ఉరికే ఘన 
సాహిత్యపు ఝరి *సినారె*
వెలిగే 
కవన రాజ శిఖరి *సినారె*
మధురిమల 
పలుకుసిరి .... *సినారె*
సిరి చందనాల 
విభావరి........ *సినారె*
రసరమ్య 
పద లాహిరి.....  *సినారె*
తెలుగు భాషలో 
వెలుగై విరబూ *సినారె*
వేల హృదయాలు 
మధురంగా దోచే *సినారె*
అక్షరాలలో 
అమృతాన్ని కలబో *సినారె*
పదములనె పంచదార
 పాకంలోముంచి తీ *సినారె*
అశేష భారతావనిని 
తన పాటల పల్లకిలో 
పరవశింప చే *సినారె*
మమ్మలరింప  చే *సినారె*
మా మనసులు కాజే *సినారె*
ఎంతపనిచే *సినారె*
ఇంతలోనే 
గగనసీమకెగ *సినారె*
మము కన్నీళ్ళ పాల్జే *సినారె*
శోక సంద్రాన ముంచే *సినారె*
అక్షరవనమాలికి
 అక్షరనివాళులర్పిస్తూ...
                               *శ్రీమణి*
 
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి