పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
8, నవంబర్ 2014, శనివారం
1, నవంబర్ 2014, శనివారం
అధినాయకుడు
మా పాలి ఆ దైవం నియమించిన బంటువి .
కావయ్యా .. .. నీవూ మామూలు నాయకుడువి .
మొక్కవోని ధీక్షలో మొట్టమొదటి సైనికుడవు .
పొగడాలని కాదు నిన్ను . ఎడతెగనీ నీ తెగింపు .
కుదేలయిన వైశాఖికి తిరుగులేని ఓదార్పు .
హుదూద్ బెబ్బులి పంజా దెబ్బకి కమిలిన మా గుండెల్లో
కొండంతటి ధైర్యం పూసి , కర్తవ్యం తక్షణమే స్ఫురింపచేసి
కార్యోన్ముఖులను చేసి ,కాంతి రేఖ నీవై నిలిచి
విశాఖ విషణ్ణ వదనాలలో కొత్త దివ్వె వెలిగించి
చిందర వందరయిన విశాఖను బహు సుందర నందన వనముగ మార్చాలని
ఒక ఋషిలా శ్రమించి "అధినాయకుడను " పదాన్ని ఆత్మీయతతో అధిరోహించి
అలసిన మాకు బాసట నిలిచిన ఆత్మబంధువు నీవు .
తిన్నావో .. లెదో .. .. కన్నతల్లి గుండె నీది . మాకు తిండి మెతుకులివ్వాలని ఆరాటంలో ....
కునుకయినా .. తీశావో ... లెదో ... చెదిరిన మా గూళ్ళే ... నీ కలలోకొచ్చి .
నిన్నటి కటిక చేదు విష విలయాన్ని నీల కంఠుని వోలె నీలోనే దాచి
నీ కరుణామృత ధారలతో మాకూరటనిచ్చి
పెను తుఫాను సైతం తలవంచేలా ...........
చేజారిన బ్రతుకుల్లో , బేజారయిపోయిన మా గుండెల్లో
మనోధైర్య బీజాలను , మానవతా తేజాన్ని మాలో నింపి, మోడువారిన నేలపైన కొత్త చివురులు తొడిగించి
మార్గదర్శి వై నిలిచి , మా ఇలవేలుపువయినావు .
ఆ రాకాసి సుడిగాలి రక్కసి కర్ఖశ క్రీడలో చేతలుడిగి నా విశాఖ నడివీధిలో
నిల్చుంటే ,శిలలా వెలవెలబోతే ,కన్నేర్రజేసిన కడలి ప్రకోపానికి కకావికలమై , కళా విహీనమయి
మరుభూమిని తలపిస్తే ,
కారు చీకటైన మా బ్రతుకుల్లో వెన్నెల కురిపిస్తానని వాగ్ధానం చేసిన విశాఖ చందురుడవు నీవు
పడి లేచే కెరటానికి ఉందా .. అలసట అంటూ ....
మరలా మనం వెలగాలని మార్గం నిర్దేశించి
మొద్దు నిద్దరోతున్న నాయకులను ఉలిక్కిపాటు చేసి
అధికార యంత్రాంగాన్ని ఆసాంతం కుదిపేసి
నవ విశాఖ నిర్మాణం సంకల్పించి ,కధన రంగ సింగంలా రంగంలో దూకి
కర్తవ్య ధీరుడవై ముందుకు నడచేవు . మాలో ఒకడిగ నిలిచావు .
మా ఆశా జ్యోతిగా నిలిచేవు .
(నిన్నటి హుదూద్ విలయంలో విలవిలలాడిన నాటి నుండి నేను ఆయనను కలసి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎన్నో విదాల ప్రయత్నించి
విఫలమయి నా మనస్సులోని కృతజ్ఞతను , వేవేల గుండెల్లో భావనను
ఆయనకు చేరాలనే చిరు ఆకాంక్షతో మీ అందరితో పంచుకొంటున్నాను .. .. ఒక సాదారణ గృహిణి )
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)