పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

24, జూన్ 2018, ఆదివారం

బాలబాటఆత్మీయ సత్కారం

విశాఖపట్నం పౌరగ్రంధాలయంలో
బాలబాట మాసపత్రిక
దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా తెలుగురక్షణవేదికజాతీయ అద్యక్షులు కళారత్న
శ్రీపొట్లూరిహరికృష్ణగారు,
బాలబాట అద్యక్షురాలు
శ్రీమతి స్వరాజ్యం రమణమ్మగారు,
కేంద్రసాహితీఅకాడమీ
బాలసాహిత్య పురస్కారగ్రహీత
శ్రీనారంశెట్టి
ఉమామహేశ్వరరావు
గారిచేతులమీదుగా....
ఆత్మీయ సత్కారం
పొందిన శుభతరుణం

16, జూన్ 2018, శనివారం

రంజాన్ శుభాకాంక్షలు

నెల వంక సాక్షిగా...
నెల రోజుల
ఉపవాస ధీక్షగా ...
సాగిన మీ భక్తికీ,
అక్షరాలా...
మహిమాన్విత
పవిత్ర ఖురాన్  రక్షగా ....
పొందిన మీ శక్తికీ,
ప్రేమకుశాంతికి
నెలవైన మీస్ఫూర్తికీ
సహనానికిక్షమకూ..
మానవత్వ మాన్యతగా
సాగిన మీ లక్ష్యానికీ,
దానం,దయాగుణాలకు
దర్పణమై వెలిగిన మీకీర్తికి
సత్యతకుసఖ్యతకూ..
సత్ప్రవర్తనా విధేయతకు
కట్టుబడిన మీ ధర్మనిరతికీ
మానవసేవయే
దైవ సేవయని నమ్మి,
సాటి మనుజునిలో
భగవంతుని దర్శించే
మీమానవత్వ జ్యోతికీ,
పవిత్ర రంజాన్ పర్వదినాన  
మా శిరస్సు వంచినమస్కరిస్తూ ....
మహమ్మదీయ సహోదరులందరికీ
వేవేలశుభాకాంక్షలతో..
           
                  శ్రీమణి

11, జూన్ 2018, సోమవారం

స్వంతత్ర భారతం


ఓ..స్వంతత్ర భారతమా ... 
అవినీతికి,అన్యాయానికి
  నీవుఆలవాలమా ?
ఓ..ప్రజాస్వామ్య  దేశమా 
ప్రజల పాలిట శాపమా ... 
విన్నావా ..
సగటు జీవిఆర్తనాదాలు?
కన్నావా .. కన్నీటి కధనాలు ?
మరచినావా .. మానవత్వం 
నేర్చినావా .. పైశాచికత్వం ?
కలచివేసే బ్రతుకులే
కన్నులకగుపిస్తున్నా 
కాలానికి వదిలేసి కళ్ళు మూసుకొంటున్నావా ..
తెల్ల దొరల కాలంలో
బానిస బ్రతుకే...బ్రతికాం 
నేటి ప్రజాస్వామ్య  వ్యవస్థలో
బ్రతుకే బరువాయె కదా .. 
అణువణువున స్వార్ధంతో
అల్లాడుతున్న వ్యవస్థ 
మంచం లేచిన మొదలు లంచమే లాంచనమాయె
నిత్యావసరాల ధరలు నిత్యంవేధిస్తుంటే...
నల్ల ఖజానాలు మాత్రం
నింగికెగసిపోయెనా ?
వెల పెరిగిన వేగంతో
నెల జీతం పెరగదేం?
నీరసించెనా..ధర్మపాదం
పెచ్చుమీరెనా...అధర్మవాదం
రాదంటారా....
మనంకలలుగన్న సమాజం
లేదంటారా ...
సుభిక్షమమైనజనజీవనం
అర్ధరహితమంటూ..
వృధాయత్నమంటూ...
ఈవ్యవస్ధ ఇంతేనని
తమమట్టుకు
తలపట్టుకు...కూచోక
మననుండే..మొదలెడితే
మార్పు అనే మరమ్మత్తు
మనవంతుగ కృషిచేస్తే
మాన్యమవదా..వ్యవస్ధ
యావత్తూ...
ప్రతి ఒక్కరు స్పందిస్తే..
ప్రపంచమే..మారదా?
పట్టువీడక ప్రయత్నిస్తే...
పసిడిపండదా!బీడుభూమిలో?
                       
                 శ్రీమణి

4, జూన్ 2018, సోమవారం

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినం సందర్భంగా

ఏగానగాంధర్వుని
కన్నానని
తెలుగునేల గర్వంతో
ఉప్పొంగిపోతుందో...
ఏఘనసంగీతమాలకించి
గగనం సైతం పులకించిందో...
ఏస్వరమైతే
అశేషభరతావనికీ...
అద్భుత వరమయ్యిందో
ఏ"బాలు"ని గానం విని
ఆబాలగోపాలమూ...
అమృతాన్ని..చవిచూసిందో
ఏస్వరమాలకించగానే ప్రకృతిలో పరమాణువుసైతం
పరవశమైపాడుతుందో..
ఏగాత్రంవింటూనే..
ప్రతిహృదయానికి
చైత్రం ఎదురవుతుందో...
ఏరాగం వింటూనే..
ఎద వెన్నెల్లో
స్నానమాడుతుందో..
ఏగొంతుచేరగనే
సరిగమలన్నీ
మధురిమలైసుధలు
గుమ్మరిస్తాయో...
ఏనోట పలికితే
పాటలు..తేనెల ఊటలై
జాలువారుతాయో..
ఏగళమున చేరితే
రాగాలన్నీ...
మానసరాగాలై
వెల్లివిరుస్తాయో...
అతడే...
మనసుస్వరాల
సుమమాలి
ఉరికే సంగీత ఝరి,
స్వర రాజశిఖరి
సరిగమలతో
స్వర్ణరాగాలు పలికించి
కొసరికొసరి తన
గానామృతాన్ని ఒలికించి
మనలనలరించ
భువికేతెంచిన
ఘన గానగాంధర్వులు
బహుబాషాగాయకులు
బహుముఖ ప్రజ్ఞాశాలి
మృధుస్వభావి..
సహృదయులు..
సప్తస్వర మాంత్రికులు
శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు
సప్తపదులు దాటి
ముచ్చటగా మూడవవసంతంలోకి(73)
అడుగిడుతున్న శుభసందర్భంలో...
చిరు..అక్షరమాలికతో
జన్మదినశుభాకాంక్షలర్పిస్తూ..
                 
                        శ్రీమణి