పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
27, మార్చి 2021, శనివారం
శ్రీశ్రీ కళావేదిఠ
26, మార్చి 2021, శుక్రవారం
🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏ఈరోజు ఆకాశవాణి (All India Radio)విశాఖపట్నంకేంద్రంలో ప్రసారం కాబడినమహిళా వాణి కార్యక్రమంలోనా స్వీయ కవితాగానం వినిమీ అమూల్యమైన స్పందనలనుఅందించి ఆశీర్వదించగలరు *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏
🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏
🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏
ఈరోజు ఆకాశవాణి
(All India Radio)
విశాఖపట్నం
కేంద్రంలో ప్రసారం కాబడిన
మహిళా వాణి కార్యక్రమంలో
నా స్వీయ కవితాగానం విని
మీ అమూల్యమైన స్పందనలను
అందించి ఆశీర్వదించగలరు
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏 విని
మీ అమూల్యమైన స్పందనలను
అందించి ఆశీర్వదించగలరు
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏
25, మార్చి 2021, గురువారం
మల్లినాథసూరి కళాపీఠం
24, మార్చి 2021, బుధవారం
*అంతా మిథ్య*
23, మార్చి 2021, మంగళవారం
గోదావరి రచయితల సంఘం ప్రశంసా పత్రం
మనిషితనం
22, మార్చి 2021, సోమవారం
మల్లినాథసూరి కళాపీఠం
ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తెలుగు కళివేదిక,వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కవితోత్సవంలో పాల్గొని ప్రశంసాపత్రం అందుకొన్న శుభతరుణం ... *శ్రీమణి* 🌹🙏🙏🙏🙏🙏🌹
20, మార్చి 2021, శనివారం
అకటకటా..!
అకటకటా..!
అందరికీ మచ్చికైన
అందాల పిచ్చుక
మచ్చుకూ...మిగలదంట
అంతరించబోతుందట
బుజ్జిబుజ్జి పిచ్చుక
పిట్టకథలకే పరిమితమంట
చిట్టిపొట్టి పిచుక కథ
కంచికి చేరబోతుందట
బంగారు పిచ్చుకకు భూమిపై
నూకలు చెల్లిపోయెనంట
కిచకిచలింక వినబడవంట
అచ్చిక,బుచ్చిక మాటలు కావివి
శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చిన పచ్చినిజాలు
ఈ దారుణమారణకాండకు
మనమే కారణమంట
మన విచ్చలవిడి వికిరణాల
విషప్రయోగధాటికి,ప్రకృతిప్రకోపానికి,భానుని తాపానికి,పెరిగిన భూతాపానికి
తాళలేక,తలదాచుకునేవీలులేక,
గ్రుక్కెడు నీళ్ళు దొరక్క,
డొక్కలెండి,రెక్కలుడిగి
అకటకటా.....కటకటమని నేలరాలుతున్నాయట
అమ్మో...!వింటుంటేనే గుండెకలుక్కుమంటుందికదూ..
మనమంతా కాకమ్మ,పిచ్చుకమ్మ
కధలు వింటూనే పెరిగాం..
పిచుకమ్మేగా....మన అభిమానకధానాయిక
అలనాటి మన పిట్టకధల్లో...
పిచ్చుకలేని బంగారు బాల్యం
ఊహించగలమా.....చిట్టి పిచుక
మట్టికలవబోతుందంటే,తట్టుకోగలమా
అందుకే...అందరం..
ఒక నిమిషం ఆలోచిద్దాం
మన ఆత్మీయనేస్తాల కోసం
గుప్పెడు గింజలనూ,గ్రుక్కెడునీళ్ళనూ
అందుబాటులో వుంచి...ఆదుకుందాం.
మన తప్పిదాలకు మనవంతు
పరిహారం చేసుకుందాం
మరుగబవబోతున్న మరోజాతిని
మనమే బ్రతికించుకొందాం.
(అంతర్జాతీయ పిచ్చుకల
దినోత్సవంసందర్భంగా).. *శ్రీమణి*
19, మార్చి 2021, శుక్రవారం
నిత్యం సాహితీ సేవలో భాగంగా *"సేవ"* సిగ్నల్ సమూహంలోఏరోజు కారోజు కవితా పోటీ నందు తేది 12.03.2021 న ప్రధమ బహుమతి పొందిన శుభ సందర్భంగా ప్రసంసాపత్రం అందుకొన్న శుభ సందర్భంగా మీతో పంచుకోవాలనే అభిలాషతో మీ ఆశీస్సులు ఆకాంక్షిస్తూ.. *శ్రీమణి*🙏🌹🌹🌹🌹🌹🌹🙏
మేలైన తరుణమనీ...
*మేలైన తరుణమనీ...,*
మేలుకొంటి వేకువనే
మేలిమి బంగరుసామిని
మేలుకొలుప
మేలైన తరుణమనీ...,
మరులు గొలిపె మాధవునికి
మరుమల్లెల మాలనల్లి
మనసారా ... మోకరిల్లి
మదిలో మెదిలే మధుర
భావాలను...
మదన గోపాలుని
పాదాలపై పదిలంగా పరిచానంతే..,
మువ్వగోపాలకృష్ణా...యని
ముదమారా...పిలిచానంతే...,
ప్రణయ సుధా మాధవా...అని
ప్రియమారా...తలచానంతే...
తనువు,మనసూ తదేకమై
తన్మయమై
తన తలపులు లోగిలిలో
తలవాల్చుకునిదురించిననాకు,
మరుమల్లియ మాల...విరిసిన
నా కవితల పూమాలై
కనుల ముందు సాక్షాత్కరించింది...
కమలాక్షుడిలా కటాక్షించె
కాబోలు..... కడుచిత్రంగా..,
(మాధవుడే నను నడిపించే నాగురువు )
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
17, మార్చి 2021, బుధవారం
శ్రితకల్పవల్లీ..
*శ్రితకల్పవల్లీ*
శ్రీమాతా శ్రీచక్రవాసినీ
శ్రితకల్పవల్లీ,
శ్రీ కనక మహాలక్ష్మి కళ్యాణీ,
కనకత్కనక భూషిణి, కామాక్షి,
శ్రీకనక దుర్గాంబికా
ముగ్గురమ్మల మూలపుటమ్మవి
అష్టలక్ష్మీదేవి అవతారమే నీవు
నీపాద మంజీరనాదాలే
మాపాలి సంజీవనాదాలు
నీ కనుసైగ చేతనే
పెనుద్రవములైనా తప్పు
అమ్మా ఆపద్భాందవీ
అనాధరక్షకీ కాచి కాపాడవే
కటాక్షమ్మునీయవే
జగజ్జననీ.. జగదానందకారిణీ
విశాలజగమునేలేటి విశాలాక్షీ
కోరిన కోరికలీడేర్చేటి
కొంగుబంగారుతల్లీ
సకలైశ్వర్యకారిణీ
సర్వసౌభాగ్యదాయినీ
అనుగ్రహంబీయవే
అమృతవర్షిణీ
ఆర్తులపాలిట ఆశ్రితదైవమా
నిశ్చేతనములనైనను
చైతన్యమున్ చేయు
నీకరుణావీక్షణాలు ప్రసరించి
మము బ్రోవు సర్వోపద్రవనాశినీ
అరుదెంచవమ్మా అఖిలజగానికి
అభయమునీయగ ఆశ్రితదైవమా.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
16, మార్చి 2021, మంగళవారం
విషస్వప్నం
11, మార్చి 2021, గురువారం
ఈశ్వరా...
*ఈశ్వరా...*
నిన్ను నమ్మిన మదికి
మాలిన్యమంటునా...
నిను కాంచిన కనులు
అంధకారమెరుగునా...
నిను మ్రొక్కిన కరములకు
కొరవడునా అదృష్టం
నీనామస్మరణమే
అమృతాస్వాదనం శివా...
ఈశ్వరా యన్నట్టి ఏ ఇంటనైనా
ఇడుములకు ఇసుమంత
తావుండునా ...
మారేడు పత్రాన్ని మనసార అర్పించ
మారాతనే మార్చేటి మా రేడు వయ్యా
భోళా శంకరుడా బోలెడంత దయ నీది
నీ చల్లని చూపులే మా పాలిట
వేయి కాంతిదీపాలు
నీ కనుసైగ చేతనే కరుగును మాపాపాలు
దోసెడు నీటిని నీపై
మనసార జారవిడిచిన చాలు
అసలుండునా...ఆపై
కన్నీటి ఆనవాలు
దొడ్డ మనసయ్యా నీది జంగమయ్యా...
సర్వమూ నీకెరుకె సాంబమూర్తీ
ఆపద్బాంధవుడవయ్యా హరా
ఆదిదేవుడా...
మమ్మాదుకోవయ్యా ముక్కంటి
నీ దివ్య పాదాల మ్రొక్కితి
నీవే మా దిక్కంటూ మోకరిల్లి.
*(మహా శివరాత్రి శుభాకాంక్షలతో)*
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
10, మార్చి 2021, బుధవారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..
8, మార్చి 2021, సోమవారం
🙏మహిళ🙏
4, మార్చి 2021, గురువారం
అంతఃసౌందర్యం
అంతఃసౌందర్యం*
అందమంటే మనిషిదా..!
అందమైన మనసుదా...!
పట్టరాని అందమంటే
పైపైన సౌందర్యమా...
అపురూప లావణ్యమంటే
రూపురేఖలకే పరిమితమా...
అంగాల అమరిక కాదు గదా అందం
అంతరంగ సోయగమే
అత్యద్భుత సౌందర్యం
అచ్చంగా అందమంటే
స్వచ్ఛమైన మనసేగా...
ఆత్మశుద్ధితోనే సాధ్యమగును
అద్వితీయ ఆనందం
అంతఃసౌందర్యమే...దానికి
అనువైన సాధనం
కాలగమనంలో కరిగిపోయేది
బాహ్యసౌందర్యమైతే
అక్షయమైన ఆనందం
మనసునంటిన సౌశీల్యమనే మకరందం
పైపైన మెరుగులకే
ఆకర్షితమౌతాము గానీ
హృదయాంతరాళాలను
తరచి చూడమెందుకో...?
బాహ్యమైన సొగసులకై
బంధీలమే గానీ బహుకాలం
నిలుచునా...పలుచనైన ఆబంధం
నిజమైన అంతఃసౌందర్యం గాంచిన
అనుబంధం విడివడునా.. ఏనాడైనా...
చక్కదనం అంటే చక్కని ఆలోచనావిధానం
ఒసపరితనమంటే
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
ఎనలేని అందమైనా మనలేదు
మేలిమంటి మనసు ముందు
అందులకే నేస్తం
అందమైనమాట
అందమైన ఆలోచన
అందమైన నడత
ఆదుకునే గుణముంటే
ఆద్యంతం ఆ అందం మన సొంతం
అసలు సిసలు ఆనందమే
ఆసాంతం.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*