ఓ...మనిషీ....చచ్చిపో..
మనసంటూ...ఉంటే
మానవజాతికి శాశ్వతంగా
శలవుచీటీ ఇచ్చిపో...
దారుణాలు చూడలేక
ధరణి బ్రద్ధలవ్వక మునుపే
అవమానభారంతో
అవని అంతరించక మునుపే
కనులముందు కలికాలం
తాండవిస్తోంది.
మరులు గొన్న మనభూమి
మరుభూమిని తలపిస్తోంది
రాక్షసత్వం రాజ్యమేలుతోంది
పైశాచికత్వం పడగవిప్పి
బుసలుకొడ్తోంది.
అడుగడుగునా...
ఆడబిడ్డల ఆక్రందనలే...
అరసెకనుకొక అత్యాచారం...
కలికాలమో...
కన్నీటి కాలమో...మరి!
కటిక కసాయిల...
కామాంధుల కర్కశ రక్కసిక్రీడలో...
రక్తాశ్రువులు చిందిస్తుంది
చిన్నారుల బంగారుబాల్యం
తెల్లారకమునుపే
ఎందరో చిట్టితల్లుల
నిండు జీవితాలు
అతిదారుణంగా..
తెల్లారి పోతున్నాయి
అడుగడుగున
ఆడబిడ్డలఆర్తనాదాలు
మరణమృదంగాలై
మారుమ్రోగుతున్నాయి
కణకణమండే వల్లకాడునే
తలపిస్తోంది...నేలతల్లి
కన్నతల్లుల గుండెమంటతో
విలపిస్తూ...
ఎక్కడుందిక...మానవత్వం
ఏం చేస్తే...మారుతుంది
ఈ మానవమృగాళ్ళ నైజం
అడ్డంగా...నరికేయాలా
అగ్ని కి ఆహుతి చెయ్యాలా
ఆ నయవంచకుల తాట వలిచి
చిట్టితల్లులకు చెప్పులు
కుట్టించాలా....
చెల్లించక తప్పదుగా
భారీమూల్యం
చిదిమేసిన ప్రతి చిన్నారి
బాల్యానికీ....(చిన్నారులపై...
జరుగుతున్నఅత్యాచారాలకు మనసు వికలమైరాసిన కన్నీటికవనం)
శ్రీమణి.
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
19, జులై 2018, గురువారం
ఓ...మనిషీ....చచ్చిపో..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి