పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

20, మార్చి 2021, శనివారం

అకటకటా..!

అకటకటా..!
అందరికీ మచ్చికైన
అందాల పిచ్చుక
మచ్చుకూ...మిగలదంట
అంతరించబోతుందట
బుజ్జిబుజ్జి పిచ్చుక
పిట్టకథలకే పరిమితమంట
చిట్టిపొట్టి పిచుక కథ
కంచికి చేరబోతుందట
బంగారు పిచ్చుకకు భూమిపై
నూకలు చెల్లిపోయెనంట
కిచకిచలింక వినబడవంట
అచ్చిక,బుచ్చిక మాటలు కావివి
శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చిన పచ్చినిజాలు
ఈ దారుణమారణకాండకు
మనమే కారణమంట
మన విచ్చలవిడి వికిరణాల
విషప్రయోగధాటికి,ప్రకృతిప్రకోపానికి,భానుని తాపానికి,పెరిగిన భూతాపానికి
తాళలేక,తలదాచుకునేవీలులేక,
గ్రుక్కెడు నీళ్ళు దొరక్క,
డొక్కలెండి,రెక్కలుడిగి
అకటకటా.....కటకటమని నేలరాలుతున్నాయట
అమ్మో...!వింటుంటేనే గుండెకలుక్కుమంటుందికదూ..
మనమంతా కాకమ్మ,పిచ్చుకమ్మ
కధలు వింటూనే పెరిగాం..
పిచుకమ్మేగా....మన అభిమానకధానాయిక
అలనాటి మన పిట్టకధల్లో...
పిచ్చుకలేని బంగారు బాల్యం
ఊహించగలమా.....చిట్టి పిచుక
మట్టికలవబోతుందంటే,తట్టుకోగలమా
అందుకే...అందరం..
ఒక నిమిషం ఆలోచిద్దాం
మన ఆత్మీయనేస్తాల కోసం
గుప్పెడు గింజలనూ,గ్రుక్కెడునీళ్ళనూ
అందుబాటులో వుంచి...ఆదుకుందాం.
మన తప్పిదాలకు మనవంతు
పరిహారం చేసుకుందాం
మరుగబవబోతున్న మరోజాతిని
మనమే బ్రతికించుకొందాం.
(అంతర్జాతీయ పిచ్చుకల
దినోత్సవంసందర్భంగా).. *శ్రీమణి*

1 కామెంట్‌: