కరువాయెను కవితకు
ఆదరణ అని
బరువెక్కిన హృదయంతో,
ఎరుపెక్కిన వదనంతో
వెనుదిరిగిన తరుణంలో
గురువాయెను మాధవుడే, దిశానిర్దేశం చేయ మార్గదర్శియై...
కన్న తల్లి పాలు ,
తండ్రి మురిపాలు
పసిబిడ్డకు జీవం పోస్తే ,
గురువు ఆశీస్సులే చాలు
కలం పట్టిన కవి కావ్యం
పండడానికి
అల్లిబిల్లి అక్షరాలు
కవితా సుమాలై విరబూయాలన్నా ,
హిమశిఖరపు అంచులంత ఎత్తుకెదిగిపోయినా...
ఒదిగిపోనా ...
నాగురుపాదాల చెంత
నా కవితా రధానికి సారధి
అయిన మాధవునికి
సహస్ర కోటి కృతజ్ఞతా
సుమాలతో...
ప్రణమిల్లుతూ...
గురుపౌర్ణమి శుభదినాన
గురువులందరి ఆశీస్సులు
ఆకాంక్షిస్తూ... శ్రీమణి.
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
27, జులై 2018, శుక్రవారం
కృష్ణం వందే జగద్గురుం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి