*శ్రితకల్పవల్లీ*
శ్రీమాతా శ్రీచక్రవాసినీ
శ్రితకల్పవల్లీ,
శ్రీ కనక మహాలక్ష్మి కళ్యాణీ,
కనకత్కనక భూషిణి, కామాక్షి,
శ్రీకనక దుర్గాంబికా
ముగ్గురమ్మల మూలపుటమ్మవి
అష్టలక్ష్మీదేవి అవతారమే నీవు
నీపాద మంజీరనాదాలే
మాపాలి సంజీవనాదాలు
నీ కనుసైగ చేతనే
పెనుద్రవములైనా తప్పు
అమ్మా ఆపద్భాందవీ
అనాధరక్షకీ కాచి కాపాడవే
కటాక్షమ్మునీయవే
జగజ్జననీ.. జగదానందకారిణీ
విశాలజగమునేలేటి విశాలాక్షీ
కోరిన కోరికలీడేర్చేటి
కొంగుబంగారుతల్లీ
సకలైశ్వర్యకారిణీ
సర్వసౌభాగ్యదాయినీ
అనుగ్రహంబీయవే
అమృతవర్షిణీ
ఆర్తులపాలిట ఆశ్రితదైవమా
నిశ్చేతనములనైనను
చైతన్యమున్ చేయు
నీకరుణావీక్షణాలు ప్రసరించి
మము బ్రోవు సర్వోపద్రవనాశినీ
అరుదెంచవమ్మా అఖిలజగానికి
అభయమునీయగ ఆశ్రితదైవమా.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి