శ్రీరంగనాధా మమ్మేలంగ రావా ...
నేను ఆచరిస్తున్న ధనుర్మాస వ్రతధీక్ష ఫలవంతమవ్వాలని మీ ఆశీర్వాదం
గోదా దేవి శ్రీరంగనాథుని ఆరాధించి,భక్తి తన్మయత్వంతో స్వయంగా లిఖియించిన అమృతతుల్యమగు తిరుప్పావై పాశుర ప్రభందం లో ఈ రోజు మొదటి పాశుర రత్నం చదివి మా ఇంటిలో అత్యంత సుందరంగా ధనుర్మాసవ్రతాన్ని ప్రారంభించి తరిస్తూ ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మీతో పంచుకోవాలని ...
తిరుప్పావై మొదటి పాశురము
మార్గళి త్తిఙ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్,పోదుమినోసెరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పొడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నందగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోధై యిళంశింగమ్
కార్మేనిచ్చ ఙ్గళ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్
తెలుగులో అర్ధం ,
మాసములన్నింటిలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవంతుడు చెప్పియున్నాడు. మార్గశిర మాసమనగా మనం అవలంభించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము. శ్రీకృష్ణుడనే చెట్టు నీడ ఎక్కువ చల్లగానూ వేడిగానూ ఉండదు. అలాగే వాసుదేవ స్వరూపమైన మార్గశిరమాసం కూడా సమశీతోష్ణముగా ఉండే కాలం. మనం ఉదయం మేల్కొనే కాలం సత్వగుణసంపన్నమైన బ్రాహ్మి ముహూర్తము. అంతేగాక ఈ మార్గశిర మాసంలో పైరుపంటలన్ని విరగ కాసి పండి ఉంటాయి. అతి మనోహరమైన వెన్నెలలు వెదజల్లే శుక్లపక్షంలో పవిత్రమైన రోజున ఈ వ్రతం ప్రారంభించినామని కాలాన్ని ప్రశంసించుట ఇందులోని అర్ధము. భగవంతుని సమాగమమును కోరుకుని ఆతని సంతోషపరచడానికి అతనికిష్టమైన పనులు చేయడానికి ఇది ఉత్తమోత్తమైన సమయమనిచెలికత్తెలను మేల్కొని స్నానము చేసి, రండని పిలుస్తూ “ప్రకృతి మండలమందు ఆనందము అనుభవించేవారలారా” అని ఆండాళ్ సంబోధించింది. ఈ పిలుపులో ఒక మహత్తరమైన భావముంది. పరమపదమున నివసించుటకంటే ప్రకృతిమండలమైన గోకులంలో నివసించుట అంటే ఆ భగవంతునితో కలిసి మెలిసి ఉంటూ మహదానందము అనుభవించే మహాద్భాగ్యం లభిస్తుంది అని ఆమె నమ్మిక..
జై శ్రీమన్నారాయణ
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి