పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, జులై 2018, ఆదివారం

*సినారె*

ఉరికే ఘన
సాహిత్యపు ఝరి *సినారె*
వెలిగే
కవన రాజ శిఖరి *సినారె*
మధురిమల
పలుకుసిరి .... *సినారె*
సిరి చందనాల
విభావరి........ *సినారె*
రసరమ్య
పద లాహిరి.....  *సినారె*
తెలుగు భాషలో
వెలుగై విరబూ *సినారె*
వేల హృదయాలు
మధురంగా దోచే *సినారె*
అక్షరాలలో
అమృతాన్ని కలబో *సినారె*
పదములనె పంచదార
పాకంలోముంచి తీ *సినారె*
అశేష భారతావనిని
తన పాటల పల్లకిలో
పరవశింప చే *సినారె*
మమ్మలరింప  చే *సినారె*
మా మనసులు కాజే *సినారె*
ఎంతపనిచే *సినారె*
ఇంతలోనే
గగనసీమకెగ *సినారె*
మము కన్నీళ్ళ పాల్జే *సినారె*
శోక సంద్రాన ముంచే *సినారె*

అక్షరవనమాలికి
అక్షరనివాళులర్పిస్తూ...
                               *శ్రీమణి*

ఈరోజు కర్నాటక ఆదివారం ఆంధ్రజ్యోతిలో నాకవిత గురుదేవోభవ

27, జులై 2018, శుక్రవారం

కృష్ణం వందే జగద్గురుం

కరువాయెను కవితకు
ఆదరణ అని
బరువెక్కిన హృదయంతో,
ఎరుపెక్కిన వదనంతో
వెనుదిరిగిన తరుణంలో
గురువాయెను మాధవుడే, దిశానిర్దేశం చేయ మార్గదర్శియై...
కన్న తల్లి పాలు ,
తండ్రి మురిపాలు
పసిబిడ్డకు జీవం పోస్తే ,
గురువు ఆశీస్సులే చాలు  
కలం పట్టిన కవి కావ్యం
పండడానికి 
అల్లిబిల్లి అక్షరాలు
కవితా సుమాలై విరబూయాలన్నా  ,
హిమశిఖరపు అంచులంత ఎత్తుకెదిగిపోయినా...
ఒదిగిపోనా ... 
నాగురుపాదాల చెంత 
నా కవితా రధానికి సారధి
‌ అయిన మాధవునికి
సహస్ర కోటి కృతజ్ఞతా
సుమాలతో...
ప్రణమిల్లుతూ...
  గురుపౌర్ణమి శుభదినాన
   గురువులందరి ఆశీస్సులు
       ఆకాంక్షిస్తూ... శ్రీమణి.

25, జులై 2018, బుధవారం

అక్షర సేద్యం

అరక్షణమూ ...
ఆదమరచక
అక్షర యాగం చేస్తున్నా...
అనుక్షణమూ...అన్వేషిస్తూ..
అచ్చమైన తెలుగును
ఔపోసన పడ్తున్నా...
అభిజ్ఞను కానునేను
అతిసాధారణ అతివను
హృదయం చవిచూసిన
అనుభూతులను
అక్షరీకరిస్తున్నా...
ప్రకృతితో ప్రతీ
సౌందర్యాన్నీ
పదాలతో పదిలం
గావిస్తున్నా...
ఉదయించే
ప్రతి కిరణం
కవితనై
ప్రతిబింబిస్తున్నా...
సమాజానికి
నవఉషస్సునివ్వాలని
ఆకాంక్షిస్తూ...
నాలో మెదిలిన ప్రతిభావాన్నీ
ప్రతిగా...ప్రతిబింబిస్తున్నా..
పట్టాలు పట్టులేదుగానీ
మాతృబాషపై పట్టరాని
మమకారంతో....
కాలంతో పాటు నా కలాన్ని
కదిలిస్తూ...కవనసేద్యం
సాగిస్తున్నా...
                 శ్రీమణి

24, జులై 2018, మంగళవారం

మనసంతా...నువ్వే!


మౌనంగా...ఉన్నా...
నా మనసంతా నువ్వే...
మాటలాడ లేకున్నా...
నా ధ్యాసంతా... నువ్వే
నా కనుపాపలో నిన్ను
కాపాడుకొంటున్నా...
కవి(కవయిత్రి)ని కదా...కవనంతో
కాలం గడిపేస్తున్నా....
అక్షరాలతో..నిన్ను అభిషేకిస్తున్నా...
నా పద భావాలపల్లకిలో
ఊరేగిస్తున్నా....
నీ ఊహలకు
ఊయలేసి
ఊరడిస్తూనే ఉన్నా...
నీతలపులలో
తలవాల్చుకు
నిదురిస్తున్నా....
మరచిపోలేను..ప్రభూ...
నువు నా మది గీసిన చిత్తరువు
విడిచిపోలేను...ప్రభూ
నా ప్రతి శ్వాస లోనూ...నీవు.

(రాధమ్మ కవనంలో కిట్టయ్య..స్మరణం)
                      శ్రీమణి

19, జులై 2018, గురువారం

ఓ...మనిషీ....చచ్చిపో..

ఓ...మనిషీ....చచ్చిపో..
మనసంటూ...ఉంటే
మానవజాతికి శాశ్వతంగా
శలవుచీటీ ఇచ్చిపో...
దారుణాలు చూడలేక
ధరణి బ్రద్ధలవ్వక మునుపే
అవమానభారంతో
అవని అంతరించక మునుపే
కనులముందు కలికాలం
తాండవిస్తోంది.
మరులు గొన్న మనభూమి
మరుభూమిని తలపిస్తోంది
రాక్షసత్వం రాజ్యమేలుతోంది
పైశాచికత్వం పడగవిప్పి
బుసలుకొడ్తోంది.
అడుగడుగునా.‌..
ఆడబిడ్డల ఆక్రందనలే...
అరసెకనుకొక అత్యాచారం...
కలికాలమో...
కన్నీటి కాలమో...మరి!
కటిక కసాయిల...
కామాంధుల కర్కశ రక్కసిక్రీడలో...
రక్తాశ్రువులు చిందిస్తుంది
చిన్నారుల బంగారుబాల్యం
తెల్లారకమునుపే
ఎందరో చిట్టితల్లుల
నిండు జీవితాలు
అతిదారుణంగా..
తెల్లారి పోతున్నాయి
అడుగడుగున
ఆడబిడ్డలఆర్తనాదాలు
మరణమృదంగాలై
మారుమ్రోగుతున్నాయి
కణకణమండే వల్లకాడునే
తలపిస్తోంది...నేలతల్లి
కన్నతల్లుల గుండెమంటతో
విలపిస్తూ‌..‌.
ఎక్కడుందిక...మానవత్వం
ఏం చేస్తే...మారుతుంది
ఈ మానవమృగాళ్ళ నైజం
అడ్డంగా...నరికేయాలా
అగ్ని కి ఆహుతి చెయ్యాలా
ఆ నయవంచకుల తాట వలిచి
చిట్టితల్లులకు చెప్పులు
కుట్టించాలా....
చెల్లించక తప్పదుగా
భారీమూల్యం
చిదిమేసిన ప్రతి చిన్నారి
బాల్యానికీ....(చిన్నారులపై...
జరుగుతున్నఅత్యాచారాలకు మనసు వికలమైరాసిన కన్నీటికవనం)
               శ్రీమణి.

కలలే...కావ్యాలై

అప్పుడే తెల్లారింది
కాబోలు...
చప్పుడు చేయక
నా మోమును
స్పృశియించిది..
తూరుపు సింధూరం..
కనులు విప్పానో లేదో
కిటికీ నుండే
శుభోదయం చెప్పేసింది
నావైపే...
రెప్పేయక చూస్తూ
అప్పుడప్పుడే రేకులు
విచ్చుకొన్న ఎర్రని మందారం
ఎప్పటిలాగే
మంచుదుప్పటికప్పుకున్న
పచ్చిక ప్రశాంతంగా నవ్వుతూ పలకరించింది...ప్రకృతిలో
పరవశమంతా ...తన వశమన్నట్లు .....
నా కన్నులు చూసిన
దృశ్యాలన్నీ ఎప్పటిలాగే
కనువిందు చేస్తున్నాయి
కానీ...
నిన్నటి రేయి నాకన్నుల
కదిలిన కమ్మని కలలే
తెల్లారగనే...చప్పున
కరిగీ మరుగవుతున్నాయి
నా కన్నులు కాంచిన కలలన్నిటినీ కావ్యాలుగా
అక్షరీకరించాలేమో!
కలకాలం...
కమ్మని ఆ అనుభూతులు
తనివితీరా ...
ఆస్వాదించాలంటే....
ఎట్టాగోలా...
కన్నుల్లోనే కట్టేయాలేమో‌..
కట్టుకధలు చెప్పి జారుకొన్న
నా కిట్టయ్యను..పట్టేయాలంటే
(రాధామాధవప్రణయామృతం)
                       .... శ్రీమణి.

15, జులై 2018, ఆదివారం

యాదాద్రి శిల్ప కళావైభవం లో సత్కారం

తెలంగాణా రాష్ట్రం
యాదాద్రి శిల్ప కళావైభవం
లో 1116మంది
కవులతో శిల్పులకు అక్షరనీరాజనాలర్పిస్తూ..
శ్రీలక్ష్మీ నారసింహుని
దివ్య సన్నిధిలో నిర్వహించబడిన
ప్రపంచరికార్డు
కవితోత్సవంలో
పాల్గొని సత్కారం
అందుకొన్న శుభతరుణం‌..