పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

28, ఏప్రిల్ 2021, బుధవారం

🙏🌷🌷🌷🌷🌷🌷🙏శ్రీ వంశీ రామరాజు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూడు రోజుల ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవంలో పాల్గొని కవితా గానంచేసినందుకుగాను *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో నమోదైన ప్రశంసాపత్రంమరియు వంశీ గ్లోబల్ అవార్డ్ అందుకొన్న శుభతరుణం మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ.... *శ్రీమణి*🙏🌷🌷🌷🌷🌷🙏

🙏🌷🌷🌷🌷🌷🌷🙏
శ్రీ వంశీ రామరాజు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూడు రోజుల 
ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవంలో
 పాల్గొని కవితా గానం
చేసినందుకుగాను *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో నమోదైన ప్రశంసాపత్రం
మరియు వంశీ గ్లోబల్ అవార్డ్ 
అందుకొన్న శుభతరుణం 
మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ.... *శ్రీమణి*
🙏🌷🌷🌷🌷🌷🙏

7, ఏప్రిల్ 2021, బుధవారం

తెలంగాణా రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా,మంథని పట్టణానికి చెందిన శ్రీ గౌతమేశ్వరా సాహితీ కళా సేవాసంస్థ వారు *జాతీయ స్థాయి ఉగాది పురస్కారం 2021*తో పాటు *సాహితీ ప్రావీణ్య*బిరుదు ప్రదానం చేసిన శుభతరుణం మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ... *శ్రీమణి*

తెలంగాణా రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా,మంథని పట్టణానికి చెందిన శ్రీ గౌతమేశ్వరా సాహితీ కళా సేవాసంస్థ వారు 
 *జాతీయ స్థాయి ఉగాది పురస్కారం 2021*
తో పాటు *సాహితీ ప్రావీణ్య*
బిరుదు ప్రదానం చేసిన శుభతరుణం మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...
           *శ్రీమణి*

2, ఏప్రిల్ 2021, శుక్రవారం

కథానాయిక

అమృతాన్ని 
ఔపోసన పట్టినట్టు 
ఆకాశాన్ని 
అదిమి పట్టినట్టు  
మబ్బులతో  
దోబూచులాడి
ఇంద్రధనుస్సు 
వంపులో 
ఇమిడిపోయినట్టు
పున్నమి జాబిలి
వెన్నెల హాయికి 
పులకించిన  
నెచ్చెలి కలువను 
నేనన్నట్లు 
అచ్చరకన్యలతలదన్నే
అప్సర నేనన్నట్లు 
అందాల రాజ్యానికి 
 అధినేత్రి  నైనట్టు 
రంగూ రంగుల 
సీతాకోక చిలుకల్లె
 విరబూసిన  
 పూదోటల్లో విహరించినట్టు 
స్వాతి చినుకు ముద్దాడిన
 ముత్యం నేనే అన్నట్టు 
అరుణోదయ ఉషస్సులో 
 ఆ సంద్రంపై మెరిసే
అలనైనట్టు ,
అలా ... అలా ...
అలా ... అలలా 
మెదిలిన 
నా మధురమయిన 
కలల సడికి 
నులువెచ్చని 
నా నిదుర చెడి 
నివ్వెరబోయా ! 
ఆ రవి కిరణపు తాకిడికి,
కలలో మనకు  మనమే
 కధానాయిక  ..... కదా ...
          సాలిపల్లిమంగామణి(శ్రీమణి)

యద్దనపూడి సులోచనారాణి

తెలుగు సాహితీ లోకంలో 
 మెరిసిన మహిళామణిదీపం
తెలుగు నవలారచనలలో
అత్యున్నత శిఖరం,అద్భుతకథలను 
ఆంధ్రావనికందించినఅమృతకలశం
ఆమె..కలం అజరామరం
ఆమెకధలు కరతలామలకం
 ఆమే మన సుప్రసిద్ధ
నవలాసామ్రాజ్యాధినేత్రి
యద్ధనపూడి సులోచనారాణి
మద్యతరగతి మగువలను
తనకలంతో కలల అలలపై
తేలియాడించి,
మద్యతరగతిజీవితాలను
కధావస్తువులుగా...
సగటుజీవితాలకు సజీవసాక్ష్యాలుగా..
కడురమ్యమైన రచనలుచేసి
అశేష ఆంధ్రావనినీ తన రచనల
 రసాస్వాదనలో ఓలలాడించి...
కుటుంబసంబంధాలు,
భార్యాభర్తల అనుబంధాలు,
మద్యతరగతి మగువల
వ్యక్తిత్వం,ఆత్మాభిమానం
ఆమెరచనలలో ప్రతిబింబించి
మూడుతరాలపాఠకులను మంత్రముగ్ధులనుగావించి....
రచనాప్రక్రియను 
తనదైనశైలిలో కొత్తపుంతలు
 తొక్కించిన యావత్ నవలా చరిత్రకే
 కలికితురాయి,ఆమె
నిన్నటి రచయిత్రి అయినా
నేటికీ ఆమెరచనలు
 టీవీసీరియళ్ళరూపంలో
ప్రేక్షకుల అభిమానాన్ని
చూరగొంటున్నాయంటే
ఆమె కలం సిరాను బదులు
మన మానసరాగాలను నింపుకొందేమో..అనిపిస్తుంది
ఆవిడను కనులారా..
చూసే భాగ్యం నాకు
కలగలేదు గానీ..
నాచిన్నప్పుడు
మాఅమ్మగారు ఆమెకు అభిమాని,మాఅమ్మగారు
ఆవిడనవలలు ఒక్కటికూడా
 విడవకుండా చదివి
మానాయనమ్మగారికి వినిపించేవారు
ఆక్రమంలోఅది విన్న నేను ఒకవిధమైనమధురమైన అనుభూతికిలోనయ్యేదాన్ని,
అలాచిన్నతనంలోనే ఆమెరచనలపట్ల ఆకర్షితురాలయ్యాను..
ఆవిడరాసిన ఎన్నోకధలను ధారావాహికరూపంలో
చూసిన,చూస్తున్న మనమందరం
 ధన్యులమే
మధురకధలను పదిలపరచి
గగనసీమకు పయనమైనా
పదిలమేగా పదితరాలకూ
తెలుగువారి హృదయాలలోన
ఆవిడను ఎప్పటికైనా
కలిసి మాట్లాడాలనే నాఆశ
తీరనేలేదు..కానీ ఆ 
మహారచయిత్రిని గురించి
మాట్లాడడానికి అర్హతలేని
అణువంతదాననైనా..
ఆమె ఆత్మకు శాంతిని,
 మోక్షాన్ని ప్రసాదించాలని ఆభగవంతుని
మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నా.
యద్దనపూడి సులోచనారాణి 
(జయంతి సందర్భంగా వారి స్మరణలో...)
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*