ఎద నందన వనమున
సుమసుగంధ వీచిక ప్రేమ,
హృదిస్పందన శృతి లయగా
వినిపించిన మృదుగీతిక ప్రేమ,
మది సాంతం నిండియున్న
వింత విషయసూచిక ప్రేమ,
పడుచు మనసున విరిసిన మల్లియ ప్రేమ,
కురిసిన వెన్నెల ప్రేమ
కలలమాటున.... కనురెప్ప చాటున....
కన్నుగీటుతూ పలుకరించిన
కలవరింత ప్రేమ
తొలి పులకరింత ప్రేమ
ఇదే ప్రణయ ప్రబంధం
జతహ్రృదయాలు
రాసుకొనే రసమయ గ్రంధం.
........... . శ్రీమణి
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
17, ఏప్రిల్ 2017, సోమవారం
ప్రణయ ప్రబంధం
14, ఏప్రిల్ 2017, శుక్రవారం
మరువగలమా..మహాత్మా...
మరువగలమా...మహాత్మా...
మహోన్నతమౌ నీ మానవతా గరిమా...,
అభివర్ణించగలమా...అభిజ్ఞా..
నీ అత్యద్భుత కర్తవ్యధీక్షాపటిమ.
అక్షరాలుచాలునా....
అంబేద్కరా..
అలుపెరుగని
నీ అకుంఠిత సేవాస్ఫూర్తికి,
కడజాతి వారికై
కధనరంగ సింగంలా...
ఎడతెగనీ..నీ తెగింపు.
మరువగలమా..
సమసమాజస్థాపనకై
అస్ప్రశ్యత శ్రృంఖలాల
తెగనరకుటకై,
వెలివాడల బ్రతుకుల్లో..తొలిదివ్వెను
రువ్వేందుకై
దళిత జనోద్దరణకై,
నువ్విచ్చిన పిలుపును,
మధనపడే బ్రతుకుల్లో నువ్విచ్చిన ఓదార్పును,
మరువగలమా...
నువ్వందించిన మహోత్క్రుష్ట రాజ్యాంగాన్ని,
సమానత్వానికై నువు సాగించిన
సమరాన్ని,మరువగలమా...
ధరిత్రి వున్నంతవరకూ..
చెరగని చరిత్ర కదా..నీ తలంపు.
ఓ..మనీషీ...
ఓ..మహర్షీ .
ఓ ..మహాత్మా..
ఓ..మార్గదర్శీ..
ఓ..మానవతామూర్తీ...
ఆచంద్రతారార్కమూ..
భరతజాతి అభివందనాలు మీకు,
నిమ్నజాతికై నిన్నటి నీ కృషికి
నిత్య నీరాజనాలు మీకు,
అంతరాలు చెరిపేసి
సమాంతరాలు కల్పించిన
కరుణాంతరంగుడా..
వందల తరాలు మారినా..
వందల అభివందనాలు మీకు...
అంబేద్కర్ జయంతి సంధర్భంగా...నివాళులర్పిస్తూ.....
శ్రీమణి
5, ఏప్రిల్ 2017, బుధవారం
రమణీయమదివో...
కమనీయమదివో
కమలాలయని కళ్యాణము
అద్భుతమదివో
అమోఘమదివో,
అమృతాస్వాదనమదివో
అయోధ్య రాముని కళ్యాణము
కొలచిన చాలట నిత్యసౌభాగ్యము
ఆకాశం ఆణిముత్యాల పందిరి
పట్టంచు పావడాలు,పట్టుపీతాంబరాలు
దేవుని పెళ్ళికి మనమేచుట్టాలు
జానకి రాములనిత్య కళ్యాణం
(శ్రీరామనవమి శుభాకాంక్షలతో )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి