్చగచిటికెలో
వచ్చావా సామీ...
చిత్రమేదో..నీ చిత్తమేగాసామీ..."ఎం"
.......శ్రీమణి.
ఎవరైనాఈపాటను స్వర పరచగలిగితే నా అద్రృష్టంగాభావిస్తాను.