5వ పాశుర రత్నం
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
5వ పాశురం తెలుగు భావార్ధం;
మనమందరమూ ఈ వ్రతము నాచరించి ఫలమును పొందుటకు,మనమొనర్చిన పాపకృత్యములు ఆటంకపరచునేమో యనెడి భయము నొందవలదు. అందులకు కారణమేమన;మన వ్రతమునకు శ్రీకృష్ణుడే నాయకుడై యున్నాడుకదా!అనేక ఆశ్చర్యకరములగు గుణ విశేషములు,క్రియలను కల్గినవాడాతడు.ఉత్తర మధురకు నిర్వాహకునిగా ఆవిర్భవించి,నిర్మలములై,గంభీరమైన జలములుగల యమునానదీ తీరవాసిగా,మనకొరకై గొల్లకులము నందుదయించి ఈ కులమును ప్రకాశింపచేసినటువంటి మంగళ కర దీపమై యున్నాడు. ఇంకనూ తన జన్మముచే యశోదా దేవి యొక్క గర్భమును కాంతివంతమొనరించిన పర్వతమును కల్గియూ ఆమెచే కట్టబడినటువంటి సులభుడున్నూ!కాబట్టి మనమందరమున్నూ సందేహాదులనెడి మలినములు లేక నిర్మలులమై,ఆతని యొద్దకు సమీపించి,చేతులారా నిర్మలమయిన మన హృదయపుష్పమును సమర్పించి నోరారా గానమొనరించి,మనసారా ధ్యానమొనరించాలి. తక్షణమే నిల్వయున్నటువంటి సమస్త పాపరాశియు,రాబోయెడి పాపముల యొక్క రాశియున్నూ అగ్నియందుబడిన దూదిపింజవలె భస్మమయి మన ఈ వ్రతమున కవరోధము తొలగిపోవును. అందుచే రండు,భగవన్నామమును కీర్తింతుము.
ఈ రోజు 5వ పాశుర పారాయణము చేసాను. మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ ......
జై శ్రీమన్నారాయణ
సాలిపల్లి మంగామణి@శ్రీమణి
pandoorucheruvugattu.blogspot.in