పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

గురువారం 8 మార్చి 2012

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

కార్యేషు దాశి, కరణేషు మంత్రి,
భోజ్యేషు మాతా, శయనేషు రంభ,
క్షమయా ధరిత్రి
బహురూపముఖి అయిన ఓ మహిళా మూర్తీ
నీకివే మా శతకోటి వందనాలు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.







శనివారం 14 జనవరి 2012

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం సుస్వాగతం


హేమంత ఋతువు మంచు తెరల్లో 
చల్లగ వీచే చల్లని గాలులను 
భోగి మంటలతో కాగుతూ 
గొబ్బిళ్ళ గౌరమ్మ పసుపు కుంకుమలతో 
రంగవల్లుల చేరి మెరిసింది సంక్రాంతి 
వన్నె వెలుగులతోటి విరిసింది సంక్రాంతి 
ముద్దుగుమ్మల తోడ నవ్వింది సంక్రాంతి
బసవన్న సిరిమువ్వ చిన్ని సవ్వడులతో 
వేకువనే హరిదాసు పసిడి తత్వాలతో
ముత్యాల పంటలతో నిండింది సంక్రాంతి 
మా గాదెలే నిండగా సిరిలక్ష్మి అందెలతో 
వచ్చింది సంక్రాంతిలక్ష్మి మన వాకిళ్ళ లోకి 
ఇచ్చింది మా కనుల వేయికాంతులను 
తెచ్చింది మన ఇంట భోగభాగ్యాలను

బ్లాగోకానికి  
భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు
 

బుధవారం 26 అక్టోబర్ 2011

దీపావళి శుభాకాంక్షలు



చామంతుల,  పూబంతుల తోరణాలు 
గృహలక్ష్ముల దీపాలతో, ధనలక్ష్ములకు పూజలు 
కొత్తదుస్తులలో మగువల అందచందాలు 
మామ గారి కానుకలతో మురిసిన కొత్త అల్లుళ్ళు 
తీయని మిథాయితో తాతాగారి బోసినవ్వులు 
మతాబులు చిచ్చుబుడ్లతో బుడతల కేరింతలు 
కాకరపూవత్తులతో అమావాస్యలో వెన్నెల వెలుగులు 
టపాసులు, తారాజువ్వలతో 
తారాస్థాయికి చేరిన ఆనందాల హరివిల్లు 
మిరుమిట్లుగొల్పుతూ  కోటి దివ్వెలతో వచ్చింది దీపావళి 
మన  ముంగిలిలో సువర్ణ కాంతులను నింపినది ఈ దీపావళి 
మన జీవితాలను  వేయి వెలుగుల సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో నింపాలని 
కోరుకుంటూ బ్లాగరులందరికీ దీపావళి శుభాకాంక్షలు  



ఆదివారం 23 అక్టోబర్ 2011

నిను చూసిన క్షణం

నా ఆశల ఊపిరి నీవే 
నా ఊహల రూపం నీవే 
నా జీవిత గమ్యం నీవే 
నా కలలకు సాక్షివి నీవే 
నా తలపుల రేడువి నీవే 
నా వలపుల చెలికాడివి నీవే 
నిన్ను చూసిన చాలు 
నా కళ్ళ లొగిళ్ళ పూదోట నిలిచేను 
అవధుల్లేని ఆనందం 
ఉవ్వెత్తున అలల లా లేచేను 
వద్దన్నా  వినకుండా మేను పులకరించేను 
అలవోకగ నా ఆశలు తెరచాపలా పయనించేను 
చెంత చేరి కోకిలమ్మ కబురులేవొ చెప్పేను 
వింత వింత ఊహలతో మది ఉక్కిరిబిక్కిరి అయ్యేను 
మాట రాక నా అధరాలు మూగబోయి చూసేను 
నిను చూసిన క్షణం  
నా ఊహలలోని   నీకోసం