పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

24, అక్టోబర్ 2012, బుధవారం

విజయదశమి (దశరా) శుభాకాంక్షలు




దశరా వచ్చేను సరదాల పరదాలతొ
లోగిళ్ళు నిండేను కోటి దీపాలతో
బంతుల చామంతుల విరులతో
బతుకమ్మలనలంకరించగా
వచ్చింది దశరా సరదాల సందళ్ళతో
పప్పు బెల్లాలు పిల్లలకు,
వరహాలు దరహాసాలు పంతుళ్ళకు
ఆయుధపూజలు, వాహన పూజలు
బొమ్మల కొలువులు తీరుగ తీర్చెను కన్నుల పండువుగా
బూరెలు, బొబ్బట్లు, పులిహోర, పరమాన్నం
పసందైన వంటకాలు ఘుమ ఘుమలతొ,
పట్టు బట్టలు ధరించి పసిడి కాంతులతో అలరారు ఇంతులతో, 
పసుపు కుంకుమల నడుమ ప్రతి ఇంట సౌభాగ్యంతో,
చిరునవ్వులు కురిసేను విరిజల్లులై
వచ్చింది వచ్చింది దశరా తెచ్చింది తెచ్చింది భలే సరదా

బ్లాగరులకు, వీక్షకులకు విజయదశమి (దశరా) శుభాకాంక్షలు

8, మార్చి 2012, గురువారం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

కార్యేషు దాశి, కరణేషు మంత్రి,
భోజ్యేషు మాతా, శయనేషు రంభ,
క్షమయా ధరిత్రి
బహురూపముఖి అయిన ఓ మహిళా మూర్తీ
నీకివే మా శతకోటి వందనాలు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.







14, జనవరి 2012, శనివారం

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం సుస్వాగతం


హేమంత ఋతువు మంచు తెరల్లో 
చల్లగ వీచే చల్లని గాలులను 
భోగి మంటలతో కాగుతూ 
గొబ్బిళ్ళ గౌరమ్మ పసుపు కుంకుమలతో 
రంగవల్లుల చేరి మెరిసింది సంక్రాంతి 
వన్నె వెలుగులతోటి విరిసింది సంక్రాంతి 
ముద్దుగుమ్మల తోడ నవ్వింది సంక్రాంతి
బసవన్న సిరిమువ్వ చిన్ని సవ్వడులతో 
వేకువనే హరిదాసు పసిడి తత్వాలతో
ముత్యాల పంటలతో నిండింది సంక్రాంతి 
మా గాదెలే నిండగా సిరిలక్ష్మి అందెలతో 
వచ్చింది సంక్రాంతిలక్ష్మి మన వాకిళ్ళ లోకి 
ఇచ్చింది మా కనుల వేయికాంతులను 
తెచ్చింది మన ఇంట భోగభాగ్యాలను

బ్లాగోకానికి  
భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు