పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

16, మార్చి 2021, మంగళవారం

విషస్వప్నం

అదేదో రాకాసికల
రాతిరిని చంపి రక్తం తాగేసింది
అందమైన భావాలను
హత్యచేసి నన్ను అగాధంలోకి
లాగేసింది
నా ఆశలపై చప్పున నీరు చిమ్మి
నన్ను నిర్దాక్షిణ్యంగా
నైరాశ్యపు నడివీధికీడ్చి
నను ఏమార్చి
మగతనిద్రలో విగతజీవిగా..మార్చి
విషస్వప్నమై వికటాట్టహాసం
చేసింది...
  ‌‌                      శ్రీమణి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి